చెప్పులతో కొట్టుకున్నారు..
బాలాయపల్లి: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం తెలుగు తమ్ముళ్లు చెప్పులతో కొట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని జార్లపాడు గ్రామానికి చెందిన రవి, పిగిలాం గ్రామానికి చెందిన ఎం. ప్రసాద్ ఉపాధిహామీ పథకం పనులకు సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లును దుర్భాషలాడారు. దీంతో అక్కడే ఉన్న కామకూరుకు చెందిన నాగయ్య అలా అనడం సరికాదని అడ్డుతగిలారు.
అంతే ప్రసాద్, రవి నాగయ్యను పట్టుకుని చొక్కా చింపేశారు. దీంతో ఒక్కసారిగా నాగయ్య తన చెప్పు తీసుకుని వారి విచక్షణా రహితంగా బూతులు తిడుతూ.. దాడికి పాల్ప డ్డాడు. వీరి గొడవతో పక్కనే ఉన్న స్త్రీ శక్తి భవనంలోని మహిళలు భయపడి రోడ్డుపైకి పరుగులు తీశారు. పక్కనే ఉన్న సీనియర్ టీడీపీ నాయకుడు కూను రామయ్య వారిని అడ్డుకుని సర్ది చెప్పడంతో వివాదం అక్కడితో ముగిసింది.
తాగి అధికారులను తిట్టడం వారికి మామూలే!
తరచూ తెలుగు తమ్ముళ్లు తాగి.. తాము చెప్పింది చేయాలనే ఉద్దేశంతో అధికారులను తిట్టడం పరిపాటిగా మారిందని పలువురు అంటున్నారు. తాము ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందనే ఉద్దేశంతో వారు రెచ్చిపోతున్నట్లు తెలిసింది.