ప్రతీకాత్మక చిత్రం
చెన్నై : వివాహ ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో ప్రేమించిన యువతిని వదులుకుంటున్నామన్న వేదనలో తిరుచ్చికి చెందిన ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం కలిగించింది. తిరుచ్చి ఎయిర్‌పోర్టు సంతోష్‌నగర్‌కు చెందిన నల్లతంబి విశ్రాంత కార్పొరేషన్ డ్రైవర్. అతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య కమల చెన్నైలో తన కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నారు. 2వ భార్య రెజినాకు శశికుమార్ (31) అనే కుమారుడు ఉన్నాడు. ఇంజినీరింగ్ (డీఈఈ)చదువు పూర్తి చేసిన శశికుమార్ ఉద్యోగం కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో తన ఇంటికి వెనుక ఉన్న స్థలంలో బేరల్ షూటింగ్ అకాడమీ అనే తుపాకీ కాల్చే శిక్షణా కేంద్రాన్ని నడుపుతున్నాడు. ఇందుకోసం అతని ఇంట్లో పలు బాల్‌రస్ బోర్డులు, టూ టూ తుపాకులు (బెలూన్‌లను కాల్చు తుపాకులు)ఉన్నాయి. శశికుమార్ తుపాకీతో కాల్చడంలో విశేష ప్రతిభ కలిగి ఉన్నాడు. జాతీయస్థాయిలో కొన్ని అవార్డులు కూడా పొందాడు. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో నల్లతంబి బయటకు వెళ్లాడు. ఇంట్లో రెజినా మాత్రమే ఉన్నారు.
ఆ సమయంలో శశికుమార్ తన గదికి వెళ్లి లోపలి వైపు గడియపెట్టుకున్నాడు. కొంత సమయం తరువాత ఆ గది నుంచి తుపాకీ పేలుడు శబ్దం వినిపించింది. ఆ శబ్దం విన్న రెజినా వెంటనే తలుపు తీయమని కేకలు వేసింది. కానీ తలుపు తీయలేదు. ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూశారు. అక్కడ శశికుమార్ తన నుదిటిపై బాల్‌రస్ గుండ్లు దూసుకెళ్లి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే అతన్ని తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకెళ్లారు. శశికుమార్‌ను పరిశీలించిన డాక్టర్లు అతను అప్పటికే మృతి చెందినట్టు ధృవీకరించారు. దీనిపై సమాచారం అందుకున్న ఎయిర్‌పోర్ట్ పోలీసులు అక్కడికి చేరుకుని ఇంట్లో విచారణ చేయగా శశికుమార్‌కు వివాహం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని, కానీ అతను మరో యువతిని ప్రేమిస్తున్నట్టు తెలిసింది. ప్రియురాలిని వివాహం చేసుకోలేకపోతున్నామనే వేదనలో అతను ఆత్మహత్య చేసకున్నట్టు సమాచారం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ఆత్మహత్య చేసుకున్న ఇంజినీర్
Comments
Please login to add a commentAdd a comment