Dirty Behaving
-
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ లీలలు..
సాక్షి, విజయవాడ : చదువుకునే సమయంలో విద్యార్థులు క్లాసుల్లో కాక రోడ్లపై ఉన్నారు. దీనికి కారణం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ లీలలు. హెల్త్ యూనివర్సిటీ వద్ద ఫిజియోథెరపి విద్యార్థులు బుధవారం ధర్నానిర్వహించారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే తమపై కక్ష్య కట్టారని తమ గోడును ఎవరికి చెప్పుకోవాలని విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. తాము రాసిన ప్రశ్నలకు కనీస మార్కులు కూడా ఇవ్వకుండా, తక్కువ మార్కులు వేసి కావాలనే ఫెయిల్ చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. పేపర్ వాల్యుయేషన్‌లో కూడా అన్యాయం చేశారని తమ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన చెందారు. రీకౌటింగ్ ద్వారా అన్యాయం జరుగుతోందని, రీ వాల్యూయేషన్ ప్రవేశపెట్టి తమ భవిష్యత్తును కాపాడాలని వేడుకుంటున్నారు. లేని పక్షంలో ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు. పై అధికారులను స్పందిస్తే కనీస మర్యాద కూడా ఇవ్వకుండా యూనివర్శిటీ సిబ్బంది మాతో అసభ్యంగా మాట్లాడుతున్నారని, వారు మాపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. మాట్లాడుతున్నారని, వారు మాపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. -
ఏంటికి పనికొస్తావు.. కలెక్షన్ ఇంతేనా?
* మహిళా కండక్టర్‌తో దురుసుగా మాట్లాడిన ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ * ఆర్టీసీ బస్టాండ్‌లో కార్మికుల ధర్నా ధర్మవరం అర్బన్: బస్సు చెడి పోయిందని చెబితే ఎలా?.. 216 కిలో మీటర్లు తిరిగి కేవలం రూ. 1960 కలెక్షన్ తెస్తే సరిపోతుందా? నువ్వు ఏంటికి పనికొస్తావు? చెప్పు అంటూ మహిళా కండక్టర్ సుకన్యతో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పెద్దన్న అసభ్యంగా మాట్లాడారు. ధర్మవరం ఆర్టీసీ డిపోలో మంగళవారం రాత్రి 10గంటల సమయంలో ఆర్టీసీ మహిళా కండక్టర్ సుకన్యతోపాటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ధర్నా చేశారు. ధర్మవరం డిపో నుంచి తాడిమర్రి మండలం నార్సింపల్లికి నడిచే బస్సుకు మహిళా కండక్టర్ సుకన్య డ్యూటీపై వెళ్లారు. బస్సు మరమ్మతుకు గురి కాగా.. రిపేరీ చేసుకుని బత్తలపల్లి వరకూ వచ్చారు. అక్కడ మరోసారి బస్సు మొరాయించింది. దీంతో ఇబ్బంది పడి మరమ్మతు చేసుకుని, బస్సును డిపోకు చేర్చారు. బస్సు చెడిపోయిందని కండక్టర్ సుకన్య ఆర్టీసీ డీఎం రామసుబ్బయ్యకు తెలిపగా పక్కనే ఉన్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పెద్దన్న జోక్యం చేసుకుని ‘నీవు ఏంటికి పనికొస్తావు.. చెప్పు ’అంటూ అసభ్యంగా మాట్లాడారని మహిళా కండక్టర్ కన్నీటపర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న తోటి కండక్టర్లు, డ్రైవర్లు ఆర్టీసీ డిపోలోనే బస్సులను బయటకు పంపకుండా ధర్నా చేశారు. రెండు గంటల పాటు కార్మికులు ధర్నాకు చేశారు. ఆర్టీసీ డిపోలోని మహిళా కండక్టర్లతో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పెద్దన్న ఎప్పుడూ దురుసుగా ప్రవర్తిస్తారని, ప్రతిఒక్క కండక్టర్నూ పట్ల ఇదేతీరుతో వ్యవహరిస్తారని కార్మికులు వాపోయారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో టీఐపై ఫిర్యాదు చేస్తామని కార్మికులు తెలిపారు.