పశ్చిమగోదావరి జిల్లాలో హెలెన్ తుఫాను ఓ అధికారి ప్రాణాన్ని బలిగొంది. హెలెన్ ప్రభావంతో చెట్లు విరిగిపడ్డాయి. సహాయ కార్యక్రమాలను దగ్గరుండి స్వయంగా పర్యవేక్షించేందుకు పెనుమంట్ర తహసీల్దార్ దంగేటి సత్యనారాయణ తన కారులో అధికారులతో కలిసి బయల్దేరారు.
అయితే, తుఫాను గాలుల వల్ల విరిగిన చెట్లు రోడ్డుకు అడ్డంగా పడిపోయి ఉన్నాయి. వెనుక నుంచి లారీ వస్తుండటం, దగ్గరలో మలుపు ఉండటంతో కారు ఓ చెట్టును ఢీకొంది. దీంతో తహసీల్దార్ సత్యనారాయణ అక్కడికక్కడే మరణించారు. పేరుపాలెం వద్ద కూడా ఓ చెట్టు పడిపోయి మరో వ్యక్తి మరణించినట్లు తెలిసింది. పేరుపాలెం వద్ద సముద్రం పది అడుగుల మేర ముందుకొచ్చింది. ఈదురుగాలులు వీస్తున్నాయి. 80-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వృక్షాలు నేలకూలుతున్నాయి. కరెంటు స్తంభాలు పడిపోతున్నాయి. పదివేలమందిని ఇక్కడినుంచి తరలించారు. పెదమైనివానిలంక, చినమైనివాని లంక ప్రాంతాల్లో వంతెన కూలిపోయేలా ఉంది. ప్రజలను బలవంతంగా తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్లు కలెక్టర్ సిద్దార్థ జైన్ తెలిపారు.
తుఫాను ప్రభావం: పెనుమంట్ర ఎమ్మార్వో మృతి
Published Fri, Nov 22 2013 2:09 PM | Last Updated on Mon, Apr 8 2019 6:46 PM
Advertisement