సాక్షి, విజయవాడ : చదువుకునే సమయంలో విద్యార్థులు క్లాసుల్లో కాక రోడ్లపై ఉన్నారు. దీనికి కారణం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ లీలలు. హెల్త్ యూనివర్సిటీ వద్ద ఫిజియోథెరపి విద్యార్థులు బుధవారం ధర్నానిర్వహించారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే తమపై కక్ష్య కట్టారని తమ గోడును ఎవరికి చెప్పుకోవాలని విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. తాము రాసిన ప్రశ్నలకు కనీస మార్కులు కూడా ఇవ్వకుండా, తక్కువ మార్కులు వేసి కావాలనే ఫెయిల్ చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు.
పేపర్ వాల్యుయేషన్‌లో కూడా అన్యాయం చేశారని తమ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన చెందారు. రీకౌటింగ్ ద్వారా అన్యాయం జరుగుతోందని, రీ వాల్యూయేషన్ ప్రవేశపెట్టి తమ భవిష్యత్తును కాపాడాలని వేడుకుంటున్నారు. లేని పక్షంలో ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు. పై అధికారులను స్పందిస్తే కనీస మర్యాద కూడా ఇవ్వకుండా యూనివర్శిటీ సిబ్బంది మాతో అసభ్యంగా మాట్లాడుతున్నారని, వారు మాపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. మాట్లాడుతున్నారని, వారు మాపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment