సాక్షి, ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యాహ్న భోజన పథకం అమలు పర్యవేక్షణ ఆన్‌లైన్ లింక్ ఏర్పాటులో ప్రభుత్వం విఫలమైందని లక్ష రూపాయల జరిమానా విధించింది. ఏపీతో పాటు మరో ఐదు రాష్ట్రాలకు కూడా ఈ జరిమానా వర్తిస్తుందని తీర్పులో పేర్కొంది. ఈ మేరకు న్యాయస్థానం మంగళవారం ఆదేశాలను జారీచేసింది. కాగా మధ్యాహ‍్న భోజన పథకం అమలులో అవినీతి జరుగుతోందంటూ గతకొంత కాలంగా ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీనిపై విచారించిన దర్మాసనం జరిమానా చెల్లించి, పథకం అమలులో పారదర్శకత పాటించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment