ఏపీ సచివాలయంలో శనివారం ఆర్థికమంత్రి యనమల అధ్యక్షతన సమావేశమైన సబ్ కమిటీ భేటీ ముగిసింది.
హైదరాబాద్ : ఏపీ సచివాలయంలో శనివారం ఆర్థికమంత్రి యనమల అధ్యక్షతన సమావేశమైన సబ్ కమిటీ భేటీ ముగిసింది. అనంతరం మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. భేటీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై చర్చ జరిగినట్లు వివరించారు.1994 కు ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేరినవారిని క్రమబద్ధీకరించే ఆలోచన చేస్తున్నామని మంత్రి చెప్పారు. అలాగే ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచుతామని, వారికి గౌరవప్రదమైన జీతం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని గంటా వివరించారు. తిరిగి ఈ నెల 30వ తేదీన మరోసారి సమావేశం అవుతామని చెప్పారు.