Loans Farmers
-
జగనన్న పాల వెల్లువ లబ్ధిదారులకు క్రెడిట్ కార్డులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాడి రైతుల అభ్యున్నతికి అనేక చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వారికి మరింత మేలు చేకూర్చనున్నారు. జగనన్న పాల వెల్లువ లబ్ధిదారులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయించి, వారి వ్యాపారానికి అవసరమైన రుణాలను మంజూరు చేయించేందుకు చర్యలు చేపట్టారు. వైఎస్సార్ ఆసరా, చేయూత మహిళా లబ్దిదారుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు పాడి పశువుల కొనుగోళ్లకు బ్యాంకుల ద్వారా ఇప్పటికే రుణాలు మంజూరు చేయిస్తున్నారు. వీరి నుంచి అమూల్ ద్వారా పాల సేకరణ చేస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పశు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా జగనన్న పాల వెల్లువ లబ్దిదారులు వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కార్డుల ద్వారా లబ్దిదారులకు అవసరమైన వర్కింగ్ కేపిటల్ కోసం రుణాలు మంజూరు చేయించనుంది. ఇందుకోసం జిల్లాలవారీగా బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశించింది. ఇటీవల జరిగిన బ్యాంకర్ల సబ్ కమిటీ సమావేశంలో 18 జిల్లాల్లోని 2.28 లక్షల మంది జగనన్న పాల వెల్లువ లబ్దిదారుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. వీరందరికి పశు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చి, రుణాలు మంజూరు చేయాలని ఆ సమావేశంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ క్రెడిట్ కార్డుల ద్వారా పశు, మత్స్యకార రైతులకు ప్రత్యేకంగా కార్డులు ఇచ్చి, వారికి అవసరమైన రుణాలు మంజూరు చేస్తారు. అర్హులైన వారందరికి ఈ కార్డులు ఇవ్వడానికి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అర్హులైన పశు, మత్స్యకార రైతులకు ఈ కార్డులు ఇవ్వాలని, ఇందుకోసం జిల్లాలవారీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నోడల్ అధికారులతో శిబిరాలు నిర్వహించాలని బ్యాంకర్ల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ కార్డులపై వర్కింగ్ క్యాపిటల్‌గా లబ్దిదారులకు రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు బ్యాంకులు రుణాలిస్తాయి. ఈ రుణాలకు 1.5 శాతం వడ్డీ రాయితీ ఇస్తారు. సకాలంలో రుణాలు చెల్లించిన వారు వార్షిక వడ్డీలో 3 శాతం సత్వర రీపేమెంట్ ప్రోత్సాహకానికి అర్హులవుతారు. ప్రతి శుక్రవారం శిబిరాలు ఈ కార్డులతో పాటు రుణాల మంజూరుకు ప్రతి శుక్రవారం బ్యాంకులు ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తాయి. అక్కడికక్కడే అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, వెంటనే ప్రాసెస్ చేస్తాయి. సూత్రప్రాయ మంజూరు కూడా ఈ శిబిరాల్లోనే చేస్తారు. వైఎస్సార్ చేయూత, ఆసరా లబ్దిదారులు ఇప్పటికే బ్యాంకుల్లో ఖాతాదారులగా ఉన్నారని, అలాగే ఇప్పటికే జగనన్న పాల వెల్లువ కింద పాడి పశువులను కొనుగోలు చేశారని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వీరికి క్రెడిట్ కార్డులు, రుణాల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు స్పష్టం చేసింది. -
రైతు ఇంట లక్ష్మీకళ!
సాక్షి, విశాఖపట్నం: ఖరీఫ్, రబీ సీజన్ ఏదైనా వ్యవసాయ పంటల సాగుకు ఏటా పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. ఒకవైపు ఎరువులు, విత్తనాల ధరలు, మరోవైపు కూలీలు, ట్రాక్టర్ల అద్దె తడిసిమోపెడవుతున్నాయి. ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్నప్పుడు గ్రామాల్లో కూలీలు దొరకని పరిస్థితి. అదును దాటిపోకూడదనే ఉద్దేశంతో రైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెడుతున్నారు. ఆ సమయంలో బ్యాంకుల నుంచి పంట రుణాలు తెచ్చుకోవడానికి అవస్థలు పడేవారు. ఈ సంవత్సరం మాత్రం అన్నదాతలకు ఆ తిప్పలు తప్పాయి. పంటలను బట్టి రుణాలు సాఫీగా మంజూరయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో జిల్లా యంత్రాంగం స్పందించింది. రుణపరిమితి కూడా గత ఏడాది కన్నా ఈ ఖరీఫ్‌లో అదనంగా పెంచడానికి జిల్లా స్థాయి బ్యాంకుల కమిటీ ఆమోదముద్ర వేసింది. జిల్లాలో అత్యధికంగా పండే వరి సహా ప్రధాన పంటల రుణపరిమితి పెరిగింది. రుణాల లక్ష్య సాధనలోనూ మెరుగైన ఫలితాలు కనిపించాయి. ఖరీఫ్‌లో 91 శాతం లక్ష్యసాధన.. జిల్లాస్థాయి బ్యాంకుల కమిటీ నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం 2019 ఖరీఫ్‌లో రూ.3,006 కోట్లు, రబీలో రూ.1,762 కోట్లు రుణాల మంజూరుచేయాల్సి ఉంది. ఖరీఫ్‌లో 3,18,153 మంది రైతులకు రూ.2,264 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలి. టర్మ్ రుణాలు 73,237 మంది రైతులకు రూ.742 కోట్లు మంజూరు చేయాలి. ఈ లక్ష్య సాధనకు బ్యాంకులు, వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులు కృషి చేశారు. ఫలితంగా 3,19,547 మంది రైతులకు పంటరుణాల కింద రూ.2,102 కోట్లు (93 శాతం) మంజూరయ్యాయి. అలాగే 72,469 మందికి రూ.647 కోట్లు మేర (87 శాతం) టర్మ్ రుణాలు వచ్చాయి. ఖరీఫ్ సీజన్లో మొత్తంమీద 3,92,016 మంది రైతులకు రుణల రుపేణా రూ.2,749 కోట్లు (91 శాతం) మంజూరయ్యాయి. రబీలో సాఫీగా రుణాల ప్రక్రియ.. ఈ సంవత్సరం ప్రకృతి సహకరించడంతో రైతులు ఉత్సాహంగా రబీ సీజన్‌కూ సిద్ధమయ్యారు. జిల్లాలో 2,23,217 మంది రైతులకు పంటరుణాలు కింద రూ.863 కోట్లు మంజూరు చేయాలి. ఇప్పటివరకూ1,43,759 మందికి రూ.573 కోట్లు (66 శాతం) మంజూరయ్యాయి. టర్మ్ రుణాలు కూడా 73,237 రైతులకు గాను ఇప్పటివరకూ 42,157 మందికి రూ.498 కోట్లు మంజూరయ్యాయి. లక్ష్యం రూ.899 కోట్లలో ఇది 55 శాతం. ‘వైఎస్సార్’ పథకంతో రైతుకు భరోసా.. గతంలో కన్నా ఈసారి రైతులు ఎక్కువగా బ్యాంకు రుణాల వైపు చూపడానికి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ప్రధాన కారణమైంది. అతివృష్టి, అనావృష్టిలతో పంటలు నష్టపోయే రైతుల్ని, కౌలు రైతుల్ని ఆదుకునేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి ఈ పథకాన్ని తీసుకొచ్చారు. పంటల బీమా ప్రీమియంలో రైతు తన వంతుగా ఒక్క రూపాయి చెల్లిస్తే మిగతా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించింది. రబీ సీజన్ నుంచి రైతులు ఆ ఒక్క రూపాయి కూడా చెల్లించాలి్సన అవసరం లేదు. ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. గతంలో ప్రధానమంత్రి పంటల బీమా పథకం (పీఎంఎఫ్‌బీవై)లో పంటల వారీగా బీమా సంస్థలు నిర్ణయించిన ప్రీమియం విలువలో రైతులు 2 నుంచి 5 శాతం వరకూ సొమ్ము చెల్లించేవారు. మిగతా మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగం భరించేవి. ఈసారి రైతులు చెల్లించాలి్సన ప్రీమియం బాధ్యత అంతా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంది. ఈ పథకంపై వ్యవసాయ శాఖ, బ్యాంకింగ్ అధికారులు గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. దీంతో ఖరీఫ్, రబీ సీజన్‌ల్లో మొత్తం రూ.4,768 కోట్ల లక్ష్యానికి గాను రూ.3,820 కోట్ల మేర (80 శాతం) రుణాలు మంజూరయ్యాయి. కౌలు రైతులకు సర్కారు అండ భూయజమానుల హక్కులకు భంగం కలగకుండా వారి భూమిని సాగుచేసుకుంటున్న కౌలురైతులకు 11 నెలల పాటు పంట మీద మాత్రమే హక్కు ఉండేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం కౌలుదార్ల చట్టం తీసుకొచి్చంది. దీంతో కౌలుదారులకు వైఎస్సార్ రైతు భరోసా పథకంతో పాటు పంటల బీమా, నష్టపోయిన పంటలకు పరిహారం పొందే అవకాశం ఏర్పడింది. ఈ ప్రకారం జిల్లాలో 12,561 మంది కౌలుదార్లకు రుణఅర్హత పత్రాలను రెవెన్యూ అధికారులు జారీ చేశారు. మరో 2,906 మందికి భూయజమానుల ద్వారా సాగుహక్కు పత్రాలను వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పించారు. ఇలా మొత్తంమీద 15,467 మంది కౌలుదార్లకు మేలు జరిగింది. ఆయా పత్రాల ఆధారంగా జిల్లాలో 11,376 మంది కౌలుదార్లకు రూ.23.26 కోట్ల మేర రుణాలు మంజూరయ్యాయి. -
సహకార బ్యాంక్‌లో రూ.58 లక్షల కుంభకోణం
పెదకూరపాడు : రైతులకు రుణాలు ఇవ్వకుండానే ఇచ్చినట్టు బ్యాంక్ నగదు పుస్తకంలో చూపించి, సొసైటీ ఖాతాలోని రూ.58 లక్షలు గోల్మాల్ చేసిన సంఘటన పెదకూరపాడు మండలం పరసతాళ్లూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం పరిధిలోని గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పెదకూరపాడు శాఖలో చోటు చేసుకుంది. వ్యాపారం పేరుతో ఖాతాలో నగదు డ్రా 2014లో సొసైటీ పేరుతో కాంప్లెక్స్ ఎరువుల వ్యాపారం చేసేందుకని చెప్పి సొసైటీ ఖాతాలో ఉన్న రూ.70 లక్షల్లో రూ.58 లక్షలు డ్రా చేశారు. కొన్నాళ్ల పాటు సొసైటీ పేరుతో ఎరువుల వ్యాపారం చేసిన పాలకవర్గం రెండు సంవత్సరాల్లోనే వ్యాపారం మూసివేసింది. అయితే బ్యాంక్ ఖాతాలో నుంచి తీసుకున్న రూ.50 లక్షలు బ్యాంక్ ఖాతాలో జమ చేయలేదు. సొసైటీలో రుణం తీసుకోని మండలంలోని గారపాడు, పరస, బలుసుపాడు, లింగంగుంట్ల, పెదకూరపాడు గ్రామాలకు చెందిన సొసైటీలో సభ్వత్వం ఉన్న వారిని 41 మంది పేర్లతో వారికి తెలియకుండా 2017–18 మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఒక్కొక్కరికి రూ.1 లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు రుణాలు ఇచ్చినట్టుగా బ్యాంక్ పుస్తకాల్లో చూపించి ఆ నగదుకు లెక్క సరిపెట్టారు. వెలుగులోకి రాకుండా జాగ్రత్తలు సొసైటీ పాలకవర్గానికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ నేతలే గెలుపొందారు. అందులో చైర్మన్‌తో సహా ఎక్కువ మంది టీడీపీకి చెందిన వారే డైరెక్టర్లుగా ఉన్నారు. పైగా సొసైటీ చైర్మన్‌గా ఉన్న వ్యక్తి జీడీసీసీబీ డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. గోల్మాల్ వ్యవహారం బయటకు పొక్కకుండా ఇటు బ్యాంక్ అధికారులను, అటు సొసైటీ అధికారులను మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. బ్యాంక్‌లో గత ఏడాది పనిచేసిన నోడల్ అధికారి ఒకరు ఈ కుంభకోణంపై బ్యాంక్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా నేటివరకు విచారణ చేపట్టకుండా బ్యాంక్ ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కించారు. గత బ్రాంచ్ మేనేజర్ ఈ విషయమై ప్రశ్నించడంతో ఆయన్ను పాలకపార్టీ నాయకులు బదిలీపై పంపించేశారని తెలుస్తోంది. మూలధనమా...రుణమాఫీ నగదా? 2007లో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో సొసైటీకి రూ.10 కోట్ల మేరకు రుణమాఫీ నిధులు వచ్చాయి. కానీ వాటిలో సుమారు. 9.30 కోట్ల మేరకు రైతులకు రుణమాఫీ చేసి మిగిలిన నగదు సొసైటీ పేరుతో పెదకూరపాడు సహకార బ్యాంక్‌లో డిపాజిట్ చేసినట్టు తెలిసింది. అప్పటికే మూలధనం మొత్తం రైతులకు రుణాలు ఇచ్చినట్టు తెలిసింది. బ్యాంక్‌లో జమచేసిన నగదు రుణమాఫీ నగదుగా పలువురు రైతులు చెబుతున్నారు. నోటీసులు రాకుండా పరపతివినియోగించిన నేతలు ఈ కుంభకోణంపై బ్యాంక్ నోడల్ అధికారి ఇచ్చిన నివేదిక ప్రకారం విచారణ చేసేందుకు రైతులకు గతంలో ఒకసారి నోటీసులు ఇవ్వగా ఆ నోటీసులు రైతుల వద్దకు చేరకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారని తెలిసింది. దీంతో అసిస్టెంట్ రిజిస్ట్రార్, సబ్ డివిజన్ కో–ఆపరేటివ్ ఆఫీసర్ నిరంజన్ రైతులకు రెండవ విడత నోటీసులు ఇచ్చారు. రైతుల్లో ఆందోళన తమకు తెలియకుండా, తాము ఎక్కడా సంతకాలు చేయకుండా, తమ పేరుతో రుణాలు తీసుకున్నట్టు తెలిసి నోటీసులు అందుకున్న సొసైటీ సభ్యులు విస్తుపోయారు. బ్యాంకు చుట్టూ తిరిగినా రుణాలు ఇవ్వని బ్యాంక్ సిబ్బంది, కనీసం బ్యాంకుకు కూడ వెళ్లకుండా తమకు రుణాలు ఇచ్చినట్టు, వాటి రికవరీకి నోటీసులు రావడంతో లబోదిబోమంటున్నారు. మూడు రోజుల పాటు విచారణ రైతులకు నోటీసులు ఇచ్చిన నిరంజన్ మూడు రోజుల పాటు రైతులను విచారించనున్నట్టు తెలిపారు. మొదటి రోజు గారపాడు గ్రామానికి చెందిన రైతులను, మిగిలిన రోజులు పరస, లింగంగుంట్ల, బలుసుపాడు, పెదకూరపాడుకు చెందిన రైతులను విచారించనున్నారు. మొదటి రోజు విచారణలో గారపాడు గ్రామానికి చెందిన రైతులు రుణాల సంగతి తమకు తెలియదని, బ్యాంక్ పుస్తకాల్లో ఉన్న సంతకాలు తమవి కావని తెలిపారు. రుణాల సంగతి మాకు తెలియదని చెప్పారు బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో విచారణ చేపట్టాం. పరసతాళ్ళూరు సొసైటీ పరిధిలో 41 మంది సభ్యులకు సుమారు రూ.50 లక్షలకు పైగా రుణాలు ఇచ్చినట్టు బ్యాంక్ నగదు పుస్తకంలో రాసి ఉంది. బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు మేరకు రైతులకు నోటీసులు అందించాం.అందులో భాగంగా రైతులను విచారణకు పిలవగా, వారు తాము సొసైటీలో సభ్యులమే కానీ, తాము ఎలాంటి రుణాలు తీసుకోలేదని చెప్పారు. ఇదే విషయాన్ని రికార్డు చేసి రైతులకు చదివి వినిపించి సంతకాలు తీసుకుంటున్నాం. –నిరంజన్, ఆసిస్టెంట్ రిజిస్ట్రార్,సబ్ డివిజన్ ఆఫీసర్, సత్తెనపల్లి -
అప్పునంగా ఓట్లు.. బంగారం కోసం పాట్లు!
విజయనగరం అర్బన్: పంట రుణాలపై రైతులెవరూ వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పిన టీడీపీ ప్రభుత్వ ఆచరణలో మాత్రం చేతులెత్తేస్తోంది. దీనికితోడు రుణమాఫీ వర్తింపు తరువాత కొత్తరుణాలకు పరిధులను తగ్గిస్తూ బ్యాంకురుణాలకు రైతుల్ని దూరం చేస్తొంది. ప్రధానంగా బంగారం తనఖా రుణాలపై బ్యాంకర్లు ఇష్టానుసారంగా నిబంధనలు పెట్టడంతో రైతుకు రుణాలు అందడం లేదు. బంగారం, భూమి ఎంతమేరకు పెట్టినా రూ.లక్ష దాటి రుణం ఇవ్వరాదని బ్యాంకర్లు నిర్దేశించారు. దీంతో బంగారం తనఖా రుణాల రైతుకు ఆసరా లభించని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో తగ్గిన బంగారు రుణ లక్ష్యాలు: జిల్లాలో గత కొన్నేళ్లుగా బ్యాంకు రుణ లక్ష్యాలను పరిశీలిస్తే బంగారం తనఖా రుణాలపై ఆధారపడే రైతులు జిల్లాలో 40 శాతం మంది ఉన్నారు. రుణమాఫీ ప్రకటించిన తరువాత బ్యాంకర్ల వైఖరి మారింది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, రుణ పరిధి కుదింపు వంటి అంశాలను నిర్దేశించడంతో రైతుకు బంగారంపై ఇచ్చే తనఖా రుణాలు ఎటూ చాలని పరిస్థితి ఉంది. దీనికితోడు రుణమాఫీ అవుతుందని ఎదురుచూస్తూ బ్యాంకుల్లో బంగారాన్ని ఉంచేయడం వల్ల వడ్డీ పేరుకుపోతోంది. రుణమాఫీ అమలు తరువాత జిల్లాలో గడిచిన ఏడాది (జూన్-2015 ముగిసిన నాటికి) ఖరీఫ్, రబీ కలుపుకొని రూ.1,100 కోట్ల లక్ష్యం కాగా వీటిలో బంగారు రుణాల లక్ష్యాలే రూ.600 కోట్లకు పైగానే ఉన్నాయి. కానీ రెండూ కలిపి కేవలం రూ. 605 కోట్లు రుణాలు మాత్రమే రైతుల (94 వేల మంది)కు అందాయి. రుణమాఫీ అవుతుందని ఎదురుచూసిన రైతులు రికవరీ చేయకపోవడం వల్లే కొత్తరుణాల లక్ష్యాలను కనీసం 50 శాతం కూడా సాధించలేకపోయామని బ్యాంకర్లు చెబుతున్నారు. దూరమవుతున్న బంగారం రుణమాఫీ అవుతుందని ఎదురుచూస్తున్న బంగారంపై రుణాలు వాడిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. రుణానికి ఇచ్చిన గడువు లోపు రుణమాఫీ కాకపోవడం వల్ల ఆ బంగారాన్ని బాంక్లర్లు వేలం వేస్తున్నారు. దీనికి తోడు రికవరీ జరిగి రుణవిముక్తులు కాకపోవడం వల్ల కొత్తరుణం కూడా అందడంలేదు. రికవరీ చేయని వారికి కొత్తరుణాలు ఇవ్వడం మాటలా ఉంటే జిల్లాలో నాలుగు బ్యాంకులకు చెందిన వివిధ ప్రాంతాల శాఖల రైతుఖాతాదారుల (300 మంది రైతుల) రూ.3 కోట్ల రుణానికి తనఖాలో ఉన్న బంగారాన్ని వేలం వేసినట్లు తెలుస్తోంది. ఇవీ రైతు రుణాలు జిల్లాలోని 150 జాతీయ, 70 గ్రామీణ బ్యాంకులలో మార్చి-2014 (రుణమాఫీ వర్తింపు తేదీ) వరకు గత కొన్నేళ్లుగా ఇచ్చిన రుణాలు రూ.1,462 కోట్ల వరకు రైతులకు వివిధ రూపాల్లో రుణాలున్నాయి. పంట, బంగారు రుణాలు కలిపి: రూ.1,162 కోట్లు వీటిలో పంటలపై రూ.730 కోట్ల(రైతులు: లక్షా 82 వేల మంది) రుణాలు ఉన్నాయి. బంగారం తనఖాపై రూ.432 కోట్లు (రైతులు: 55 వేల మంది) రుణంగా బ్యాంకులు ఇచ్చాయి. ఇవి కాకుండా వ్యవసాయ యంత్రాలు, సామగ్రి, విత్తనాలు వంటి ఇతర అవసరాల రుణాలు రూ. 300 కోట్లు (రైతులు: 30 వేల మంది)రుణాలు ఇచ్చాయి. రుణ మాఫీ వర్తింపు వివరాలు మాఫీ ఫేజ్-1లో రూ.390 కోట్ల రుణాలు (రైతులు: 1,44,621 మంది) మంజూరు చేస్తే రూ.184.21 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మాఫీ ఫేజ్-2లో రూ.181.71 కోట్ల రుణాలు (రైతులు: 68,116 మంది) మంజూరు చేస్తే రూ.103.21 కోట్లు మాత్రమే విడుదల చేశారు. తాజాగా మాఫీ ఫేజ్-3లో రూ.46.84 రోట్లు (రైతులు: 19,477 మంది) మంజూరు చేస్తే రూ.26.5 కోట్లు ూత్రమే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పంటలు నష్టపోయి కష్టాల్లో కూరుకుపోతున్న తమను ఆదుకోవాల్సిన స ర్కారే ఇలా వంచిస్తుంటే ఇక తామెలా బతకాలని రైతులు వాపోతున్నారు. -
అడియాసే..
AP Runa Mafi List 2014 Check Loan Status Online Crop రుణమాఫీ జాబితాల్లో అర్హులెందరికీ దక్కనిచోటు రూ.50 వేల లోపు రుణాల మాఫీలోనూ దగాయే రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకే మాఫీ జిల్లావ్యాప్తంగా హతాశులవుతున్న అన్నదాతలు ‘అంతన్నారింతన్నారే...చంద్రబాబు నట్టేట్లో ముంచేశారే’ అంటూ జిల్లాలో రైతులు లబోదిబోమంటున్నారు. రైతుల వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని గద్దెనెక్కిన చంద్రబాబు చివరకు తొలివిడత రూ.50 వేల లోపు రుణాల మాఫీ అంటూ మాట మార్చారు. ఆ మాటపైనైనా నిలబడ్డారా అంటే అదీ లేదని రైతులు నిప్పులు చెరుగుతున్నారు. ఇచ్చిన మాటను నిలుపుకోవాలనే చిత్తశుద్ధి లేని వాడిని నమ్మి మోసపోయామని వాపోతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ :తొలివిడతలో రూ.50 వేల లోపు రుణాలు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం ఆ వివరాలను ఆన్లైన్లో పెట్టి, బ్యాంకు బ్రాంచిలకు సమాచారం అందించింది. అయితే ఆ వెబ్సైట్ తెరిచిచూస్తే అంతా మాయాజాలంగా ఉండటంతో రైతులు అయోమయంలో పడ్డారు. జిల్లాలో రైతుల రుణాలు పంట రుణాల 3,12,823 ఖాతాల్లో రూ.2,844 కోట్లు, గోల్డ్ లోన్ 4,88,630 ఖాతాల్లో రూ.3945 కోట్లు, కన్వర్టెడ్ క్రాప్‌లోన్ 1,81,141 ఖాతాల్లో రూ.876 కోట్ల వరకు ఉన్నాయి. 71,744 ఖాతాల్లో టెర్మ్ లోన్లుగా రూ.1022 కోట్లు ఉన్నాయి. వీటిలో కనీసం పంట రుణాలు రూ.2,844 కోట్లు అయినా మాఫీ అవుతాయని ఆశించారు. సర్కార్ తాజాగా ప్రకటించిన రూ.50 వేల లోపు రుణమాఫీపై ఆశతో వెబ్సైట్లు వెతుకుతుంటే వాటిలోని సమాచారం గుండె గుభేల్మంటోంది. ఆదివారం సెలవు కావడంతో సోమవారం జాబితాలు చూసుకున్న రైతులు అంతా మాయాజాలంగా ఉందని కంటతడి పెడుతున్నారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ‘సాక్షి’ బృందం సోమవారం క్షేత్రస్థాయిలో ఆరా తీసిన ప్రతిచోటా ైరె తుల ఆక్రందనలే వినిపించాయి. రాజోలు, మలికిపురం పరిసర ప్రాంతాల్లో బ్యాంకులకు వచ్చిన జాబితాలను ‘సాక్షి’ పరిశీలించింది. అన్ని బ్యాంకుల్లో సుమారు రూ.40 కోట్ల వ్యవసాయ రుణాలుండగా జాబితా ప్రకారం రూ.5 కోట్లు మాఫీ జరిగితే గొప్పేనంటున్నారు. రూ.50 వేల లోపు రుణం తీసుకున్న కొందరు రైతులకు రూ.10 వేల నుంచి రూ.20వేల వరకే మాఫీ ప్రకటించారు. ప్రకటించిన మాఫీ మొత్తాన్ని ఐదు వాయిదాల్లో బ్యాంకులలో జమ చేయనున్నట్టు చెబుతున్నారు. ఈ మేరకు రూ.50 వేల రుణం పొందిన రైతులకు మొదటి విడత మాఫీ అంటూ రూ.3 వేల నుంచి రూ.6 వేలు జమ చేస్తున్నట్టు జాబితాల్లో ఉన్న సమాచారం చూసి రైతులు విస్తుపోతున్నారు. ఈ మాత్రం దానికి ఇంత ఊరించడం దేనికని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ జాబితాలను చూసేందుకు సోమవారం ఉదయం నుంచే రైతులు పెద్ద ఎత్తున రాజోలు, మలికిపురంలలో బ్యాంకులకు చేరుకుని తీరా జాబితాల్లో తమ పేరు లేక పోవడంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు. 40 శాతం మంది పేర్లు గల్లంతు మండపేట నియోజకవర్గంలో 30 వేల మందికి పైగా రైతులు రుణమాఫీకి అర్హులని జాబితా పంపించారు. మండపేట ఎస్బీఐలో 965 మంది, ఆంధ్రా బ్యాంకులో సుమారు 750 మంది, సిండికేట్ బ్యాంకు లో 374 మంది, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో 267 మంది, హెచ్డీఎఫ్సీ బ్యాంకులో 19 మందిని అర్హులుగా నిర్ధారించి జాబితాలు పంపగా 40 శాతం పైగా పేర్లు జాబితాలో లేవు. రాయవరం ఎస్బీహెచ్లో 820 మందికి 559, వెదురుపాక ఆంధ్రాబ్యాంకులో 483 మందికి 192 మంది, కపిలేశ్వరపురం మండలంలో మొత్తం 8318 ఖాతాలను మాఫీ కోసం ప్రతిపాదనలు పంపగా 3159 ఖాతాలు మాత్రమే జాబితాలో ఉన్నాయి. కపిలేశ్వరపురం ఆం ధ్రాబ్యాంకు నుంచి 1600 మంది రైతులతో జాబితా వెళితే 471 మంది, టేకి ఆంధ్రాబ్యాంకులో 2038 మందికి 523 మంది, అంగర ఎస్బీఐలో 1557 మం దికి 540 మంది, వల్లూరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో 1800 మందికి 490 మందిపైనే దయతలచిన సర్కార్ మిగిలిన వారి నోట్లో మన్నుకొట్టింది. ఆరునెలల నిరీక్షణకు ఫలితం నిరాశే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆరు నెలలుగా మాఫీ కోసం ఎదురు చూసిన రైతుల ఆశలు ఆడియాసలైపోయాయి. రుణమాఫీ వివరాలను జిల్లాలోని 293 సహకార సంఘాల్లో అధికారులు డౌన్లోడ్ చేసుకునే పనిలో పడ్డారు. దాదాపు ప్రతి సొసైటీలో 40 నుంచి 60 మంది అర్హుల పేర్లు గల్లంతయ్యాయి. అమలాపురం రూరల్ వన్నెచింతలపూడి సొసైటీలో 401మందితో జాబితా పంపిస్తే 51 మంది పేర్లు జాబితా నుంచి మాయమయ్యాయి. జిల్లాలోని కొన్ని సహకార సంఘాల్లో రూ.50 వేల లోపు రుణాలను కూడా వాయిదాల పద్ధతిలో రద్దుకు ఉద్దేశించినట్టు ఉండటంతో సొసైటీ ఉద్యోగులే ఆశ్చర్యపోతున్నారు. ద్రాక్షారామ సొసైటీలో 70 మంది రూ.50 వేల లోపు రుణాలు తీసుకున్న రైతులున్నారు. చంద్రబాబు మాట ప్రకారం వీరి రుణాలు ఏక మొత్తంగా రద్దు కావాలి. కానీ వారందరి పేర్లు వాయిదాల పద్ధతిలో రద్దు అయ్యే జాబితాలో కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి జిల్లాలోని పలు సొసైటీల్లో ఉంది. ఎంత మోసం! రుణమాఫీ అంటే చంద్రబాబుకు ఓట్లేసి గెలిపించాం. నాకు లక్కవరం ఎస్బీఐలో రూ.43 వేల రుణం ఉంది. రూ.50 వేలు ఒకేసారి మాఫీ అవుతుందనుకున్నా. తీరా జాబితా చూస్తే మాఫీ అవుతున్నది రూ.8వేలు మాత్రమే. చంద్రబాబు ఎంత మోసం చేశారు! -దొంగ నాగ సత్యవతి, కేశనపల్లి, మలికిపురం మండలం (టీడీపీ తరపున సర్పంచ్‌గా పోటీ చేసిన నిరు పేద మహిళ) జాబితాలో పేరు లేదు.. పడమర ఖండ్రిక సహకార సంఘంలో రూ.36 వేల రుణాన్ని తీసుకోగా వడ్డీతో రూ.37,291 అయింది. రూ.50 వేల లోపు రుణాలన్నీ మాఫీ అనడంతో రుణం పోతుందని ఆశించాను. కానీ ఒక రూపాయి కూడా మాఫీ కాలేదు. -అరవపల్లి బుల్లియ్య, పడమర ఖండ్రిక, కపిలేశ్వరపురం మండలం -
మాఫీ మాయ!
కవిటి:అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రైతులు రుణాలు కట్టవద్దనీ, ప్రతి పైసా మాఫీ చేస్తాననీ, ఎన్ని రకాల రుణాలైనా, రుణమెంతైనా మాఫీ చేసి తీరుతామని ప్రగల్భాలు పలికారు. ఈ హామీలను నమ్మిన జనం ఓట్లు వేసి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే ఆ తరువాతే బాబుగారి అసలు రూపం బయటపడింది. ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు. రైతులను పట్టించుకోవడం మానేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేశారు. రకరకాల కొర్రీలతో రుణమాఫీని పక్కదారి పట్టించడంతో వేలాది మంది కొబ్బరి రైతులు ఆందోళన చెందుతున్నారు. కొబ్బరి వాణిజ్య పంటని చెప్పడంతోపాటు..పలు కొర్రీలు వేస్తూ రైతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. ఒక వైపు వాణిజ్య బ్యాంకులకు సహకార బ్యాంకుల సిబ్బందికి పైఅధికారులు ఇటీవల సంక్షిప్త సందేశాలు(ఎస్ఎంఎస్) ల రూపంలో కొబ్బరి రైతులకు సంబంధించిన రుణ వివరాలను రుణమాఫీకి నివేదించవద్దని రహస్యంగా ఆదేశాలు జారీ చేశారు. ఇవేవీ తెలియని రైతులు ఆధార్, రేషన్, పట్టాదార్ పాసుపుస్తకాలు, బ్యాంకు ఖాతాల వివరాలకు సంబంధించి జిరాక్స్ కాపీలన్నీ రుణం పొందిన బ్యాంకులకు అందించి మాపీ ప్రకటన కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. సాధారణంగా బ్యాంకులు ఖరీఫ్, రబీ సీజన్లలో పంట రుణాలు రైతులకు అందిస్తాయి. ఎకరా ప్రామాణికంగా తీసుకుని పంట, బంగారంపై రుణాలందిస్తాయి. ఇప్పటివరకు రుణమాఫీ చేసిన అన్ని ప్రభుత్వాలు కొబ్బరి పంటకు కూడా రుణమాఫీని వర్తింపజేశాయి తప్పితే షరతులతో వెలివేసిన దాఖలాలు లేవు. అంతేకాకుండా బ్యాంకుల్లో అందించిన రుణాలపై మెట్టుపల్లం అని నమోదైన నేపథ్యంలో సాంకేతికంగా కొబ్బరిరైతులు కూడా రుణమాఫీ పరిధిలోనికే వస్తారు. అయితే వాస్తవానికి టీడీపీ ప్రభుత్వం చేస్తున్న వింత వాదన విచిత్రంగా ఉంది. రుణమాఫీపై సంతకం చేసినప్పుడు, కోటయ్య కమిటీ నివేదికల్లో కానీ, ఉద్యానపంటలైన మిర్చి, పసుపు, కొబ్బరి పంటలకు రుణమాఫీ వర్తించదని ప్రకటించలేదు. బ్యాంకర్ల నుంచి రుణాల నివేదికలు అందిన తర్వాతే రోజుకో షరతుతో కొబ్బరి రైతు పుట్టె మునిగేలా ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. వాస్తవానికి సాంకేతికంగా విశ్లేషిస్తే మిగిలిన ఉద్యాన పంటలతో పోల్చుకుంటే కొబ్బరిసాగు విభిన్నమైన, వైవిధ్య భరితమైనది. మిర్చి, పసుపు ఏకవార్షిక పంటలు. ఏడాదిలోనే ఫలసాయం వస్తోంది. కొబ్బరి విషయంలో మాత్రం పూర్తిగా భిన్నం. దేశవాళీ రకానికి చెందిన కొబ్బరి మొక్కను నాటితే అనేక బాలారిష్టాలు దాటి కనీసం 8 ఏళ్లకు తెగుళ్లబారిన పడకుండా ఉండి అనుకూల వాతావరణ పరిస్థితులుంటే కాపుకు వస్తుంది. కాపుకొచ్చిన మూడు నాలుగేళ్లు సాధారణస్థాయిలోనే దిగుబడులను అందిస్తుంది. ఇంతలో ప్రకృతివైపరీత్యాలు సంభవిస్తే ఫలసాయం అందకుండా రైతులను నట్టేట ముంచుతుంది. ఇలాంటి పరిస్థితిలో కొబ్బరి రైతుకు రుణ మాఫీ వర్తించకుండా ప్రభుత్వం కొర్రీలు వేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది వచ్చిన పై-లీన్, ఇటీవల వచ్చిన హుదూద్ తుపాను కారణంగా జిల్లాలో వేలాది కొబ్బరి చెట్టు నేలకొరిగారుు. రైతులు నష్టపోయూరు. ఈ పరిస్థితిలో కొబ్బరి రైతులకే రుణ మాఫీ వర్తింప చేయూలనే డిమాండ్ ఆ వర్గం నుంచి బలంగా వస్తుంది. కనీసం పంటల బీమా కూడా కొబ్బరికి వర్తించని పరిస్థితిలో రైతులను ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉంది. జిల్లాలో సుమారు 35 వేల ఎకరాల్లో కొబ్బరి సాగులో ఉంది. ఇందులో కవిటి, కంచిలి, సోంపేట,ఇచ్ఛాపురం మండలాల్లోనే మూడొంతులు సాగవుతోంది. రణస్థలం, ఎచ్చెర్ల, పలాస, వ జ్రపుకొత్తూరు మండలాల్లో కూడా విస్తారంగా సాగులో ఉంది. కాగా జిల్లాలో కొబ్బరి రైతులకు రుణమాఫీ వర్తింపచేస్తే దాని భారం ప్రభుత్వంపై వంద కోట్ల రూపాయలకంటే తక్కువగానే ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. గత ఏడాది సంభవించిన వచ్చిన పై-లీన్ తుపాను సమయంలో ఉద్దానం ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు నాయుడు రుణమాఫీయే ఈ ప్రాంత రైతుల కష్టాలు తీర్చగలదని చెప్పుకొచ్చారు. అరుుతే ఇప్పుడు లేనిపోని సాకులు చెబుతూ, కొర్రీలు పెడుతూ రుణమాఫీ వర్తింప చేయకుండా కాలయూపన చేయడంపై కొబ్బరి రైతు మండిపడుతున్నారు. ఈ ప్రాంత టీడీపీ నేతలు రాజకీయూలు మాని రైతుల కోసం ఉద్యమించాలని వేడుకుంటున్నారు. -
మాఫీ రూ.1800 కోట్లు!
- బ్యాంకర్ల అంచనా - ఖరారు కాని తుది జాబితా - గడువు కోరిన బ్యాంకర్లు - 3 లోగా అందించాలని కలెక్టర్ ఆదేశం - అధికారులతో సమీక్ష కరీంనగర్ అగ్రికల్చర్ : జిల్లాలో మాఫీ అయ్యే రైతుల రుణాలు సుమారు రూ.1800 కోట్లుగా అంచనా. తుది జాబితా ఇంకా ఖరారు కాకున్నా ప్రాథమికంగా రూపొందించిన లెక్కలు దీన్ని స్పష్టంచేస్తున్నాయి. ఆదివారంలోగా జిల్లాలో అర్హుల జాబితా సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించాల్సి ఉన్నా.. సామాజిక తనిఖీ సభల నిర్వహణలో ఆలస్యం, ఇతర కారణాలతో ఖరారు కాలేదు. అర్హులను తేల్చేందుకు తమకు మరికొంత సమయం కావాలని బ్యాంకులు కోరడంతో మూడు రోజుల్లోగా తుది నివేదిక అందించాలని కలెక్టర్ వీరబ్రహ్మయ్య ఆదేశించారు. ఒక్కో రైతు కుటుంబానికి రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అర్హుల జాబితాను రూపొందించాలని బ్యాంకులను, అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. మండలానికో బ్యాంకు మేనేజర్‌ను బాధ్యుడిగా కమిటీలు వేశారు. ఈ మేరకు తమ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతుల జాబితాలను బ్యాంకులు రూపొందించాయి. ఆగస్టు 27 నుంచి 30 వరకు గ్రామాల్లో సామాజిక తనిఖీ పేరిట రైతుల జాబితాను చదివి వినిపించారు. తమ పేర్లు జాబితాలో లేవని చాలా చోట్ల రైతులు ఆందోళనకు దిగారు. మరికొన్ని చోట్ల గుంట భూమిలేనివారి పేరిట కూడా రుణాలు ఇచ్చినట్లు తేలింది. కొందరు రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతోపాటు రెండు, మూడు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నవారు ఉన్నారు. వీరి గుర్తింపు కష్టంగా మారింది. దీంతో ఆదివారంలోగా తుదిజాబితా రూపొందించాల్సి ఉన్నా ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం కలెక్టరేట్లో బ్యాంకు మేనేజర్లు, వ్యవసాయాధికారులతో కలెక్టర్ వీరబ్రహ్మయ్య సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో అర్హుల జాబితా రూపకల్పనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వేర్వేరు చోట్ల రుణాలు తీసుకున్న వారిని గుర్తించడం కష్టమవుతోందని, తుదిజాబితాకు కొంత గడువు కావాలని బ్యాంకర్లు కలెక్టర్‌ను కోరారు. దీంతో మూడు రోజుల్లోగా జాబితా అందించాలని కలెక్టర్ ఆదేశించారు. సెప్టెంబర్ 3న నిర్వహించనున్న బ్యాంకర్ల సమావేశంలో జిల్లాలో రుణమాఫీకి అర్హులైన తుదిజాబితాను ఆమోదించి ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. మొదట వ్యవసాయ రుణాలపైనే దృష్టిసారించాలని సూచించారు. 2014 మార్చి 31 వరకు గల రుణాల్లో రూ.లక్ష వరకు మాఫీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో మొత్తం 4,76,717 మంది రైతులకు రూ.2,505.66 కోట్ల పంట రుణాలు మంజూరయ్యాయి. ఇప్పటివరకు జాబితా రూపకల్పనలో భాగంగా రూ.1,800 కోట్లు రుణమాఫీ అవుతాయని అంచనా వేసినట్లు వ్యవసాయాధికారులు, బ్యాంకర్లు చెబుతున్నారు. సామాజిక తనిఖీలు పూర్తి : కలెక్టర్ జిల్లాలో అన్ని గ్రామాల్లో సామాజిక తనిఖీలు నిర్వహించినట్లు కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య తెలిపారు. ఆదివారం కలెక్టరేట్లో వ్యవసాయ, బ్యాంకర్లతో సమీక్షించారు. రుణమాఫీకి ఏబీసీడీ జాబితా సిద్ధం చేసినట్లు తెలిపారు. తుదిజాబితా(ఇ) సిద్ధం చేయాల్సి ఉందని, బ్యాంకర్ల కోరిక మేరకు ఈ నెల 3లోగా తుదిజాబితాకు అవకాశమిచ్చినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ, బ్యాంకు సిబ్బంది సమన్వయంతో సమస్యను అధిగమించాలన్నారు. బ్యాంకు మేనేజర్, ప్రత్యేకాధికారి, కన్వీనర్, తహశీల్దార్, ఎంపీడీవో తప్పనిసరిగా సంతకం చేసి జాబితాను బ్యాంకు కంట్రోలర్లకు, ఎల్డీఎంకు, వ్యవసాయశాఖ జేడీకి పంపాలని తెలిపారు. సమీక్షలో జేడీఏ ప్రసాద్, ఎల్డీఎం చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
నడ్డి విరిగేలా ‘వడ్డి’ంపు!
అధికారంలోకి రాగానే రుణమాఫీపై తొలి సంతకం చేస్తానని గొప్పగా ప్రకటించిన చంద్రబాబునాయుడు ఇప్పుడు కమిటీ పేరుతో కాలయాపన చేస్తుండడంతో అది కాలనాగై రైతును కాటేయడానికి సిద్ధమైంది. వడ్డీ అనే విషం కక్కుతూ బుసకొడుతోంది. చంద్రబాబు హామీ తమను కష్టాల నుంచి గట్టెక్కిస్తుందని భావించిన రైతుకు అదే శాపంగా మారింది. విజయనగరం అర్బన్: రైతులను ఏటా కష్టాలు వెంటాడుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ రుణమాఫీ అమలులో జాప్యం చేయడం వల్ల తొలి సంతకం హామీ రైతుకు మేలు చేయకపోగా...మరింత భారాన్ని మోపుతోంది. ప్రభుత్వం రుణం మాఫీ చేస్తుందన్న ఆశతో రైతులు బకాయిలు చెల్లించలేదు. బ్యాంకునిబంధనల ప్రకారం ఏడాది క్రితం తీసుకున్న రుణాలను జూన్ నెలాఖరులోపు తీర్చేయాలి. సాధారణంగా వ్యవసా య రుణాలకు 7 శాతం వడ్డీ వసూలు చేస్తారు. గడువు లోపు చెల్లించకపోతే అది 11.07 శాతానికి పెరుగుతుంది. గడువు జూన్ 30తో ముగిసిపోయింది. దీంతో అధిక వడ్డీ వసూలు చేయడానికిబ్యాంకులు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 1వ తేదీ నుంచి ఈ ‘వడ్డి’ంపు వేయనున్నారు. ఈ మేరకు నోటీసులు పంపిస్తున్నారు. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రిజర్వు బ్యాంకు, ఎస్ఎల్బీసీ (స్టేల్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ) నిబంధనల మేరకు పంట రుణం తీసుకున్న ఏడాదిలోపు చెల్లించిన వారికి మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వడ్డీరాయితీ పథకం (ఏడు శాతం వడ్డీ) వర్తిస్తుంది. అయితే, గడువు మీరిన బకాయిపై కచ్చితంగా 11.07 శాతం వడ్డీ చెల్లించాలి. జిల్లాలో ఇప్పటికే గడువు మీరిన బకాయిదారులకు రికవరీ నోటీసుల జారీ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 4.40 లక్షల మంది రైతులుండగా.. ఇందులో రెండు లక్షల మంది వివిధ పద్దుల కింద సాగు కోసం రుణాలు తీసుకున్నారు. జాతీయ, గ్రామీణ, సహకార బ్యాంకుల్లో దీర్ఘకాలిక, స్వల్పకాలిక, బంగారు ఆభరణాల తనఖాపై రూ. 2,040 కోట్ల మేర రుణంగా తీసుకున్నారు. స్వయసహాయక సంఘాలు మినహా రైతులకు సంబంధించి ఒక్క శాతం కూడా బకాయి రికవరీ కాలేదు. దీంతో ఈ సొమ్ముపై 4.07శాతం వడ్డీని అదనంగా వసూలు చేస్తే జిల్లా రైతులపై రూ.5 కోట్ల పది లక్షల మేర భారం పడుతుంది. గ్రామాల్లో చాలామంది ఇప్పటికే బయట తెచ్చిన అప్పులకు వడ్డీలకు వడ్డీలు కడుతున్నారు. ఇక బ్యాంకులు ‘వడ్డి’స్తే తమ పరిస్థితి ఏంటని తలచుకుంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు.