ఏపీ, తెలంగాణ హైకోర్టులకు నూతన జడ్జీలు | Supreme Court Collegieum Recomends Judges For High Courts | Sakshi
Sakshi News home page

ఏపీ, తెలంగాణ హైకోర్టులకు నూతన జడ్జీలు

Published Tue, Apr 16 2019 6:59 PM | Last Updated on Tue, Apr 16 2019 8:00 PM

Supreme Court Collegieum Recomends Judges For High Courts - Sakshi

 ఏపీ, తెలంగాణ హైకోర్టులకు నూతన జడ్జీలు

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ హైకోర్టులకు నూతన న్యాయమూర్తుల నియామకంపై సుప్రీం కోర్టు కొలీజియం కసరత్తు ముమ్మరం చేసింది. ఏపీ హైకోర్టుకు బిఎస్‌ భానుమతి, సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, ఎం వెంకటరమణ, ఏ. హరిహరనాథ శర్మలను నియమించాలని సిఫార్సు చేసింది.

ఇక తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా శ్రీసుధ, సుమలత, ఎన్‌ తుకారాంజీల పేర్లను సుప్రీం కొలీజియం సిఫార్సు చేసింది. కాగా, ఏపీ నూతన హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా అలహాబాద్‌ హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి విక్రమ్‌ నాధ్‌ను కొలీజియం ఇటీవల ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement