అనంతపురం: అనంతపురం జిల్లా కదిరి టీడీపీ నేతల్లో వర్గపోరు మొదలైంది. మున్సిపల్ చైర్మన్ సురయాభానుని పదవి నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్... సురయాభాను నుంచి ఇంతకు ముందే రాజీనామా లేఖ తీసుకున్నారు. ఇదిలా ఉండగా మున్సిపల్ చైర్మన్ పదవి ఆశిస్తున్న మరో వర్గం 14 మంది కౌన్సిలర్లని విహారయాత్రకు తీసుకెళ్లింది. ఈ వర్గానికి టీడీపీనేత ఫారూక్ సారధ్యం వహిస్తున్నారు.