తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలి | Telangana bill has pass in parliament | Sakshi
Sakshi News home page

తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలి

Published Wed, Aug 14 2013 5:50 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM

Telangana bill has pass in parliament

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం బిల్లును వెంటనే పార్లమెంట్‌లో పెట్టి ఆమోదించాలని పొలి టికల్ జేఏసీ చైర్మన్ జి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం భోజన విరామ సమయంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.  ఈ సదర్భంగా ఆయన  మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చిరకాల వాంఛైన ప్రత్యేక రాష్ట్రం బిల్లు ఆమోదానికి సీమాంధ్ర ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.
 
 పస్తుతం జరుగుతున్న సమావేశాలలోనే బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టకుండా అక్కడి ప్రజా ప్రతినిధులు సంయమనం పాటించాలన్నారు. ఎంతో మంది అమర వీరుల త్యాగాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వచ్చిందన్నారు. కేంద్రం జాప్యం చే యకుండా బిల్లు ప్రవేశపెట్టాని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోవాలన్నారు. అన్ని పార్టీలు తెలంగాణకు ఒప్పుకొని ఇప్పుడు సీమాంధ్రలో ఆందోళనలు చేయడంలో అర్ధం లేదన్నారు. అక్కడి ప్రజలను మభ్యపెట్టడానికే డ్రా మాలు ఆడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో టీఎన్‌జీఓస్ జిల్లా అధ్యక్షుడు పందిరి వెంకటేశ్వరమూర్తి, జి.మోహన్‌రావు, ఏడుదొడ్ల వెంకట్‌రాంరెడ్డి,  జిల్లా కోశాధికారి సురభి వెంకటేశ్వర్లు, రమేష్, రమణ,  అంజయ్య, అశోక్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement