► గ్రామదేవతల పండుగల కోసం వృద్ధుల పింఛన్లలో కోత
► రేషన్ కార్డుకు రూ.500 చొప్పున వసూలు
శ్రీకాకుళం: టెక్కలి మండలం కోటబొమ్మాళిలో ఈ నెల 29 నుంచి జరగబోయే గ్రామదేవత పండగల కోసం వృద్ధులకు ఇచ్చే పింఛన్లలో తెలుగు తమ్ముళ్లు రూ.500 వసూలు చేయడం దారుణమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాశరావు అన్నారు.
ఆయన జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మంత్రి అచ్చెన్నాయుడు మెప్పు కోసం తెలుగు తమ్ముళ్లు ఈ వసూళ్లు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. కోటబొమ్మాళికి సంబంధించి కీలక వ్యక్తితోపాటు మండలంలో మరో ఇద్దరు వ్యక్తులతో కలసి ఈ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు. రేషన్‌కార్డు దారుల నుంచి కూడా రూ.500 వసూలు చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై మంత్రి అచ్చెన్న వెంటనే దృష్టి సారించాలని కోరారు. కలెక్టర్ కూడా పరిశీలన చేసి ఈ వసూళ్లు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతలు శిమ్మ వెంకట్రావు, గుడ్ల మల్లేశ్వరరావు, ఎం.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు తమ్ముళ్ల పండగ మామూలు..!
Published Wed, May 25 2016 11:50 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement