మాఫీ మాయ! | Chandrababu Naidu Cheating On Farmers Loan Waiver | Sakshi
Sakshi News home page

మాఫీ మాయ!

Published Sun, Nov 2 2014 3:51 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

మాఫీ మాయ! - Sakshi

మాఫీ మాయ!

  కవిటి:అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రైతులు రుణాలు కట్టవద్దనీ, ప్రతి పైసా మాఫీ చేస్తాననీ, ఎన్ని రకాల రుణాలైనా, రుణమెంతైనా మాఫీ చేసి తీరుతామని ప్రగల్భాలు పలికారు. ఈ హామీలను నమ్మిన జనం ఓట్లు వేసి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే ఆ తరువాతే బాబుగారి అసలు రూపం బయటపడింది. ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు. రైతులను పట్టించుకోవడం మానేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేశారు. రకరకాల కొర్రీలతో రుణమాఫీని పక్కదారి పట్టించడంతో వేలాది మంది కొబ్బరి రైతులు ఆందోళన చెందుతున్నారు. కొబ్బరి వాణిజ్య పంటని చెప్పడంతోపాటు..పలు కొర్రీలు వేస్తూ రైతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. ఒక వైపు వాణిజ్య బ్యాంకులకు సహకార బ్యాంకుల సిబ్బందికి  పైఅధికారులు ఇటీవల సంక్షిప్త సందేశాలు(ఎస్‌ఎంఎస్) ల రూపంలో కొబ్బరి రైతులకు సంబంధించిన రుణ వివరాలను రుణమాఫీకి నివేదించవద్దని రహస్యంగా ఆదేశాలు జారీ చేశారు.
 
 ఇవేవీ తెలియని రైతులు ఆధార్, రేషన్, పట్టాదార్ పాసుపుస్తకాలు, బ్యాంకు ఖాతాల వివరాలకు సంబంధించి జిరాక్స్ కాపీలన్నీ రుణం పొందిన బ్యాంకులకు అందించి మాపీ ప్రకటన కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. సాధారణంగా బ్యాంకులు ఖరీఫ్, రబీ సీజన్‌లలో పంట రుణాలు రైతులకు అందిస్తాయి. ఎకరా ప్రామాణికంగా తీసుకుని పంట, బంగారంపై రుణాలందిస్తాయి.  ఇప్పటివరకు రుణమాఫీ చేసిన అన్ని ప్రభుత్వాలు కొబ్బరి పంటకు కూడా రుణమాఫీని వర్తింపజేశాయి తప్పితే షరతులతో వెలివేసిన దాఖలాలు లేవు. అంతేకాకుండా బ్యాంకుల్లో అందించిన రుణాలపై మెట్టుపల్లం అని నమోదైన నేపథ్యంలో సాంకేతికంగా కొబ్బరిరైతులు కూడా రుణమాఫీ పరిధిలోనికే వస్తారు. అయితే వాస్తవానికి టీడీపీ ప్రభుత్వం చేస్తున్న వింత వాదన విచిత్రంగా ఉంది. రుణమాఫీపై సంతకం చేసినప్పుడు, కోటయ్య కమిటీ నివేదికల్లో కానీ, ఉద్యానపంటలైన మిర్చి, పసుపు, కొబ్బరి పంటలకు రుణమాఫీ వర్తించదని ప్రకటించలేదు.
 
 బ్యాంకర్ల నుంచి రుణాల నివేదికలు అందిన తర్వాతే రోజుకో షరతుతో కొబ్బరి రైతు పుట్టె మునిగేలా ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. వాస్తవానికి సాంకేతికంగా విశ్లేషిస్తే మిగిలిన ఉద్యాన పంటలతో పోల్చుకుంటే కొబ్బరిసాగు విభిన్నమైన, వైవిధ్య భరితమైనది. మిర్చి, పసుపు ఏకవార్షిక పంటలు. ఏడాదిలోనే ఫలసాయం వస్తోంది. కొబ్బరి విషయంలో మాత్రం పూర్తిగా భిన్నం. దేశవాళీ రకానికి చెందిన కొబ్బరి మొక్కను నాటితే అనేక బాలారిష్టాలు దాటి కనీసం 8 ఏళ్లకు తెగుళ్లబారిన పడకుండా ఉండి అనుకూల వాతావరణ పరిస్థితులుంటే కాపుకు వస్తుంది. కాపుకొచ్చిన మూడు నాలుగేళ్లు సాధారణస్థాయిలోనే దిగుబడులను అందిస్తుంది. ఇంతలో ప్రకృతివైపరీత్యాలు సంభవిస్తే ఫలసాయం అందకుండా రైతులను నట్టేట ముంచుతుంది. ఇలాంటి పరిస్థితిలో కొబ్బరి రైతుకు రుణ మాఫీ వర్తించకుండా ప్రభుత్వం కొర్రీలు వేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది వచ్చిన పై-లీన్, ఇటీవల వచ్చిన హుదూద్ తుపాను కారణంగా జిల్లాలో వేలాది కొబ్బరి చెట్టు నేలకొరిగారుు. రైతులు నష్టపోయూరు.
 
 ఈ పరిస్థితిలో కొబ్బరి రైతులకే రుణ మాఫీ వర్తింప చేయూలనే డిమాండ్ ఆ వర్గం నుంచి బలంగా వస్తుంది. కనీసం పంటల బీమా కూడా కొబ్బరికి వర్తించని పరిస్థితిలో రైతులను ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉంది. జిల్లాలో సుమారు  35 వేల ఎకరాల్లో కొబ్బరి సాగులో ఉంది. ఇందులో కవిటి, కంచిలి, సోంపేట,ఇచ్ఛాపురం మండలాల్లోనే మూడొంతులు సాగవుతోంది. రణస్థలం, ఎచ్చెర్ల, పలాస, వ జ్రపుకొత్తూరు మండలాల్లో కూడా విస్తారంగా సాగులో ఉంది. కాగా జిల్లాలో కొబ్బరి రైతులకు రుణమాఫీ వర్తింపచేస్తే దాని భారం ప్రభుత్వంపై వంద కోట్ల రూపాయలకంటే తక్కువగానే ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. గత ఏడాది సంభవించిన వచ్చిన పై-లీన్ తుపాను సమయంలో ఉద్దానం ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు నాయుడు రుణమాఫీయే ఈ ప్రాంత రైతుల కష్టాలు తీర్చగలదని చెప్పుకొచ్చారు. అరుుతే ఇప్పుడు లేనిపోని సాకులు చెబుతూ, కొర్రీలు పెడుతూ రుణమాఫీ వర్తింప చేయకుండా కాలయూపన చేయడంపై కొబ్బరి రైతు మండిపడుతున్నారు. ఈ ప్రాంత టీడీపీ నేతలు రాజకీయూలు మాని రైతుల కోసం ఉద్యమించాలని వేడుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement