'విభజన' పిటిషన్లపై రేపు సుప్రీంకోర్టులో విచారణ
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో వేసిన పిటీషన్‌లు శుక్రవారం విచారణకు రానున్నాయి. సుప్రీం కోర్టులో కోడ్ నెం 3 ఐటమ్ 64గా పిటీషన్‌లు విచారణకు రానున్నాయి. విభజనకు వ్యతిరేకంగా 8 పిటిషన్‌లు దాఖలయ్యాయి. అన్ని పిటిషన్లను ఒకేసారి విచారణకు సుప్రీంకోర్టు స్వీకరించనుంది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్న సమయంలో సుప్రీంకోర్టు తీర్పు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. గతంలో దాఖలైన పిటిషన్లపై స్పందించిన సుప్రీంకోర్టు... సరైన సమయంలో విచారణకు సుప్రీంకోర్టు స్వీకరిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.