
బిల్లు తిప్పి పంపడమే సమస్యకు పరిష్కారం
విభజన బిల్లు ఇరు ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యంగా లేదని రాష్ట్ర మంత్రి టి.జి.వెంకటేష్ అన్నారు.
విభజన బిల్లు ఇరు ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యంగా లేదని రాష్ట్ర మంత్రి టి.జి.వెంకటేష్ అన్నారు. ఆదివారం ఆయన కర్నూలులో మాట్లాడుతూ... అసంపూర్తిగా, అసమగ్రంగా కేంద్రం ఆ బిల్లును రూపొందించిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో విభజన బిల్లును వెనక్కి పంపడమే ప్రస్తుత సమస్య పరిష్కారానికి ఏకైక మార్గమని ఆయన తెలిపారు. విభజన బిల్లులో అసమగ్రంగా ఉందని, బిల్లును రాష్ట్రపతికి పంపడం మినహా చర్చించేందుకు ఏమీ లేదని సీఎం కిరణ్ శనివారం స్పీకర్కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.