
మారుమోగుతున్న ప్రత్యేక నినాదం
జగన్ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన
{పభుత్వ మొండివైఖరిపై పెల్లుబికుతున్న ప్రజాగ్రహం
ఆలయాల్లో పూజలు..రహదారులపై వంటవార్పులు
ప్రత్యేకహోదా నినాదం మారుమోగుతోంది. మహావిశాఖ నగరం నుంచి మారుమూల పల్లెల వరకు ప్రత్యేక హోదా ఏపీ హక్కు అంటూ నినదిస్తోంది. పార్టీలు.. వర్గాలకతీతంగా ఊరూ వాడ కదంతొక్కుతోంది.
విశాఖపట్నం: ప్రత్యేక హోదా సాధనకు నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం గంటగంటకు క్షీణిస్తుండడంతో జిల్లా వాసుల్లో ఆందోళన నెలకొంది.ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దీక్ష చేస్తుంటే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం పట్ల జిల్లా వ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. జగన్ ఆరోగ్యం కోసం ఆలయాలు, మసీదులు, చర్చల్లో ప్రార్ధనలు చేస్తున్నారు. మరో పక్క జిల్లా వ్యాప్తంగా దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆదివారం జాతీయ రహదారులపై వంటవార్పులు చేసి నిరసన వ్యక్తం చేశారు.
జిల్లాలో ఏమారుమూల ప్రాంతానికెళ్లినా ప్రత్యేకహోదా మారుమోగుతోంది. ఒక పక్క పార్టీ శ్రేణులు మరోపక్క మహిళలు, విద్యార్థులు, యువత రోడ్డెక్కుతున్నారు. వృద్ధులు సైతం దీక్షల్లో కూర్చొని ప్రత్యేక హోదా ఆవశ్యకతను చాటిచెబుతున్నారు.గత ఐదురోజులుగా దీక్ష చేస్తున్న జగన్ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ పాడేరు మోదుకొండమ్మ ఆలయంలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి జగన్‌కు అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. అంబేద్కర్ సెంటర్‌లో జరిగిన వంటవార్పులో ఆమె పాల్గొన్నారు.
మాడుగుల నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన రిలేదీక్షలు, వంటవార్పుల్లో ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు.జీవీఎంసీ వద్ద కొనసాగుతున్న రిలేదీక్షల్లో ఆదివారం పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ పాల్గొనగా మాజీమంత్రి బలిరెడ్డి సత్యారావు సంఘీభావం తెలిపారు.తూర్పు నియోజకవర్గ కోఆర్డినేటర్ వంశీకృష్ణ యాదవ్‌తో పాటు పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కొయ్య ప్రసాద్‌రెడ్డి, రాష్ర్ట ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి నగర బీసీ సెల్ అధ్యక్షుడు పక్కి దివాకర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ తదితరులు ఆరిలోవ డైరీఫారంకూడలిలో జరిగిన వంటవార్పులో పాల్గొన్నారు.
తాటిచెట్లపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన వంటవార్పులో ఉత్తర నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, ఎస్.కోట కో ఆర్డినేటర్ రొంగలి జగన్నాధం, ప్రచార కమిటీ నగర కార్యదర్శి బర్కత్ అలీ, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్ పార్టీ సీనియర్ నాయకులు సత్తి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.దక్షిణ కో ఆర్డినేటర్ కోలా గురువులు, పార్టీ రాష్ర్ట కార్యదర్శి జాన్‌వెస్లీ జిల్లా కోర్టు వద్ద జరిగిన వంటవార్పులో పాల్గొన్నారు.
గాజువాకలో జరిగిన వంటవార్పులో పార్టీ కో ఆర్డినేటర్ తిప్పల నాగిరెడ్డితో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ పాల్గొన్నారు. పెందుర్తి రిలే దీక్షల్లో 85 ఏళ్ల బోజంకి అప్పలనాయుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని జగన్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీ కో ఆర్డినేటర్ అదీప్‌రాజు పాల్గొన్నారు. పెందుర్తి నాలుగు రోడ్ల కూడలిలో వంటవార్పు నిర్వహించి నిరసనవ్యక్తం చేశారు.భీమిలిలో పట్టణాధ్యక్షుడు అక్కరమాని వెంకట్రావు దీక్షల్లో పాల్గొన్నారు. భీమిలి నూకాలమ్మ ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టారు. తగరపువలస విజయదుర్గ ఆలయంలో భీమిలి పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు జగుపల్లి ప్రసాద్ అమ్మవారికి 101 కొబ్బరికాయలు కొట్టారు. పద్మనాభం జంక్షన్‌లో వంటవార్పు చేశారు.
చోడవరం జంక్షన్‌లో వంట వార్పు చేశారు. బుచ్చెయ్యపేట, రావికమతం దీక్షలకు జిల్లాపార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ సంఘీభావం తెలిపారు.నక్కపల్లివద్ద జాతీయ రహదారిపై జరిగిన వంట వార్పుల పార్టీ సీజీసీ సభ్యుడు వీసం రామకృష్ణ, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు పాల్గొన్నారు. కోటవురట్లలో రిలేదీక్షలకు మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు సంఘీభావం తెలిపారు.యలమంచిలి కో ఆర్డినేటర్ ప్రగడ నాగేశ్వరరావు రాంబిల్లిలో రిలే దీక్షల్లో పాల్గొన్నారు. అచ్యుతాపురంలో మోకాళ్లపై నిలబడి వినూత్నంగా నిరసన తెలిపారు.అరకు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్ మునగపాకలో జరిగిన వంట వార్పులో పాల్గన్నారు. అరకులోయలో పార్టీ శ్రేణులు వంటవార్పు చేశారు. నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం ఎదుట వంటవార్పులో పార్టీ కో ఆర్డినేటర్ పెట్ల ఉమాశంకర్ గణేష్ పాల్గొన్నారు.