టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల వీరంగం
ధర్మవరం: అనంతపురం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి అనుచరులు వీరంగం సృష్టించారు. జిల్లాలోని ముదిగుబ్బ మండలం పట్నం గ్రామంలో సోమవారం స్థానిక రైతు కోటిరెడ్డిపై దాడికి దిగారు. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న విలువైన స్థలాన్నిఇవ్వాలని కొంతకాలంగా కోటిరెడ్డిపై ఎమ్మెల్యే ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.
అయితే కోటిరెడ్డి ససేమిరా అనడంతో ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే వర్గీయులు దౌర్జన్యాన్ని అడ్డుకోబోయిన ఓ పోలీస్ కానిస్టేబుల్ పై కూడా వారు చేయిచేసుకున్నారు. ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్న సెల్ ఫోన్‌ను టీడీపీ కార్యకర్తలు లాక్కెళ్లారు. ఎమ్మెల్యే సూరి, ఆయన అనుచరులపై బాధితులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.