మార్టేరు (పెనుగొండ రూరల్): మార్కె ట్లో ప్రచారం జరుగుతున్నట్టుగా సుగర్ ఫ్రీ రైస్ అసలు లేనే లేదని మార్టేరు వరి పరిశోధన సంస్థ డెరైక్టర్ డాక్టర్ పాల డుగు వెంకట సత్యనారాయణ స్పష్టం చేశారు. మార్టేరులోని ఆంధ్రప్రదేశ్ వరి పరిశోధనా సంస్థలో గోదావరి మండ లం పరిశోధన, విస్తరణ సలహామండలి రెండవరోజు సమావేశంలో ఆ యన ప్రసంగించారు. ఆర్‌ఎన్‌ఆర్ 15048 రకాన్ని సుగర్ ఫ్రీ రకంగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
కానీ ఇది వాస్తవం కాదన్నారు. జీఐ(గ్లైసమిక్ సూచిక )లో ఇది మధ్యస్త రకం మాత్రమేనని పాలడుగు అన్నారు. మధుమేహ నియంత్రణ పరంగా వరి రకాలను మధ్యస్త, హెచ్చురకాలుగా విడదీశామన్నారు. ఈ సూచిక ప్రకారం ఆర్‌ఎన్‌ఆర్ కన్నా సాంబమసూరే సుగ ర్ రోగులకు మేలైనదన్నారు. ఆర్‌ఎన్‌ఆర్ 15048లో 57 శాతం జీఐ ఇండెక్స్ ఉంటే, బీపీటీ 5204 (సాంబ మసూరి)లో 52 శాతం, స్వర్ణ రకంలో 56 శా తం ఉందన్నారు. వరిలో సుగర్ ఫ్రీ రైస్ ఉండదన్నారు. చక్కెర తక్కువ శాతం ఉండే రకాలు మాత్రమే ఉంటాయన్నారు.
తక్కువ చక్కెర శా తం రకాలపై ఎన్‌ఐఎన్ సహకారంతో పరిశోధనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సత్ఫలితాలు రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలు ఎలుకల నివారణ, మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆహారం, చిరుధాన్యాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. సాయిల్ మేనేజ్‌మెంట్ ప్రత్యేకాధికారి టి గిరిధర్, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏడీఆర్ డాక్టర్ ఎన్ మల్లికార్జునరెడ్డి, వ్యవసాయ శాఖ ఉభయగోదావరి జిల్లా డీడీఏలు పద్మ, లక్ష్మణరావు, శాస్త్రవేత్తలు ఎంవీ రమ ణ, రత్నకుమారి, కె.శ్రీనివాసులు, సుధీర్, ఎం. శ్రీనివా స్, శిరీష, చాముండేశ్వరి పాల్గొన్నారు.
సుగర్ ఫ్రీ రైస్ లేనే లేదు !
Published Fri, Apr 22 2016 12:45 AM | Last Updated on Sun, Sep 3 2017 10:26 PM
Advertisement
Advertisement