టీడీపీ కార్యకర్తకు మహిళల దేహశుద్ది | TDP worker women | Sakshi
Sakshi News home page

టీడీపీ కార్యకర్తకు మహిళల దేహశుద్ది

Published Wed, Dec 3 2014 3:58 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

TDP worker women

 నల్లచెరువు : నల్లచెరువు మండల పరిధిలోని ఉప్పార్లపల్లిలో మంగళవారం ప్రభుత్వ పాఠశాల ఎదురుగా టీడీపీ కార్యకర్త బాహవుద్ధీన్‌కి గ్రామ మహిళలు చెప్పులతో కొట్టి దేహశుద్ధి చేశారు. గ్రామంలోని పాఠశాలలో దాదాపు ఎనిమిదేళ్ల నుంచి మద్యాహ్న భోజన ఏజెన్సీని భూదేవి, అమీనమ్మలు నిర్వహిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినందున మధ్యాహ్న భోజన ఏజెన్సీని తమకు అప్పగించాలని 15 రోజులుగా ఏజెన్సీ నిర్వాహకులపై బాహుద్ధీన్ గొడవకు దిగుతున్నాడు.
 
 హెచ్‌ఎం నజీర్‌పై ఒత్తిడి తెచ్చాడు. భయపడిన హెచ్‌ఎం రెండు రోజులుగా పాఠశాలకు హాజరు కాలేదు. ఈ క్రమంలో మంగళవారం మద్యం సేవించి పాఠశాల వద్దకు వచ్చిన బాహవుద్ధీన్ ఏజెన్సీ నిర్వహకులతో గొడవకు దిగాడు. ఇపుడు తమ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి, తాను చెప్పినట్లు వినాలని హుకుం జారీ చేశాడు. తమ పార్టీకి చెందిన షరీఫా, మంగమ్మలకు ఏజెన్సీని అప్పగించాలన్నాడు. అంతలో విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని, ఇపుడున్న ఏజెన్సీ వారు వంట బాగానే చేస్తున్నారని సర్దిచెప్పారు. అరుునా అతను వినిపించుకోకుండా విద్యార్థుల తల్లులు ఖతీజా, అమరావతి, అషాబీలపై దాడికి దిగాడు. దీంతో మహిళలు ఆగ్రహంతో అతడిపై చెప్పులతో దాడి చేసి.. దేహశుద్ధి చేశారు. ఇంత రాద్ధాంతం సృష్టించిన బాహుద్ధీన్ తనపై దాడి జరిగిందని  నల్లచెరువు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం కొసమెరుపు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement