అడియాసే.. | AP Runa Mafi List 2014 Check Loan Status Online Crop Loan Waiver | Sakshi
Sakshi News home page

అడియాసే..

Published Tue, Dec 9 2014 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM

అడియాసే..

అడియాసే..


AP Runa Mafi List 2014 Check Loan Status Online Crop
     రుణమాఫీ జాబితాల్లో అర్హులెందరికీ దక్కనిచోటు
     రూ.50 వేల లోపు రుణాల మాఫీలోనూ దగాయే
     రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకే మాఫీ
     జిల్లావ్యాప్తంగా హతాశులవుతున్న అన్నదాతలు
 
 ‘అంతన్నారింతన్నారే...చంద్రబాబు నట్టేట్లో ముంచేశారే’ అంటూ జిల్లాలో రైతులు లబోదిబోమంటున్నారు. రైతుల వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని గద్దెనెక్కిన చంద్రబాబు చివరకు తొలివిడత రూ.50 వేల లోపు రుణాల మాఫీ అంటూ మాట మార్చారు. ఆ మాటపైనైనా నిలబడ్డారా అంటే అదీ లేదని రైతులు నిప్పులు చెరుగుతున్నారు. ఇచ్చిన మాటను నిలుపుకోవాలనే చిత్తశుద్ధి లేని వాడిని నమ్మి మోసపోయామని వాపోతున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ :తొలివిడతలో రూ.50 వేల లోపు రుణాలు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం ఆ వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టి, బ్యాంకు బ్రాంచిలకు సమాచారం అందించింది. అయితే ఆ వెబ్‌సైట్ తెరిచిచూస్తే అంతా మాయాజాలంగా ఉండటంతో రైతులు అయోమయంలో పడ్డారు. జిల్లాలో రైతుల రుణాలు పంట రుణాల 3,12,823 ఖాతాల్లో రూ.2,844 కోట్లు, గోల్డ్ లోన్ 4,88,630 ఖాతాల్లో రూ.3945 కోట్లు, కన్వర్టెడ్ క్రాప్‌లోన్ 1,81,141 ఖాతాల్లో రూ.876 కోట్ల వరకు ఉన్నాయి. 71,744 ఖాతాల్లో టెర్మ్ లోన్లుగా రూ.1022 కోట్లు ఉన్నాయి. వీటిలో కనీసం పంట రుణాలు రూ.2,844 కోట్లు అయినా మాఫీ అవుతాయని ఆశించారు. సర్కార్ తాజాగా ప్రకటించిన రూ.50 వేల లోపు రుణమాఫీపై ఆశతో వెబ్‌సైట్‌లు వెతుకుతుంటే వాటిలోని సమాచారం గుండె గుభేల్‌మంటోంది. ఆదివారం సెలవు కావడంతో సోమవారం జాబితాలు చూసుకున్న రైతులు అంతా మాయాజాలంగా ఉందని కంటతడి పెడుతున్నారు.
 
 జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ‘సాక్షి’ బృందం సోమవారం క్షేత్రస్థాయిలో ఆరా తీసిన ప్రతిచోటా ైరె తుల ఆక్రందనలే వినిపించాయి. రాజోలు, మలికిపురం పరిసర ప్రాంతాల్లో బ్యాంకులకు వచ్చిన జాబితాలను   ‘సాక్షి’ పరిశీలించింది. అన్ని బ్యాంకుల్లో సుమారు రూ.40 కోట్ల వ్యవసాయ రుణాలుండగా జాబితా ప్రకారం రూ.5 కోట్లు మాఫీ జరిగితే గొప్పేనంటున్నారు. రూ.50 వేల లోపు రుణం తీసుకున్న కొందరు రైతులకు రూ.10 వేల నుంచి రూ.20వేల వరకే మాఫీ ప్రకటించారు. ప్రకటించిన మాఫీ మొత్తాన్ని ఐదు వాయిదాల్లో  బ్యాంకులలో జమ చేయనున్నట్టు చెబుతున్నారు. ఈ మేరకు రూ.50 వేల రుణం పొందిన రైతులకు మొదటి విడత మాఫీ అంటూ రూ.3 వేల నుంచి రూ.6 వేలు జమ చేస్తున్నట్టు జాబితాల్లో ఉన్న సమాచారం చూసి రైతులు విస్తుపోతున్నారు. ఈ మాత్రం దానికి ఇంత ఊరించడం దేనికని  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ జాబితాలను  చూసేందుకు సోమవారం ఉదయం నుంచే రైతులు పెద్ద ఎత్తున రాజోలు, మలికిపురంలలో బ్యాంకులకు చేరుకుని తీరా జాబితాల్లో తమ పేరు లేక పోవడంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు.
 
 40 శాతం మంది పేర్లు గల్లంతు
 మండపేట నియోజకవర్గంలో 30 వేల మందికి పైగా రైతులు రుణమాఫీకి అర్హులని జాబితా పంపించారు. మండపేట ఎస్‌బీఐలో 965 మంది, ఆంధ్రా బ్యాంకులో సుమారు 750 మంది, సిండికేట్ బ్యాంకు లో 374 మంది, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో 267 మంది, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 19 మందిని అర్హులుగా నిర్ధారించి జాబితాలు పంపగా 40 శాతం పైగా పేర్లు జాబితాలో లేవు. రాయవరం ఎస్‌బీహెచ్‌లో 820 మందికి 559,  వెదురుపాక ఆంధ్రాబ్యాంకులో 483 మందికి 192 మంది, కపిలేశ్వరపురం మండలంలో మొత్తం 8318 ఖాతాలను మాఫీ కోసం ప్రతిపాదనలు పంపగా 3159 ఖాతాలు మాత్రమే జాబితాలో ఉన్నాయి. కపిలేశ్వరపురం ఆం ధ్రాబ్యాంకు నుంచి 1600 మంది రైతులతో జాబితా వెళితే 471 మంది, టేకి ఆంధ్రాబ్యాంకులో 2038 మందికి 523 మంది, అంగర ఎస్‌బీఐలో 1557 మం దికి 540 మంది, వల్లూరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో 1800 మందికి 490 మందిపైనే దయతలచిన సర్కార్ మిగిలిన వారి నోట్లో మన్నుకొట్టింది.
 
 ఆరునెలల నిరీక్షణకు ఫలితం నిరాశే
 జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆరు నెలలుగా మాఫీ కోసం ఎదురు చూసిన రైతుల ఆశలు ఆడియాసలైపోయాయి. రుణమాఫీ వివరాలను జిల్లాలోని 293 సహకార సంఘాల్లో అధికారులు డౌన్‌లోడ్ చేసుకునే పనిలో పడ్డారు. దాదాపు ప్రతి సొసైటీలో 40 నుంచి 60 మంది అర్హుల పేర్లు గల్లంతయ్యాయి. అమలాపురం రూరల్ వన్నెచింతలపూడి సొసైటీలో 401మందితో జాబితా పంపిస్తే 51 మంది పేర్లు జాబితా నుంచి మాయమయ్యాయి.  జిల్లాలోని కొన్ని సహకార సంఘాల్లో రూ.50 వేల లోపు రుణాలను కూడా వాయిదాల పద్ధతిలో రద్దుకు ఉద్దేశించినట్టు ఉండటంతో సొసైటీ ఉద్యోగులే ఆశ్చర్యపోతున్నారు. ద్రాక్షారామ సొసైటీలో 70 మంది రూ.50 వేల లోపు రుణాలు తీసుకున్న రైతులున్నారు. చంద్రబాబు మాట ప్రకారం వీరి రుణాలు ఏక మొత్తంగా రద్దు కావాలి. కానీ వారందరి పేర్లు వాయిదాల పద్ధతిలో రద్దు అయ్యే జాబితాలో కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి జిల్లాలోని పలు సొసైటీల్లో ఉంది.
 
 ఎంత మోసం!
 రుణమాఫీ అంటే చంద్రబాబుకు ఓట్లేసి గెలిపించాం. నాకు లక్కవరం ఎస్‌బీఐలో రూ.43 వేల రుణం ఉంది. రూ.50 వేలు ఒకేసారి మాఫీ అవుతుందనుకున్నా. తీరా జాబితా చూస్తే మాఫీ అవుతున్నది రూ.8వేలు మాత్రమే. చంద్రబాబు ఎంత మోసం చేశారు!  
 -దొంగ నాగ సత్యవతి, కేశనపల్లి,
 మలికిపురం మండలం
 (టీడీపీ తరపున సర్పంచ్‌గా
 
 పోటీ చేసిన  నిరు పేద మహిళ)
 జాబితాలో పేరు లేదు..
 పడమర ఖండ్రిక సహకార సంఘంలో రూ.36 వేల రుణాన్ని తీసుకోగా వడ్డీతో రూ.37,291 అయింది. రూ.50 వేల లోపు రుణాలన్నీ మాఫీ అనడంతో రుణం పోతుందని ఆశించాను. కానీ ఒక రూపాయి కూడా మాఫీ కాలేదు.  
 -అరవపల్లి బుల్లియ్య,
 పడమర ఖండ్రిక, కపిలేశ్వరపురం మండలం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement