ఒంగోలు: ప్రకాశం జిల్లా కంభం పట్టణానికి చెందిన నాగార్జున (18) హైదరాబాద్‌లో ఉండి డిగ్రీ చదువుకుంటున్నాడు. ఇతడు హైదరాబాద్‌కు చెందిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పటంతో వారు అతనిని బుద్ధిగా చదువుకోవాలని మందలించారు. ఇది నచ్చని నాగార్జున బుధవారం ఒంగోలు పట్టణానికి చేరుకున్నాడు.
అక్కడి నుంచి తన సెల్ ద్వారా తల్లిదండ్రులకు ఫోన్ చేసి, తన ప్రేమను అంగీకరించనందున పురుగు మందు తాగి చనిపోతున్నానంటూ చెప్పాడు. దీంతో భయపడిన తల్లిదండ్రులు కొడుకు కోసం వెతకటంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సెల్ సిగ్నల్స్ ఆధారంగా ఒంగోలు బస్టాండు ప్రాంతంలో నాగార్జున ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయం తల్లిదండ్రులకు చేర వేయటంతో వారు నాగార్జునను తీసుకుని, ఇంటికి వెళ్లిపోయారు.
ప్రేమ వ్యవహారంతో యువకుడి హల్‌చల్
Published Wed, Feb 4 2015 11:03 PM | Last Updated on Fri, Nov 9 2018 4:31 PM
Advertisement
Advertisement