డ్వాక్రా రుణాల మాఫీపై స్పష్టత ఇవ్వని సర్కారు
జిల్లాలో మాఫీ కోసం ఎదురు చూస్తున్న
5.75 లక్షల మంది మహిళలు
వడ్డీలు కట్టలేక.. కొత్త రుణాలు అందక అవస్థలు
వడ్డీ బకాయి రూ.125 కోట్లు
ఏలూరు (టూ టౌన్) :రైతులకు రుణమాఫీ ఆశచూపిన సర్కారు వారికి కొంతమేరకైనా న్యాయం చేయలేదు. మరోవైపు డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాల్నిమాఫీ చేస్తామని చెప్పి ఆ హామీ అమలు విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. మహిళలు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. అధికార పగ్గాలు చేపట్టిన తరువాత మాటమార్చి ప్రతి డ్వాక్రా మహిళకు రూ.10 వేలు ఇస్తామన్నారు. తాజాగా ప్రతి గ్రూపునకు రూ.30 వేల చొప్పున మూలనిధి ఇస్తామంటున్నారు. జిల్లాలో 5 లక్షల 75 వేల 41మంది డ్వాక్రా మహిళలు రూ.లక్ష రుణమాఫీ అర్హులని గ్రామీణాభివృద్ధి శాఖ (డీఆర్‌డీఏ) అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు.
ఆ తరువాత వివిధ కారణాలతో 25 వేల మంది మాఫీకి అనర్హులని తేల్చారు. దీంతో మహిళలు శాపనార్థాలు పెడుతున్నారు. రుణాలు మొత్తం మాఫీ చేస్తామన్న చంద్రబాబు మాటల్ని నమ్మిన మహిళలు రుణ వాయిదాలు చెల్లించలేదు. దీంతో వారిపై పెద్దఎత్తున వడ్డీ భారం పడింది. డీఆర్‌డీఏ లెక్కల ప్రకారం రూ.128.8 కోట్లు మేర వడ్డీ బకాయి పడ్డారు. దీంతో బ్యాంకులు డ్వాక్రా సంఘాల పొదుపు ఖాతాల్లోంచి రూ.4 కోట్లను రుణ ఖాతాలకు జమ చేసుకున్నాయి. తాము దాచుకున్న పొదుపు సొమ్ముతో అయినా వ్యాపారాలు చేసుకుందామనుకున్న మహిళలకు ఆ అవకాశం కూడా లేకపోయింది. మరోవైపు తక్షణమే బకాయిలు చెల్లించాలని బ్యాంకులు ఒత్తిడి చేస్తుండటంతో గత్యంతరం లేని స్థితిలో మహిళలు అధిక వడ్డీకి అప్పులు తెచ్చి బకాయిలు తీర్చేందుకు సిద్ధమవుతున్నారు.
మీనమేషాలు
Published Wed, May 27 2015 2:21 AM | Last Updated on Tue, Aug 14 2018 3:47 PM
Advertisement