ప్రత్యేక హోదాను పట్టించుకోని టీడీపీ
నరసరావుపేట వెస్ట్: రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించాలనే చిత్తశుద్ది తెలుగుదేశం ప్రభుత్వానికి ఏమాత్రంలేదని కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ కొండపల్లి వెంకటేశ్వర్లు విమర్శించారు. మాజీమంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి గృహంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేకహోదా కోసం తాము చేసిన ఢిల్లీ పర్యటనలో సానుకూలత లభించిందన్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, యువనాయకుడు రాహూల్‌గాంధీ, సీపీఎం, సీపీఐ అగ్రనేతలు సీతారాం ఏచూరి, సురవరం సుధాకరరెడ్డి, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌లకు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ వినతిపత్రాలు సమర్పించామన్నారు. ఒక్క ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమకు ఇంటర్వ్యూ ఇవ్వలేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యేకహోదా ఇవ్వాలనే ఉద్దేశ ం కన్పించటంలేదని, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయట్లేదన్నారు.
రాష్ట్రం నుంచి వెళ్లిన తమ బృందానికి రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఢిల్లీలో ముఖ్యులను కలిసేందుకు సహాయ సహకారాలు అందజేశారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభించేంతవరకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై పోరాటం చేస్తుందని చెప్పారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు పెనుగొండ వెంకటేశ్వరరావు, రొంపిచర్ల మండల అధ్యక్షుడు పడాల చక్రారెడ్డి, పట్టణ అధికార ప్రతినిధి దుర్గాబాబు, పీసీసీ సంయుక్త కార్యదర్శి వి.లకా్ష్మరెడ్డి, కపలవాయి రమేష్‌చంద్రదత్, ఏటీఎం బాషా పాల్గొన్నారు.