టీడీపీకి రాజీనామా చేస్తున్నా | TDP EX mla anna rambabu resigned | Sakshi

టీడీపీకి రాజీనామా చేస్తున్నా

Published Sat, Aug 5 2017 1:20 AM | Last Updated on Fri, Aug 10 2018 8:27 PM

టీడీపీకి రాజీనామా చేస్తున్నా - Sakshi

టీడీపీకి రాజీనామా చేస్తున్నా

ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.

గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు 
 
గిద్దలూరు: టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేశారని మాజీ ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు విమర్శించారు. గిద్దలూరులో శుక్రవారం కార్యకర్తలు, అనుచ రులతో సమావేశం నిర్వహించిన ఆయన ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

వైఎస్సార్‌సీపీ ఓట్లతో గెలిచి టీడీపీలో చేరిన ముత్తుముల అశోక్‌రెడ్డి వలన టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ముఖ్యమంత్రికి చెప్పినా పట్టించుకోలేదని, పైగా పార్టీ ఫిరాయించిన వారితోనే కలిసి పనిచేయాలని చెబుతున్నారని విమర్శించారు. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని, ఒక ప్రజాస్వామికవాదిగా ప్రజల సమస్యలపై పోరాడతానన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement