
చంద్రబాబుకు ధైర్యం లేదు: తలసాని
టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి ధ్వజమెత్తారు.
తిరుమల : టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ధైర్యం లేదని .. కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీకి ప్రత్యేక హోదా, నిధులు అడగడానికి భయపడుతున్నారని ఆయన అన్నారు. పేదరికం లేని సమాజం చేస్తానని చెప్పిన చంద్రబాబు తన కుటుంబ ఆస్తులను సరి చూసుకోవాలని తలసాని హితవు పలికారు.