వైఎస్సార్ సీపీలో చేరిన టీడీపీ నేతలు
అనకాపల్లి : వైఎస్సార్ సీపీ మరింత బలోపేతం అవుతోందని పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్ అన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న పోరాటాలకు విశేష స్పందన లభించడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. అనకాపల్లి పట్టణంలోని పూడిమడక రోడ్డులో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో వేటజంగాలపాలేనికి చెందిన టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీలోకి సోమవారం చేరారు. వారందరికీ అమర్‌నాథ్ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అమర్‌నాథ్ మాట్లాడుతూ అనకాపల్లి నియోజకవర్గంలో పార్టీకి ఆదరణ పెరుగుతోందన్నారు. వేటజంగాలపాలెం టీడీపీ మాజీ అధ్యక్షులు నడిశెట్టి సత్తిబాబు, సిగిరెడ్డి వెంకటేశ్వరరావు, బండి చినగోవింద, నడిశెట్టి కొండలరావు, గోనా పెదగోవింద, బేమిని శ్రీనివాసరావు, బండి శ్రీనివాసరావు, బండి అర్జున, మల్లెల వెంకటరమణ, నడిశెట్టి జగదీశ్, బొండా నాయుడు పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గొర్లె సూరిబాబు, మండల ప్రధాన కార్యదర్శి భీశెట్టి జగన్‌తో పాటు వేటజంగాలపాలేనికి చెందిన బొడ్డు యాకూబ్, మడక అప్పారావు, ఈశ్వరరావు, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
బూత్‌స్థాయిలో పార్టీ బలోపేతం
వైఎస్సార్ సీపీని బూత్ స్థాయిలో బలోపేతం చేయాలని అమర్‌నాథ్ పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మండలంలోని వేటజంగాలపాలెం, రాజుపాలెం, మార్టూరు, భట్లపూడి, గొలగాం గ్రామాలకు చెందిన పార్టీ నాయకులతో అమర్‌నాథ్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సంస్థాగతంగా బలోపేతం అయ్యేందుకు బూత్ కమిటీలలో చురుగ్గా పనిచేసేవారు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల పార్టీ నాయకులు గొల్లివిల్లి ఆంజనేయులు, నాయుడు, కరణం నాగేశ్వరరావు, గొంతెన సత్యారావు, నొట్ల శ్రీనివాసు, నారిపిన్ని చంద్రశేఖర్, జాగారపు శ్రీను, పార్టీ కార్యాలయ ఇన్‌చార్జ్ ఏడువాకల నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.