కలెక్టరేట్, న్యూస్‌లైన్: వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షలు నిర్వహించిన స్ఫూర్తితో 23న జరిగే పంచాయతీ కార్యదర్శుల పోటీ పరీక్షలూ కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ చిరం జీవులు కోరారు. గురువారం కలెక్టరేట్ లోని ఉదయాదిత్య భవన్‌లో పరీక్షల విధులు కేటాయించిన అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. పరీక్షలు రాసే అభ్యర్థులు మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోరాదన్నారు. కేవలం ప్రతిభ ఆధారంగా మాత్రమే పోటీ పరీక్షలలో అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని సూచించారు. మొత్తం గా 59,793 మంది 133 పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. పుకార్లను కూడా అభ్యర్థు లు నమ్మరాదని, మనోధైర్యంతో పరీక్షలకు హాజరుకావాలని కోరారు.
చిన్న పొరపాట్ల వల్ల హాల్‌టికెట్ నంబర్లు వేయడం, ఓఎంఆర్ షీట్లు పూరించడంలో అవగాహన రాహిత్యంతో అభ్యర్థులు అనర్హులవుతున్నారని, ఈ కారణంగా అభ్యర్థులందరూ హాల్‌టికెట్ నంబర్లు, ఇతర వివరాలను నమోదు చేసిన పిదప మాత్రమే ఇన్విజిలేటర్లు సంతకాలు చేయాలని అధికార్ల ను ఆదేశించారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షలకు హాజరు కావాలని కోరారు.
పరీక్ష కేంద్రా ల్లో తాగునీటి సౌకర్యం, విద్యుత్, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించాలని అధికార్లను ఆదేశిం చారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేయడంతోపాటు వీడియోగ్రఫీ చేపట్టాలని కోరారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే భవిష్యత్‌లో మరే పరీక్ష కూడా రాయకుండా అవకాశం కోల్పోతారని హెచ్చరించారు. ఉపాధ్యాయులు పెలైటింగ్ ద్వారా గ్రామ కార్యదర్శి పరీక్షకు హాజరైనచో విధుల నుండి సస్పెండ్ చేయాలని జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వెంకట్రావు, ఏజేసీ నీలకంఠం, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, ఆర్‌డీఓ జహీర్ పాల్గొన్నారు.
పంచాయతీకి పకడ్బందీ ఏర్పాట్లు
Published Fri, Feb 21 2014 3:59 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 AM
Advertisement
Advertisement