ongole police
-
ఒంగోలులో పోలీసుల ఓవరాక్షన్.. బాలినేని ఆగ్రహం
సాక్షి, ప్రకాశం జిల్లా: ఒంగోలులో పోలీసుల తీరుపై బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు సమతా నగర్ ఘర్షణలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారు. తెల్లవారు జామున 4 గంటలకు వైస్సార్సీపీ కార్యకర్తలు ఇండ్లలోకి వెళ్లి పోలీసులు భయబ్రాంతులకు గురి చేశారు. ఘర్షణ పాల్పడిన టీడీపీ కార్యకర్తలను వదిలి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడంపై బాలినేని మండిపడ్డారు. తనను కూడా అరెస్ట్ చేయండంటూ వన్ టౌన్ పీఎస్‌కి బాలినేని వెళ్లారు. ఒంగోలు నగరంలో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. తప్పులు చేయడం.. ఆ నెపాన్ని అధికార వైఎస్సార్ సీపీపై నెట్టేయడం వారికి రివాజుగా మారింది. ప్రశాంతంగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అండ్ కో అలజడి సృష్టించారు. పక్కా ప్లాన్ ప్రకారం అధికార వైఎస్సార్ సీపీ ప్రచారాన్ని అడ్డుకునేందుకు పన్నాగం పన్నారు. అది బెడిసికొట్టేసరికి ఎదురుదాడికి దిగారు. బుధవారం రాత్రంతా హంగామా సృష్టించారు. ఓటమి భయంతో అసలు విషయాన్ని పక్కదోవ పట్టించేలా పచ్చమీడియాను అడ్డం పెట్టుకుని వాస్తవాలు వక్రీకరిస్తూ రెచ్చిపోయారు. మహిళ అని చూడకుండా ప్రచారాన్ని అడ్డుకోవడమే కాకుండా నగరంలో భయానక వాతావరణాన్ని సృష్టించారు. అసలు జరిగింది ఇదీ.. పార్టీ ఏదైనా తోటి మనిషి పట్ల సంస్కారవంతంగా వ్యవహరించడం ఎంతో ముఖ్యమని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య అన్నారు. నగరంలోని 37వ డివిజన్ సమతానగర్ 4వ లైన్లో శ్రీకావ్య, మరోచోట బాలినేని శచీదేవి వేర్వేరుగా గురువారం మహిళలతో మమేకం–సీ్త్రశక్తితో శచీదేవి కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి జరిగిన సమతానగర్ ఘటనపై బాలినేని శ్రీకావ్య మీడియాతో మాట్లాడారు. తాము ఓట్లు అభ్యర్థించడానికి వచ్చామని, వచ్చిన వారిని అవమానించడం మాత్రం సంస్కారం కాదని అన్నారు. బుధవారం జరిగిన ఘటనలో గేటు వేసి తమను లోపలకు రానివ్వకపోగా తమతో పాటు ఉన్న గర్భిణీ అయిన రాజీనామా చేసిన వలంటీర్‌పై భౌతిక దాడికి పాల్పడ్డారన్నారు. తాము అవతలివైపు ఉన్న నాలుగు ఇళ్లకు వెళ్లి వస్తామని, ఇక్కడే ఉండమని గర్భిణీకి చెప్పామన్నారు. తాము అక్కడకు వెళ్లి వచ్చేసరికి ఆమెతో టీడీపీ వర్గీయులు గొడవపడుతుండటంతో ఎందుకు ఇలా చేస్తున్నారని తాము మాట్లాడామన్నారు. దానికి అవతలి టీడీపీ మహిళ వినలేని, చెప్పలేని బూతు పదజాలంతో మాట్లాడిందని, అవి మహిళలుగా తాము చెప్పలేని పదాలని అన్నారు. చివరకు పైనుంచి వాళ్ల కుమార్తె వీడియో తీస్తుండటంతో.. ఎందుకు తీస్తున్నావని ప్రశ్నించగా, ఆమె మాట్లాడిన మాటలు కూడా తట్టుకోలేకుండా ఉన్నాయన్నారు. విషయం తెలుసుకుని మా వద్దకు వచ్చిన మా మమయ్య బాలినేని శ్రీనివాసరెడ్డికి పూర్తి విషయం చెప్పకుండా తామే సర్దిచెప్పి పంపామన్నారు. కానీ, వారు మళ్లీ తమ పక్కన ఉన్న మహిళల పట్ల కూడా అవమానకరంగా మాట్లాడి రెచ్చగొట్టారన్నారు. వారు వీడియో తీస్తూనే ఉన్నారని, తమను మెట్ల వద్దనే అడ్డుకున్నారని, అలాంటప్పుడు తాము వారుండే పైఅంతస్తులోని ఇంట్లోకి ఎలా వెళ్లగలమని అన్నారు. తమకు ఓటు వేయడం ఇష్టం లేకపోతే ఓటు వేయమని చెప్పినా పర్వాలేదని, కానీ, అసభ్యపదజాలంతో దూషిస్తే మాత్రం సహించమని అన్నారు. మన ఇంటికి వచ్చిన వ్యక్తితో నవ్వుతూ మాట్లాడటం అనేది సంస్కారమని, వైఎస్సార్ సీపీ వాళ్ల ఇళ్లకు కూడా టీడీపీ వారు ఓట్లు అభ్యర్థించేందుకు వెళ్లరా అంటూ శ్రీకావ్య ప్రశ్నించారు. ముందస్తుగా ఒక పథకం ప్రకారమే వాళ్లు ఉద్రిక్తత సృష్టించి దురదృష్టకర ఘటనకు కారణంగా నిలిచారన్నారు. -
న్యూయార్క్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని.. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నానని చెప్పి..
ఒంగోలు: పెళ్లి సంబంధం పేరుతో యువతి, ఆమె తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి రూ.17 లక్షలకు పైగా గుంజేసిన వ్యక్తిని ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను జిల్లా ఎస్పీ మలికాగర్గ్ శనివారం మీడియాకు చె ప్పారు. తూర్పుగోదావరి జిల్లాకి చెందిన పొట్లూరి శ్రీబాలవంశీకృష్ణ అలియాస్ ప్రతాపనేని రాజేష్ కుమార్ (35) తెలంగాణలోని ఖమ్మం జిల్లా బుర్హాంపురం మండలం వెంకటేశ్వర నగర్లో ఉంటున్నాడు. ఇతనికి విజయవాడలో కూడా నివాసముం ది. 2008లో కాకినాడలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో రాజేష్ బీ ఫార్మశీ పూర్తి చేశాడు. 2011లో వి వాహం చేసుకుని భార్యతో కలిసి బెంగళూరులో నివాసమున్నాడు. అక్కడ వ్యసనాలకు బానిసై అప్పులు చేయడంతో భార్య విడాకులిచ్చింది. కొంతకాలం ఏటీఎం నేరాలకు పాల్పడి డబ్బులు సంపాదించిన రాజేష్ బ్యాంకర్లు వన్‌టైం పాస్వర్ట్ సిస్టం ప్రారంభించడంతో ఆ నేరాలు చేయడం కుదరక మేట్రిమోనియల్ చీటింగ్‌కు తెరలేపాడు. మోసం చేసిన తీరు ఇదీ... 2021 ఆగస్ట్‌లో ఓ మేట్రిమోనియల్ వెబ్సైట్లో ప్రతాపనేని రాజేష్‌కుమార్ పేరుతో అకౌంట్ ఓపెన్ చేశాడు. ఓ యువతి తల్లిదండ్రులు రాజేష్ వివరా లను అందులో పరిశీలించి అతడిని ఫోన్లో సంప్రదించారు. తాను న్యూయార్క్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగినని, కరోనా పరిస్థితుల కారణంగా హైదరాబాద్‌కు బదిలీ అయి వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నట్లు రాజేష్ వారిని నమ్మించాడు. తాను మళ్లీ ఈ ఏడాది మే లో న్యూయార్క్ వెళ్లాల్సి ఉంటుందని, ఈ లోగా ఆమె సిబిల్ స్కోర్ పెరగాలని వారిని నమ్మించాడు. అనంతరం యువతి క్రెడిట్ కార్డు, వివిధ మార్గాల ద్వారా రూ.17.49 లక్షలను రాజేష్ తన బ్యాంక్ ఖాతాలో జమ చేసుకున్నాడు. స్పందన ఫిర్యాదుతో రంగంలోకి... తన క్రెడిట్ కార్డుల ద్వారా ఇష్టం వచ్చినట్లుగా రాజేష్ రుణాలు తీసుకుంటుండటంతో యువతికి అనుమానం వచ్చింది.దీంతో ఆమె తన రుణాల ప్రాసెస్ మొత్తం రద్దు చేయాలని అడగ్గా అందుకు వారం రోజులు గడువు పడుతుందంటూ రాజేష్ చెప్పాడు. దీంతో ఆమె స్పందనలో ఫిర్యాదు చేసింది. ఎస్పీ మలికాగర్గ్ ఆదేశాల మేరకు రూరల్ సీఐ రాంబాబు, మద్దిపాడు ఎస్ఐ శ్రీరాం విచారించి నిందితుడిని సీతారామపురం కొష్టాలు వద్ద అరెస్ట్ చేశారు. విచారణలో అతనిపై తెలుగు రాష్ట్రాల్లో 16 కేసులు నమోదైనట్లు గుర్తించారు. అతడి నుంచి రూ.8 లక్షలు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. స్వల్ప కాలంలోనే నిందితుడిని అరెస్ట్ చేసినందుకుగాను పోలీసులను ఎస్పీ మలికాగర్గ్ అభినందించి నగదు రివార్డులను అందజేశారు. -
కామాంధుల అరెస్టు
ఒంగోలు/ సాక్షి, అమరావతి: బాలికపై సామూహిక లైంగిక దాడి కేసును ఒంగోలు పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి, మీడియా ముందు ప్రవేశపెట్టారు. తల్లి మందలించిందని ఇల్లు విడిచి ఒంగోలు చేరుకున్న బాలికను ఆరుగురు యువకులు మభ్యపెట్టి గ్యాంగ్ రేప్‌నకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ముగ్గురు మైనర్లు సహా మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదివారం ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాకు ఘటన వివరాలు వెల్లడించారు. నమ్మించి నయవంచన గుంటూరు జిల్లా నల్లచెరువుకు చెందిన బాలిక ఈ ఏడాది మేలో విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తాతయ్యకు సాయంగా ఉండేందుకు వెళ్లింది. అదే సమయంలో ఒంగోలులో కారు డ్రైవర్‌గా పనిచేసే అమ్మిశెట్టి రాము అదే ఆసుపత్రికి ఓ పేషెంట్‌ను తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. పరస్పరం ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. ఈ విషయం తెలిసిన బాలిక తల్లి జూన్ 15న కుమార్తెను మందలించింది. దీంతో మనస్తాపం చెందిన బాలిక రాముకు ఫోన్ చేసి, తాను ఒంగోలుకు వస్తున్నట్లు చెప్పింది. 16వ తేదీ రాత్రి 7 గంటలకు ఒంగోలు బస్టాండ్‌కు చేరుకుంది. రామును కలిసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. బస్టాండ్‌లో కేఆర్ మొబైల్స్ దుకాణంలో పనిచేసే రెండు చేతులు లేని దివ్యాంగుడైన షేక్ బాజీని రాముకు కాల్ చేసేందుకు ఫోన్ ఇవ్వమని అభ్యర్థించింది. షేక్ బాజీ ఫోన్ ఇచ్చినట్లే ఇచ్చి బాలికను మొబైల్స్ దుకాణం వెనుక భాగంలో ఉన్న సర్వీసింగ్ రూమ్‌లోకి బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. 17వ తేదీ అర్ధరాత్రి బాజీ, అతడి స్నేహితులైన ఆవుల శ్రీకాంత్‌రెడ్డి, మరో మైనర్ బాలుడు షాపులోకి వచ్చి బాలికతో మాట కలిపారు. రాము వద్దకు తీసుకెళతామని నమ్మబలికి ఓ గదిలోకి తీసుకెళ్లి సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. బయటకు రాకుండా గదిలోనే నిర్బంధించారు. 19వ తేదీన బాజీ, శ్రీకాంత్‌రెడ్డి, మైనర్ బాలుడు బయటకు వెళ్లిపోయారు. తర్వాత మహేష్ అనే వ్యక్తి, మరో ఇద్దరు మైనర్లు వచ్చి బాధితురాలిపై లైంగిక దాడికి దిగారు. ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు బాలికపై ఈ అరాచకం కొనసాగించారు. 22న తెల్లవారుజామున 3 గంటల సమయంలో మైనర్లలో ఒకడు ఆమెను ఒంగోలు బస్టాండ్ వద్దకు తీసుకొచ్చి ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయాడు. బస్టాండ్ ఆవరణలో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ సంచరిస్తున్న బాధితురాలిని గమనించిన హోంగార్డు వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ సీతారామయ్య దృష్టికి తీసుకెళ్లాడు. ఆయన వెంటనే శక్తి టీమ్‌ను అప్రమత్తం చేసి, బాలిక నుంచి విషయం రాబట్టారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో వేట ప్రారంభించారు. మైనర్లపై జువైనల్ చట్టం ప్రకారం చర్యలు బాలికపై లైంగిక దాడి కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్టు చేశామని, వారిలో ముగ్గురు మైనర్లు అని ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ చెప్పారు. మైనర్లపై జువైనల్ చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. మేజర్లయిన మైనంపాడుకు చెందిన ప్రధాన నిందితుడు షేక్ బాజీ, యం.నిడమానూరుకు చెందిన రెండో నిందితుడు రావుల శ్రీకాంత్‌రెడ్డి, ఆరో నిందితుడైన మద్దిపాడు మండలం పెద్దకొత్తపల్లికి చెందిన పాత్ర మహేష్‌లను అరెస్టు చేశామన్నారు. బాలిక అదృశ్యమైనట్లు గుంటూరు లాలాపేట పోలీసుస్టేషన్లో ఈ నెల 19న కేసు నమోదైనట్లు వెల్లడించారు. నిందితులపై ‘పోస్కో’ చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. కాగా, నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని డీజీపీ గౌతం సవాంగ్ ఓ ప్రకటనలో తెలిపారు. బాధితురాలికి మంత్రి బాలినేని పరామర్శ అత్యాచార ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఒంగోలు రిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఆయన ఆదివారం పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి అధికారులను ఆదేశించారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. లైంగిక దాడి ఘటనపై రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌తో మాట్లాడారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అత్యాచార ఘటన గురించి ఎస్పీ సిద్ధార్థ కౌశల్ రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌కు వివరాలు తెలియజేశారు. -
బాలికపై గ్యాంగ్ రేప్
ఒంగోలు: ఇల్లొదిలి వచ్చిన ఓ బాలికను ట్రాప్ చేశాడో యువకుడు. మాయమాటలు చెప్పి ఆమెను ఒక గదిలో నిర్బంధించాడు. అతడితోపాటు మరో ఐదుగురు యువకులు ఆమెపై నాలుగు రోజులపాటు లైంగిక దాడికి పాల్పడ్డారు. శనివారం అనుమానాస్పద స్థితిలో కనిపించిన బాలికను ఒంగోలు పోలీసులు గుర్తించి.. ఆరా తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు నగరానికి చెందిన ఓ బాలిక తన తాతకు అనారోగ్యంగా ఉండటంతో అతనికి సాయంగా అక్కడి ఆస్పత్రిలో ఉంది. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన రాము అనే టాక్సీ డ్రైవర్ అనారోగ్యంతో ఉన్న ఓ వ్యక్తిని అదే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ సందర్భంలో ఆ డ్రైవర్ బాలికతో మాట లు కలిపాడు. ఆ పరిచయంతో ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఈ విషయం తల్లికి తెలియడంతో కూతుర్ని ఇటీవల మందలిం చింది. దీంతో ఆగ్రహించిన బాలిక ఇల్లు వదిలిపెట్టి ఒంగోలుకు పయనమైంది. బస్టాండ్‌కు చేరుకుని టాక్సీ డ్రైవర్ కోసం వాకబు చేసింది. బస్టాండ్‌లోని ఒక చిరు దుకాణంలో పనిచేసే యువకుడు ఇదంతా గమనించాడు. ఆ బాలికతో మాటలు కలిపాడు. ఆమె సెల్‌ఫోన్ చార్జింగ్ అయిపోవడంతో ఆ యువకుడి షాపులోనే చార్జింగ్ పెట్టుకుంది. ఈ క్రమంలో అతను బాలికకు మాయ మాటలు చెప్పాడు. టాక్సీ డ్రైవర్ ఆచూకీ లభించేంత వరకు తాను ఆశ్రయం కల్పిస్తానని నమ్మించడంతో అతని వెంట నడిచింది. నగరంలోని రద్దీ ప్రాంతంలో గల ఒక రూమ్‌కు బాలికను తీసుకెళ్లిన ఆ యువకుడు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టడంతో పాటు మరో ఐదుగుర్ని ఆమెపై వరుస లైంగిక దాడులకు పురిగొల్పాడు. చివరకు శనివారం ఒంగోలు బస్టాండ్‌లో వదిలిపెట్టి వెళ్లిపోయారు. పోలీసులు విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. నిందితులలో ఇరువురు ఇంటర్మీడియెట్ చదివిన యువకులు ఉన్నట్టు తెలుస్తుండగా.. మరో నలుగురు యువకులు ఇంజనీరింగ్ విద్యార్థులని ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మాట్లాడుతూ ఇప్పటికే తమ సిబ్బందిని రంగంలోకి దించామని, ఆరుగురు నిందితులను గుర్తించామన్నారు.ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. -
ఆగండి.. ఆగండి!
►వాహనాల స్పీడ్‌కు ఇక చెక్ ►40 కిమీ దాటితే రూ.300ల జరిమానా ►సెన్సర్ల ద్వారా స్పీడ్ లేజర్ గన్‌తో వాహన వేగం షూట్ ► రోజుకు 60 నుంచి 70 వాహనాలకు జరిమానా విధిస్తున్న పోలీసులు చీమకుర్తి రూరల్ : హైటెక్ టెక్నాలజీ సాయంతో పోలీసులు హైస్పీడ్ వాహనాలను గుర్తిస్తున్నారు. వెంటనే ప్రింటౌట్ తీసి ఎగువనున్న పోలీసులకు సమాచారం అందించి వెంటనే రూ.300ల చలానా రాసేస్తున్నారు. ఒంగోలు నుంచి పొదిలి వైపు వెళ్లే కర్నూలు రోడ్డులో పేర్నమిట్ట వద్ద ఒకటిన్నర నెల నుంచి హైస్పీడ్ వాహనాలను పోలీసులు నియంత్రిస్తున్నారు. ట్రాఫిక్ ఎస్ఐ రంగనాథ్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసు ఇంటర్ సెప్టర్ వాహనంలో ప్రత్యేకంగా అమర్చిన స్పీడ్ లేజర్‌గన్ సాయంతో 40 కిమీ కంటే ఎక్కువ వేగంగా వచ్చే వాహనాలను గుర్తించి వెంటనే ఆ వాహనం ప్రింటౌట్ బయటకు తీస్తున్నారు. దానిలో ఆ వాహనం వస్తున్న వేగం ఎంత, రావాల్సిన వేగం ఎంత.. వంటి పూర్తి వివరాలతో సహా వాహనం ఫొటోతో ప్రింటౌట్ వస్తుంది. వెంటనే వేగాన్ని అతిక్రమంచిన వాహనానికి సంబంధించిన సమాచారాన్ని వైర్లెస్ సెట్లో ఎగువనున్న పోలీసులకు అందిస్తారు. ఫొటో తీసిన ప్రింటౌట్ను ఎగువకు వెళ్లే ఇతర వాహనదారుల ద్వారా పంపిస్తారు. ఎగువన వేగాన్ని అతిక్రమించిన వాహనదారుడిని పోలీసులు జెండా ఊపి పక్కకు తీస్తారు. వారికి ఒక్కొ వాహనానికి రూ.300 చొప్పున చలానా రాసి పంపిస్తున్నారు. ఇలా హైటెక్ పోలీసు ఇంటర్ సెప్టర్ వాహనాలు రాష్ట్రంలో మూడే మూడు ఉన్నాయి. ఒకటి వైజాగ్, రెండు తిరుపతి, మూడు పేర్నమిట్ట. ప్రమాదాలు ఎక్కవ జరిగే చోట నిఘా: ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న చోట్ల హైటెక్ ఇంటర్ సెప్టర్ వాహనాలు ఉంచుతున్నారు. కర్నూలు రోడ్డులో ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి ఒంగోలు వరకు మధ్య ప్రాంతంలో ఎక్కువుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో పేర్నమిట్ట ప్రాంతంలో స్పీడ్ కంట్రోల్‌ను 40 కిమీగా నిర్ణయించి రోడ్డు మీద బోర్డు పెట్టారు. స్పీడ్ కంట్రోల్ బోర్డు నుంచి వచ్చే వాహనాల వేగాన్ని 40 కిమీ దాటిన తర్వాత వాస్తవానికి జరిమానా విధించాలి. కానీ లేజర్ గన్ అదనంగా మరో 15 కిమీ వరకు సహిస్తుంది. అంటే 55 కిమీ వరకు ఫొటో తీయకుండా 56 కిమీ దాటిన వాహనాలను మాత్రమే ఫొటో తీసి బయటకు పంపిస్తుంది. ఇలా వాహనదారుల అతివేగాన్ని నియంత్రించేందుకు పోలీసులు ఉపయోగిస్తున్న హైటెక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని చూసి వాహనదారులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. గమనించడం కష్టం: పోలీసులు ఇంటర్ సెప్టర్ వాహనంతో రోడ్డు పక్కన ఉంటారు. వారు చలానా రాస్తారని వాహనదారులు ఆఖరి వరకూ గమనించలేకపోతున్నారు. దీన్ని గతంలో నేషనల్ హైవేపై పేస్, రైజ్ కాలేజీల వైపు ఉంచారు. ప్రస్తుతం పేర్నమిట్ట వైపు ఎక్కువుగా ప్రమాదాలు జరుగుతుండటం గమనించి పోలీసు ఉన్నతాధికారులు పేర్నమిట్ట్టపై దృష్టి సారించారు. రానున్న రెండు మూడు రోజుల్లో ఒంగోలు వైపు వచ్చే వాహనాలకే కాకుండా ఒంగోలు నుంచి సంతనూతలపాడు వైపు వెళ్లే వాహనాలకు కూడా విడతలు వారీగా ఇంటర్ సెప్టర్ వాహనాన్ని మార్చి మార్చి స్పీడ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఎస్ఐ రంగనా«థ్ తెలిపారు. ఇప్పుడు వాహనాల స్పీడ్ తగ్గటమే కాకుండా గతంతో పోల్చుకుంటే రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుముఖం పట్టాయని పేర్కొంటున్నారు. రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు వాహనాలను పర్యవేక్షిస్తున్నామన్నారు. రోజుకు 60 నుంచి 70 మంది వాహనాలను గుర్తించి వారికి జరిమానా విధిస్తున్నట్లు రంగనాథ్ వెల్లడించారు. -
ఒంగోలులో పోలీసుల ఓవరాక్షన్..
ఒంగోలు: ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటన నేపథ్యంలో ఒంగోలులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఇక్కడి చేరుకోనున్న సీఎం చంద్రబాబు.. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. బాబు రాక సందర్భంగా ముందు జాగ్రత్తగా పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ఆందోళనలు చేయనున్నారనే అనుమానంతో నిరుద్యోగ యువకులతోపాటు, అగ్రిగోల్డ్ బాధితులను అదుపులోకి తీసుకున్నారు. సీఎం రాకపోకలు సాగించే మార్గంలో హోటళ్లు, దుకాణాలను మూసివేయాలని హుకుం జారీ చేశారు. పోలీసుల ఆంక్షలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
ప్రేమ వ్యవహారంతో యువకుడి హల్చల్
ఒంగోలు: ప్రకాశం జిల్లా కంభం పట్టణానికి చెందిన నాగార్జున (18) హైదరాబాద్‌లో ఉండి డిగ్రీ చదువుకుంటున్నాడు. ఇతడు హైదరాబాద్‌కు చెందిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పటంతో వారు అతనిని బుద్ధిగా చదువుకోవాలని మందలించారు. ఇది నచ్చని నాగార్జున బుధవారం ఒంగోలు పట్టణానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి తన సెల్ ద్వారా తల్లిదండ్రులకు ఫోన్ చేసి, తన ప్రేమను అంగీకరించనందున పురుగు మందు తాగి చనిపోతున్నానంటూ చెప్పాడు. దీంతో భయపడిన తల్లిదండ్రులు కొడుకు కోసం వెతకటంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సెల్ సిగ్నల్స్ ఆధారంగా ఒంగోలు బస్టాండు ప్రాంతంలో నాగార్జున ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయం తల్లిదండ్రులకు చేర వేయటంతో వారు నాగార్జునను తీసుకుని, ఇంటికి వెళ్లిపోయారు.