కర్నూలు(అర్బన్): జిల్లాలోని బీసీ విద్యార్థులకు 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్‌మెంట్, ఉపకార వేతనాలకు ప్రభుత్వం రూ.37 కోట్లను విడుదల చేసినట్లు జిల్లా బీసీ సంక్షేమాధికారి బీ సంజీవరాజు తెలిపారు.
బుధవారం ఆయన తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ఇంటర్ నుంచి పీజీ, ఇంజనీరింగ్, మెడికల్, ఎంబీఏ. ఎంసీఏ, బీఎడ్, డీఎడ్, ఐటీఐ, పాలిటెక్నిక్ తదితర కోర్సులకు సంబంధించి బకాయిలను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. బీసీ విద్యార్థులకు మెయింటెనెన్స్ ఆఫ్ ట్యూషన్ ఫీజెస్‌కు రూ.3.73 కోట్లు, బీసీ విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు 23.97 కోట్లు, ఈబీసీ విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు 9.49 కోట్లు విడుదలయ్యాయని ఆయన తెలిపారు. గత ఏడాదికి సంబంధించిన బకాయిలు రూ.40 కోట్ల మేర ఉన్నాయని, ప్రస్తుతం విడుదల చేసిన మొత్తంతో పెండింగ్ పూర్తి అవుతుందని, ఇక 2014-15 విద్యా సంవత్సరానికి విడుదల చేయాల్సి ఉందన్నారు. విడుదల చేసిన ఈ నిధులకు సంబంధించి కళాశాలల వారీగా బిల్లులను ట్రెజరీలకు పంపిస్తామన్నారు.
ఎస్‌సీ విద్యార్థులకు రూ.14.10 కోట్లు విడుదల... : 2014-15 విద్యా సంవత్సరానికి జిల్లాలోని ఎస్‌సీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు రూ.8.30 కోట్లు, మెయింటెనెన్స్ ఆఫ్ ట్యూషన్ ఫీజెస్‌కు రూ.5.80 కోట్లు విడుదలయ్యాయి.
బీసీ విద్యార్థులకు రూ.37 కోట్లు
Published Thu, Dec 25 2014 3:08 AM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM
Advertisement
Advertisement