ప్రణాళికతో ముందుకు సాగితే విజయమే.. | Success goes to plan .. | Sakshi
Sakshi News home page

ప్రణాళికతో ముందుకు సాగితే విజయమే..

Published Sat, Feb 1 2014 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM

Success goes to plan ..

  •      ‘బాలవికాస’ వ్యవస్థాపకురాలు బాలథెరిస్సా
  •      కాజీపేటలో రాష్ట్రస్థాయి మహిళా వికాస పథకం సదస్సు
  • కాజీపేట రూరల్, న్యూస్‌లైన్ : కుటుంబ నిర్వహణలో నైపుణ్యం కనబరిచే మహిళలు.. నిర్ధిష్టమైన ప్రణాళి కతో ముందుకు సాగితే వ్యాపార రంగంలో కూడా విజయం సాధించొచ్చని బాలవికాస సాంఘిక సేవాసంస్థ వ్యవస్థాపకురాలు బాలథెరిస్సా అన్నారు. కాజీపేటలోని బాల వికాస శిక్షణ కేంద్రంలో ఏర్పాటుచేసిన ‘వ్యాపార రంగంలో మహిళా సాధికారత’ అంశంపై రాష్ట్రస్థాయి మహిళ వికాస పథ కం సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ర్ట నలుమూలల నుంచి హాజరైన మూడువేల మందికి పైగా మ హిళలను ఉద్దేశించి థెరిస్సా మాట్లాడా రు.

    వ్యాపారం చేసే వారు నీతి, నిజాయితీ పా టించాలని, ప్రతీ లావాదేవీని నమోదు చే సుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఏటా వచ్చే ఫలితాలను బేరీజు వేసుకుంటే జరిగిన తప్పుడు పునరావృతం కాకుండా చూసుకోవచ్చన్నారు. బాలవి కాస సహ వ్యవస్థాపకుడు ఆంధ్రె జింగ్రాస్ మాట్లాడుతూ మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడం శుభపరిణామమన్నారు.

    వరంగల్ పీఠాధిపతి ఉడుముల బాల మాట్లాడుతూ బాలవికాస సంస్థ చేపడుతు న్న పలు పథకాల విజయవంతంలో జిం గ్రాస్, బాలథెరిస్సా కృషి అభినందనీయమన్నారు. సింగారెడ్డి శౌరిరెడ్డి, బాసాని మ ర్రెడ్డి కూడా మాట్లాడిన ఈ సమావేశం లో బాల వికాస సంస్థ పథకాలను పలువురు బుర్రకథల రూపంలో వివరించారు. కాగా, తొలుత మహిళలు కాజీపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రకాష్‌రెడ్డి, ఇంద్రారెడ్డి, అతి రథ్, బాలక్క, వసంత, లూర్థు మర్రెడ్డితో పాటు ప్రతినిధులు పాల్గొన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement