పాలసముద్రంలో టీడీపీ నేతల కుమ్ములాట
పాలసముద్రం : పాలసముద్రం ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం టీడీపీకి చెందిన రెండు వర్గాలు దాడు లు, ప్రతిదాడులకు తలపడ్డారు. బూ తులు తిట్టుకున్నాయి. ఎంపీడీవోను ఇక్కడి నుంచి సాగనంపేయాలని ఎం పీపీ వర్గం, కాదు ఆయనే ఉండాలని జెడ్పీటీసీ సభ్యుని వర్గం పంతాలు,పట్టింపులకు పోవడమే ఈ సంఘటనకు కారణమయింది. తొలుత ఎంపీడీవో కార్యాలయం వద్దకు ఎంపీపీ మీనా వర్గీయులు చేరుకున్నారు. కార్యాలయ గదికి తాళం వేశారు. ఐదున్నరేళ్లుగా ఈవోఆర్డీ ఇన్‌చార్జి ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్నారని, మీ సేవలు ఇక్కడ అవసరం లేదని బదిలీ చేసుకుని వెళ్లిపోవాలని ఎంపీడీవో లక్ష్మీపతినాయుడుకు సూచించారు.
దీంతో ఎంపీడీవో విషయాన్ని జెడ్పీటీసీ సభ్యుడు బి.చిట్టిబాబుకు తెలియజేశారు. ఆయన అనుచరులను వెంట బెట్టుకుని అక్కడికి వచ్చారు. ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మనడానికి ఎంపీపీ ఎవరని, ఎంపీడీవోను కార్యాలయ గది వద్దకు తీసుకెళ్లారు. తాళం తీయాలని అటెండర్‌కు సూచించారు. గది తెరవడానికి ప్రయత్నించారు. గది తెరవడానికి వీలులేదని కో-ఆప్షన్ సభ్యుడు శాంబశివన్ అడ్డుకున్నారు. దీంతో జెడ్పీటీసీ ఆగ్రహించి శాంబశివన్‌పై చేయిచేసుకున్నాడు. అతడు బిగ్గరగా అరుస్తూ ప్రతిఘటించడంతో జెడ్పీటీసీ సభ్యుని వర్గీయులు చితకబాదారు. కార్యాలయం బయట ఉన్న ఎంపీపీ వ ర్గీయులు జెడ్పీటీసీ సభ్యుని వర్గీయు లు దాడులు ప్రతిదాడులు చేసుకున్నా రు.
బూతులు తిట్టుకున్నారు. ఎంపీ పీ గదికి ఉన్న బోర్డును తొలగించి కిందపడేశారు. ఎంపీడీవో గది బోర్డు ను మరో వర్గీయులు తొలగించేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ గంగాధరం సిబ్బందితో వచ్చి రెండు వర్గాలకు నచ్చజెప్పి బయటకు పంపేశారు. రెండు వర్గాలు ఎస్‌ఐ వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేసుకున్నారు. ఎస్‌ఐ గంగాధరం రెండు వర్గాలపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.