తమిళ దొంగల ముఠా అరెస్టు
- బస్సులో ప్రయాణికురాలి వద్ద బ్యాగు అపహరణ
- బాధితురాలే దొంగలను పట్టించిన వైనం
నందివాడ : బస్సులో ప్రయాణిస్తున్న మహిళ వద్ద బ్యాగు అపహరణకు గురైంది. నందివాడ మండలం పుట్టగుంట గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో బాధితురాలికే దొంగలు పట్టుబడటం విశేషం. వివరాలిలా ఉన్నాయి. గుడివాడ కాకర్ల వీధికి చెందిన కిర్ల ప్రసన్నలక్ష్మి గుడివాడ నుంచి బస్సులో పుట్టగుంట బయలుదేరింది.
అదే బస్సులో తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లా పారంపట్టు గ్రామానికి చెందిన కోమిరాయన్‌మీనాక్షి, కర్భియ సత్య, సత్తివేలు దేవి, కొమిరాయన్ ఈశ్వరి ప్రయాణిస్తున్నారు. వారంతా ప్రసన్నలక్ష్మి వెనుకే కూర్చున్నారు. పుట్టగుంట గ్రా మం దగ్గరకు బస్సు వచ్చేసరికి ప్రసన్నలక్ష్మి బ్యాగును వారు అపహరించారు. ఆమె బస్సు దిగిన తరువాత బ్యాగ్ లేకపోవడం గురించి ఆందోళనకు గురైంది. బస్టాప్ వద్దనే విలపిస్తూ కూర్చుంది. బ్యాగు అపహరించిన నలుగురు మహిళలు రెం డు కిలోమీటర్లు దూరంలో ఉన్న పాలపర్రులో దిగి ఆటోలో గుడివాడకు తిరుగుముఖం పట్టారు.
పుట్టగుంట బస్‌స్టాప్ వద్ద ప్రయాణికులను ఎక్కించుకోవడానికి డ్రైవర్ ఆటోను ఆపాడు. అక్కడే ఉన్న ప్రసన్నలక్ష్మి నలుగురు మహిళలను గు ర్తించి స్థానికులకు చెప్పింది. వారు ఆ ముఠా సభ్యులను పట్టుకుని బ్యా గును, దానిలో ఉన్న రూ.14వేల నగదును స్వాధీనం చేసుకుని నంది వా డ పోలీస్ స్టేషన్‌లో అప్పగిం చారు. ఎస్సై పి.రాంబాబు కేసు నమోదు చేసి, విచారణ జరపగా, నిందితులు తమిళనాడు వాసులని తేలింది. వా రిని గురువారం కోర్టులో హాజరుపరి చారు. న్యాయమూర్తి ఆదేశాల మే రకు రిమాండ్‌కు తరలించారు.