వైఎస్ఆర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఫేక్ ఫోన్ కాల్స్!
Published Tue, May 6 2014 6:32 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM
విశాఖపట్నం: సీమాంధ్రలో పోలింగ్ సమీపిస్తున్న కొద్ది తెలుగుదేశం పార్టీ నేతల ఆగడాలు మితీమిరిపోతున్నాయి. ఓటమి భయంతో విశాఖలో టీడీపీ నేతలు అడ్డదారుల తొక్కుతున్నారు.
ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖపట్నం లోకసభ పరిధిలోని ఓటర్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఓటేయొద్దంటూ ఫేక్ కాల్స్ చేస్తున్నారు.
గతంలో టీడీపీకి ఓటువేయాలంటూ పోన్ ద్వారా ప్రచారం చేసుకున్నారు. మళ్లీ అదే నంబర్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
Advertisement
Advertisement