కర్నూలు(న్యూసిటీ): పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే చెల్లించాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. విద్యార్థులు కలెక్టరేట్ గేట్లు ఎక్కి లోపలికి వెళ్లటానికి ప్రయత్నించడంతో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. అనంతరం ఏబీవీపీ నాయకులు సునీల్‌రెడ్డి, సూర్యకుమార్, నరేష్, మహేంద్ర, ప్రశాంత్‌తో పాటు 13 మందిని పోలీసులు మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి, స్వంత పూచీకత్తుపై విడుదల చేశారు.
ఈ సందర్భంగా సునీల్‌రెడ్డి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. వెంటనే దీనిపై ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ఎంసెట్ రాసి కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఎంసెట్ ఫలితాలు వచ్చి రెండు నెలలు కావస్తున్నా విద్యార్థులకు కౌన్సెలింగ్ తేదీ ప్రకటించకపోవడంతో విద్యాసంవత్సరం వృథా అవుతుందన్నారు.
ఇప్పటికే పలువురు విద్యార్థులు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లారని చెప్పారు. పలువురు రాష్ట్ర మంత్రులు డీమ్డ్ యూనివర్సిటీలకు అమ్ముడుపోయారని ఆరోపించారు. బీఈడీ, డైట్, ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించాలని కోరారు. ఈ ధర్నాలో పరిషత్ జిల్లా నాయకులు ప్రశాంత్, శివ, ఉమాకాంత్, మాధవ్, మహేష్, లోకేష్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని డిమాండ్
Published Sat, Jul 19 2014 1:13 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM
Advertisement
Advertisement