తిరుచానూరులో వైభవంగా స్వర్ణ రథోత్సవం | Swarna rathotsavam in Tiruchanuru | Sakshi
Sakshi News home page

తిరుచానూరులో వైభవంగా స్వర్ణ రథోత్సవం

Published Sun, May 3 2015 7:50 PM | Last Updated on Sun, Sep 3 2017 1:21 AM

తిరుచానూరులో వైభవంగా స్వర్ణ రథోత్సవం

తిరుచానూరులో వైభవంగా స్వర్ణ రథోత్సవం

తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి స్వర్ణ రథోత్సవం ఆదివారం ఉదయం వైభవంగా జరిగింది.

తిరుచానూరు (చిత్తూరు): తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి స్వర్ణ రథోత్సవం ఆదివారం ఉదయం వైభవంగా జరిగింది. ఏటా అమ్మవారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా రెండో రోజు స్వర్ణరథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో నిద్రమేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. అనంతరం సన్నిధి నుంచి అమ్మవారిని తీసుకొచ్చి స్వర్ణరథంపై కొలువుదీర్చారు.

ఉదయం 7గంటలకు భక్తుల కోలాటాల నడుమ సర్వాంగ శోభితురాలైన శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్యదర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారి స్వర్ణరథాన్ని లాగే కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ స్వర్ణరథోత్సవంలో టీటీడీ తిరుపతి జేఈవో భాస్కర్, ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఏఈవో నాగరత్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

పోల్

Advertisement