అప్పునంగా ఓట్లు.. బంగారం కోసం పాట్లు! | tdp government cheating loan waiver | Sakshi
Sakshi News home page

అప్పునంగా ఓట్లు.. బంగారం కోసం పాట్లు!

Published Mon, Sep 7 2015 12:18 AM | Last Updated on Fri, Aug 10 2018 6:21 PM

tdp government cheating loan waiver

విజయనగరం అర్బన్: పంట రుణాలపై రైతులెవరూ వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పిన టీడీపీ ప్రభుత్వ ఆచరణలో మాత్రం చేతులెత్తేస్తోంది. దీనికితోడు రుణమాఫీ వర్తింపు తరువాత కొత్తరుణాలకు పరిధులను తగ్గిస్తూ బ్యాంకురుణాలకు రైతుల్ని దూరం చేస్తొంది. ప్రధానంగా బంగారం తనఖా రుణాలపై బ్యాంకర్లు ఇష్టానుసారంగా నిబంధనలు పెట్టడంతో రైతుకు రుణాలు అందడం లేదు. బంగారం, భూమి ఎంతమేరకు పెట్టినా రూ.లక్ష దాటి రుణం ఇవ్వరాదని బ్యాంకర్లు నిర్దేశించారు. దీంతో బంగారం తనఖా రుణాల రైతుకు ఆసరా లభించని పరిస్థితి ఏర్పడింది.
 
 జిల్లాలో తగ్గిన బంగారు రుణ లక్ష్యాలు: జిల్లాలో గత కొన్నేళ్లుగా బ్యాంకు రుణ లక్ష్యాలను పరిశీలిస్తే బంగారం తనఖా రుణాలపై ఆధారపడే రైతులు జిల్లాలో 40 శాతం మంది ఉన్నారు. రుణమాఫీ ప్రకటించిన తరువాత బ్యాంకర్ల వైఖరి మారింది.  స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, రుణ పరిధి కుదింపు వంటి అంశాలను నిర్దేశించడంతో రైతుకు బంగారంపై ఇచ్చే తనఖా రుణాలు ఎటూ చాలని పరిస్థితి ఉంది. దీనికితోడు రుణమాఫీ అవుతుందని ఎదురుచూస్తూ బ్యాంకుల్లో బంగారాన్ని ఉంచేయడం వల్ల వడ్డీ పేరుకుపోతోంది. రుణమాఫీ అమలు తరువాత జిల్లాలో గడిచిన ఏడాది (జూన్-2015 ముగిసిన నాటికి) ఖరీఫ్, రబీ కలుపుకొని రూ.1,100 కోట్ల లక్ష్యం కాగా వీటిలో బంగారు రుణాల లక్ష్యాలే రూ.600 కోట్లకు పైగానే ఉన్నాయి. కానీ రెండూ కలిపి కేవలం రూ. 605 కోట్లు రుణాలు మాత్రమే  రైతుల (94 వేల మంది)కు అందాయి.  రుణమాఫీ అవుతుందని ఎదురుచూసిన రైతులు రికవరీ చేయకపోవడం వల్లే కొత్తరుణాల లక్ష్యాలను కనీసం 50 శాతం  కూడా సాధించలేకపోయామని బ్యాంకర్లు చెబుతున్నారు.
 
 దూరమవుతున్న బంగారం
 రుణమాఫీ అవుతుందని ఎదురుచూస్తున్న బంగారంపై రుణాలు వాడిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. రుణానికి ఇచ్చిన గడువు లోపు రుణమాఫీ  కాకపోవడం వల్ల ఆ బంగారాన్ని బాంక్లర్లు వేలం వేస్తున్నారు. దీనికి తోడు రికవరీ జరిగి రుణవిముక్తులు కాకపోవడం వల్ల కొత్తరుణం కూడా అందడంలేదు.  రికవరీ చేయని వారికి కొత్తరుణాలు ఇవ్వడం మాటలా ఉంటే జిల్లాలో నాలుగు బ్యాంకులకు చెందిన వివిధ ప్రాంతాల శాఖల రైతుఖాతాదారుల (300 మంది రైతుల) రూ.3 కోట్ల రుణానికి తనఖాలో ఉన్న బంగారాన్ని  వేలం వేసినట్లు తెలుస్తోంది.   

 ఇవీ రైతు రుణాలు
 జిల్లాలోని 150 జాతీయ, 70 గ్రామీణ బ్యాంకులలో మార్చి-2014 (రుణమాఫీ వర్తింపు తేదీ) వరకు గత కొన్నేళ్లుగా ఇచ్చిన రుణాలు  రూ.1,462 కోట్ల వరకు రైతులకు వివిధ రూపాల్లో రుణాలున్నాయి.
 పంట, బంగారు రుణాలు కలిపి: రూ.1,162 కోట్లు        
 వీటిలో  పంటలపై రూ.730 కోట్ల(రైతులు: లక్షా 82 వేల మంది) రుణాలు ఉన్నాయి.
 బంగారం తనఖాపై రూ.432 కోట్లు (రైతులు: 55 వేల మంది) రుణంగా బ్యాంకులు ఇచ్చాయి.
 ఇవి కాకుండా వ్యవసాయ యంత్రాలు, సామగ్రి, విత్తనాలు వంటి ఇతర అవసరాల రుణాలు రూ. 300 కోట్లు (రైతులు: 30 వేల మంది)రుణాలు ఇచ్చాయి.
 రుణ మాఫీ వర్తింపు వివరాలు
 మాఫీ ఫేజ్-1లో రూ.390 కోట్ల రుణాలు (రైతులు: 1,44,621 మంది) మంజూరు చేస్తే  రూ.184.21 కోట్లు మాత్రమే విడుదల చేశారు.
 మాఫీ ఫేజ్-2లో రూ.181.71 కోట్ల రుణాలు (రైతులు: 68,116 మంది) మంజూరు చేస్తే రూ.103.21 కోట్లు మాత్రమే విడుదల చేశారు.
 తాజాగా మాఫీ ఫేజ్-3లో రూ.46.84 రోట్లు (రైతులు: 19,477 మంది) మంజూరు చేస్తే రూ.26.5 కోట్లు ూత్రమే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
 పంటలు నష్టపోయి కష్టాల్లో కూరుకుపోతున్న తమను ఆదుకోవాల్సిన స ర్కారే ఇలా వంచిస్తుంటే ఇక తామెలా బతకాలని రైతులు వాపోతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement