t g venkatesh
-
తెలంగాణ నిధులు కోరడం సరికాదు: టీజీ వెంకటేశ్
ఏపీకి కేంద్రం నిధులిస్తే తెలంగాణకూ ఇవ్వాలని టీఆర్ఎస్ నేతలు కోరడం సరికాదని టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ వ్యాఖ్యానించారు. తెలంగాణకు కావాల్సినవి కేంద్రం నుంచి తెచ్చుకునేందుకు తాము సహకరిస్తామని పేర్కొన్నారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సరిగా లెక్కలు చూపనందుకే కేంద్రం ఏపీకి నిధులివ్వడం లేదనడం అవాస్తవమన్నారు. విభజన సమస్యలు రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న తరుణంలో రాష్ట్రాభివృద్ధికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కలిసిరావాలని కోరారు. -
రాజధానిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలి
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతాన్ని ఫ్రీజోన్‌గా ప్రకటించాలని ఉత్తరాంధ్ర, రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీజీ వెంకటేశ్ డిమాండ్ చేశారు. అలా చేయపోతే సీమవాసులకు, ఉత్తరాంధ్ర వాసులకు భవిష్యత్‌లో అన్యాయం జరుగుతుందని అన్నారు. విశాఖపట్టణం ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీజీ వెంకటేశ్ తో పాటు.. మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఉన్నారు. -
'కర్నూలును రాజధానిగా ప్రకటించాల్సిందే'
రాష్ట్ర విభజన అయిపోయిన నేపథ్యంలో కర్నూలు నగరాన్ని అంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర మంత్రి టి. జి. వెంకటేష్ శనివారం కర్నూలులో కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలును రాజధానిగా చేయడం వల్లే తమ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని అన్నారు. లేకుంటే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని చేపట్టవలసి ఉంటుందని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరించారు. కేవలం ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్రాన్ని ముక్కలు చేశారని ఆరోపించారు. అజెండాలో రాష్ట్ర విభజన అంశాన్ని చేర్చి ఆమోదం చేస్తే తాము గౌరవంగా తప్పుకునే వారమని ఆయన తెలిపారు. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం డ్యాం నుంచి నీటిని తీసుకుని తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. తమ ప్రాంతం మాత్రం ఏడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమలో వజ్రాలు, బంగారు గనులు అపారంగా ఉన్నాయని వెంకటేష్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. -
బిల్లు తిప్పి పంపడమే సమస్యకు పరిష్కారం
విభజన బిల్లు ఇరు ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యంగా లేదని రాష్ట్ర మంత్రి టి.జి.వెంకటేష్ అన్నారు. ఆదివారం ఆయన కర్నూలులో మాట్లాడుతూ... అసంపూర్తిగా, అసమగ్రంగా కేంద్రం ఆ బిల్లును రూపొందించిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో విభజన బిల్లును వెనక్కి పంపడమే ప్రస్తుత సమస్య పరిష్కారానికి ఏకైక మార్గమని ఆయన తెలిపారు. విభజన బిల్లులో అసమగ్రంగా ఉందని, బిల్లును రాష్ట్రపతికి పంపడం మినహా చర్చించేందుకు ఏమీ లేదని సీఎం కిరణ్ శనివారం స్పీకర్‌కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
నువ్వా....నేనా? ....రచ్చ
జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. ఎడముఖం.. పెడముఖంగా ఉన్న కేంద్ర రైల్యే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర చిన్ననీటి పారుదలశాఖ మంత్రి టీజీ వెంకటేష్ మధ్య తాజాగా మాటల యుద్ధం మొదలైంది. వీరిద్దరి మధ్య రచ్చ ముదిరి పాకాన పడింది. నువ్వా.. నేనా? అనే రీతిలో ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతలిద్దరి మధ్య పేలుతున్న మాటల తూటాలతో శ్రేణుల్లో కలకలం రేగుతోంది. రాజకీయంగా పైచేయి సాధించేందుకే వీరిద్దరు రచ్చకెక్కారనే చర్చ జరుగుతోంది. శనివారం ఎమ్మిగనూరులో నీలకంఠేశ్వరస్వామి రథోత్సవం సందర్భంగా మంత్రి కోట్ల టీజీనుద్దేశించి మాట్లాడుతూ ‘కాంగ్రెస్‌లో ఉంటూ మంత్రి పదవులు అనుభవిస్తూ పార్టీని కించపరిచేలా మాట్లాడుతున్న వారు బయటకు వెళ్లిపోవాలని’ విమర్శించారు. ఆ తర్వాత 24 గంటలు గడవక మునుపే మంత్రి టీజీ సైతం అదే రీతిలో మంత్రి కోట్లపై ఘాటైన విమర్శలు చేశారు. ఆదివారం కర్నూలులో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన కార్యక్రమానికి కోట్లకు ఆహ్వానం అందకపోగా.. రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డిలు పాల్గొనడం సరికొత్త వివాదానికి దారితీస్తోంది. పార్టీలు మారడం ఆయనకే చెల్లు పార్టీలు మారడం మంత్రి టీజీకి కొత్తేమీ కాదని.. ఇప్పటికే ఆయన అన్ని పార్టీలు చుట్టేసి వచ్చారని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మిగనూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీజీది కాంగ్రెస్ సంస్కృతి కాదన్నారు. ఎలాగూ పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోందని.. ఎంత త్వరగా బయటకు వెళితే అంత మంచిదన్నారు. కాంగ్రెస్ వల్లే ఆయనకు మంత్రి పదవి వచ్చిందని.. రాజకీయాల్లోనూ ఎదుగుదల సాధ్యమైందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అభివృద్ధి పనులు చేపట్టే ప్రాంతానికి వెళ్లి శంకుస్థాపనలు చేయాలే కానీ.. జిల్లా కేంద్రంలో ఉండి వ్యవహారం నడిపితే ఎలాగని ప్రశ్నించారు. ఆ పనులన్నింటికీ తాను ఆయా ప్రాంతాలకు వెళ్లి తిరిగి శంకుస్థాపన చేస్తానన్నారు. తాను వాస్తవాలు మాట్లాడుతుండగా.. టీజీ చౌకబారు విమర్శలు చేయడం తగదన్నారు. 2004లో ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తానే తగుటబెట్టినట్లు ఆరోపించడం సత్యదూరమన్నారు. కార్యకర్తలు ఆవేశంతో చేసిన పొరపాటును తనకు అంటగట్టడం సరికాదన్నారు. తాను ఎన్నటికీ పార్టీ మారనని.. చచ్చేదాకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. మంత్రి టీజీ ఫ్యాక్టరీ ద్వారా వెలువడే కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యానికి లోనవుతున్న విషయమై విలేకరులు ప్రశ్నించగా.. అది కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు చూసుకుంటారని దాటవేశారు. విభజన వల్ల ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవచ్చునని, 2019లో తిరిగి అధికారంలోకి రావడం తథ్యమన్నారు. కార్యాలయాన్నే తగులబెట్టించావు ఎంపీ టిక్కెట్ రాలేదనే అక్కసుతో సొంత పార్టీ కార్యాలయాన్నే తగులబెట్టించిన సంస్కృతి నీదని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డిపై రాష్ట్ర చిన్ననీటి పారుదలశాఖ మంత్రి టి.జి.వెంకటేష్ మండిపడ్డారు. ఆదివారం కర్నూలులో మొదటి విడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శనివారం కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి చేసిన విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు. కోట్ల అభద్రతా భావానికి లోనవుతున్నారన్నారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయనకు ఓట్లు పడవని.. గెలవడం కష్టమవుతుందని భావించి ఎవరుపడితే వారిపై విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన జరిగితే పార్టీ వీడతానన్న మాటకు తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తనకు ప్రజల మనోభావాలే ముఖ్యం తప్ప పార్టీ కాదని తేల్చి చెప్పారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కార్యక్రమాలు ఆ శాఖ మంత్రిగా తన చేతుల మీదుగా జరగడం సహజమని, అది ఆయనకు సంబంధించిన విషయం కాదని ఒక ప్రశ్నకు సమాదానంగా బదులిచ్చారు. ఒకవేళ ఆయనను(కోట్ల) పిలిచినా పెద్దగా స్పందించడన్నారు. కార్యక్రమానికి పిలవలేదని అధికారులను ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టారని, ఈ మేరకు పలువురు అధికారులతో తనకు చెప్పుకుని బాధపడ్డారన్నారు. అధికారుల వద్ద పెద్ద తరహాగా ఉండాలే తప్ప గౌరవం పోగొట్టుకునేలా వ్యవహరించడం తగదని హితవు పలికారు. -
టీజీవీ పరిశ్రమల కాలుష్యాన్ని అరికట్టాలి
తుంగభద్రనది పరిసర ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలి అఖిలపక్ష పార్టీల నేతల డిమాండ్ కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: తుంగభద్ర నది సమీపంలో రాష్ట్ర మంత్రి టి.జి.వెంకటేశ్‌కు సంబంధించిన శ్రీరాయలసీమ ఆల్కాలీస్ అండ్ అల్లైడ్ కెమికల్స్, శ్రీరాయలసీమ హైపో హైస్ట్రెంత్ (టీజీవీ గ్రూప్) పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యాన్ని అరికట్టాలని ప్రభుత్వాన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. గురువారం కర్నూలు నగరం బీఏఎస్ కల్యాణ మండపంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కె.ప్రభార్‌రెడ్డి అధ్యక్షతన అఖిల పక్ష రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. టీజీవీ గ్రూప్ పరిశ్రమల కాలుష్యంతోతుంగభద్ర నది జలాలన్నీ కలుషితం అవుతున్నాయన్నారు. తాండ్రపాడు, పంచలింగాల, గొందిపర్ల గ్రామాల పొలాలన్నీ కలుషితమై బీడుభూములుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.ఎ.గఫూర్ మాట్లాడుతూ.. తుంగభద్రనది కలుషితం కావడంతో పాతనగరంలోని ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. ఈ పరిస్థితి గతంలో ఎన్నడూలేదని, దీనికి కారణాలు విశ్లేషించి బాధ్యులైన వారిపై కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారులు, టీజీవీ గ్రూప్ పరిశ్రమల యాజమాన్యం తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయడం సరైంది కాదన్నారు. సమస్యకు పరిష్కారం వెతికి ప్రజలకు ఆరోగ్య రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారుల బాధ్యతా రాహిత్యాన్ని సీపీఐ, లోక్‌సత్తా, బీఎస్పీ, సమాజ్‌వాది తదితర పార్టీల నాయకులు ఎండగట్టారు. సీపీఐ జిల్లా నాయకులు ఎ.శేఖర్, లోక్‌సత్తా జిల్లా నాయకులు డేవిడ్, సమాజ్‌వాది పార్టీ జిల్లా అధ్యక్షుడు దండు శేషుయాదవ్, బీఎస్పీ కర్నూలు నియోజకవర్గ నాయకులు మౌలాలి, రాజేశ్, సీపీఎం నగర కార్యదర్శి గౌస్‌దేశాయ్, జిల్లా కమిటీ సభ్యులు ఇ.పుల్లారెడ్డి, సత్యనారాయణగుప్త పాల్గొన్నారు. -
20లోగా పరిహారం
సాక్షి, గుంటూరు :జిల్లాలోని తుపాను బాధిత రైతాంగానికి డిసెంబరు 20వ తేదీలోగా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్చార్జి మంత్రి టీజీ వెంకటేశ్ హామీ ఇచ్చారు. 2012-13 సంవత్సరం నుంచి రైతులకు చెల్లించాల్సిన రూ. 28.22 కోట్లతో పాటు అక్టోబరులో కురిసిన భారీ వర్షాల సాయాన్ని కూడా కేంద్రం నుంచి రప్పించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలూ చేస్తామని పేర్కొన్నారు. శనివారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశపు హాల్లో కలెక్టర్ సురేశ్‌కుమార్ అధ్యక్షతన జిల్లా సమీక్షా మండలి(డీఆర్సీ) సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి టీజీ వెంకటేశ్ బాధిత రైతాంగానికి ఈ మేరకు హామీ ఇచ్చారు. సమావేశం ప్రారంభం కాగానే ముందుగా ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు జిల్లాలోని 23500 మంది కౌలు రైతులకు రుణాలివ్వాల్సిన బ్యాంకులు కేవలం 9,869 మందికి మాత్రమే రుణాలిచ్చి చేతులు దులుపుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీలం తుపాను సాయాన్ని పలు బ్యాంకులు అవుట్ స్టాండింగ్ సర్దుబాటు చేసుకుంటున్నాయని ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆరోపించారు. డీసీఎంఎస్ చైర్మన్ ఇక్కుర్తి సాంబశివరావు మాట్లాడుతూ, కౌలు రుణ చట్టాన్ని అమలు చేయించడం చేతగాకపోతే ఎలాగంటూ అధికారుల్ని నిలదీశారు. సహకార శాఖ మంత్రి కాసు కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఎస్బీఐ, ఎస్‌బీహెచ్‌ల తీరు ఆక్షేపణీయంగానే ఉందనీ, విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకుని కౌలు రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకర్లలో అనాసక్తి ఉందన్నారు. వచ్చే రబీ సీజనులో ఎల్ఈసీ కార్డులున్న కౌలు రైతులందరికీ రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు సంతృప్తి చెందని ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి సమావేశంలో ఉన్న లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డిని వెంట తీసుకుని హాలు నుంచి బయటకు వెళ్లారు. వెంటనే ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకుల ఏజీఎంలను సమావేశానికి హాజరుకమ్మని ఆదేశించారు. ఎన్యూమరేషన్ సరిగ్గా లేదు అక్టోబరులో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను గుర్తించి రైతుల జాబితాలను తయారు చేయడంలో అధికార యంత్రాంగం సక్రమంగా పనిచేయలేదని టీడీపీ ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, కొమ్మాలపాటి శ్రీధర్, యరపతినేని శ్రీనివాసరావులు మంత్రి టీజీకి ఫిర్యాదు చేశారు. గురజాల నియోజకవర్గంలో మిరప పంటకు విపరీతంగా నష్టం జరిగినా ఎన్యూమరేషన్ సరిగ్గా జరగలేదన్నారు. బలుసుపాడు గ్రామంలో సిబ్బంది ఓ ఇంట్లో కూర్చుని గణాంకాలు తయారు చేశారని పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చే ముష్టి కోసం రైతులు ఎన్నాళ్లు ఎదురు చూడాలనన్నారు. వెంటనే మైకందుకున్న మంగళగిరి ఎమ్మెల్యే కాండ్రు కమల మాట్లాడుతూ రైతులకిచ్చే సాయాన్ని ముష్టి అనడం సబబు కాదన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని అరటి రైతులకు లైలా తుపాను సాయాన్ని అందించే విషయంలో ఉద్యాన శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. సబ్సిడీ మంజూరు చేయించండి... జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోని రైతులకు సబ్సిడీ కింద పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ.21 కోట్లను వెంటనే విడుదల చేయించాలని జీడీసీసీ బ్యాంకు చైర్మన్ ముమ్మనేని వెంకట సుబ్బయ్య కోరారు. మంగళగిరి ఏరియాలో నిర్మించాలనుకున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని వెంటనే మంజూరు చేయాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఎమ్మెల్యే కాండ్రు కమల కోరారు. వీజీటీఎం ఉడా పరిధిలో అనధికార లే అవుట్లు ఎక్కువయ్యాయనీ అరికట్టకపోతే కష్టమని ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పల్నాడులో రియల్టర్లు వ్యవసాయ భూముల్ని వ్యాపారానికి అనుగుణంగా మార్చి భూ బదలాయింపు పన్నును ఎగ్గొడుతున్నారని ఎంపీ మోదుగుల ఆరోపించారు. పిడుగురాళ్ల యార్డు ఎదుట అనధికార నిర్మాణం జరుగుతుందని గురజాల ఎమ్మెల్యే యరపతినేని ఫిర్యాదు చేశారు. పంచాయతీల్లో వీధిలైట్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మంత్రి దృష్టికి తెచ్చారు. అన్యాక్రాంతమవుతోన్న జెడ్పీ స్థలం .. సత్తెనపల్లిలోని రూ.50 కోట్ల విలువైన జిల్లాపరిషత్ స్థలం కబ్జాకు గురవుతోందని ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి సమావేశంలో మంత్రి టీజీ వెంకటేశ్, కలెక్టర్ సురేశ్కుమార్లకు ఫిర్యాదు చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఏకధాటిన జరిగిన సమావేశంలో జేసీ వివేక్‌యాదవ్, ఎమ్మెల్యేలు గాదే వెంకటరెడ్డి, జీవీఎస్ఆర్ ఆంజనేయులు, మస్తాన్‌వలి, ఎమ్మెల్సీలు నన్నపనేని రాజకుమారి, బొడ్డు నాగేశ్వరరావు, సింగం బసవపున్నయ్య వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. సీఎం వస్తే అడ్డుకుంటాం సాక్షి, గుంటూరు : ‘జలయజ్ఞం’ కింద రాష్ట్రంలో మొట్టమొదట చేపట్టిన ప్రాజెక్టు పులిచింతల. తొమ్మిదేళ్లుగా పనులు జరుగుతూనే ఉన్నాయి. పను లన్నీ పూర్తయి ప్రారంభానికి వస్తే ఎవరినైనా సాదరంగా ఆహ్వానిస్తాం. కాదని డిసెంబర్ 5న జరిగే ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరైతే కచ్చితంగా అడ్డుకుంటా’మని నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్, యరపతినేని శ్రీనివాస్‌లు స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులన్నీ పూర్తయ్యాయని రైతాంగాన్ని మభ్యపెట్టి హడావుడిగా ప్రారంభించేసి చేతులు దులుపుకునేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు. పాజెక్టు నుంచి గుంటూరు జిల్లా వైపు అప్రోచ్ రోడ్డు నిర్మించకపోవడం జిల్లా ప్రజలపై ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పేర్కొన్నారు. ప్రాజెక్టు వద్ద ఇంకా 30 శాతం పనులన్నీ అలాగే ఉన్నాయని ఎంపీ మోదుగుల వివరించారు. వీటన్నింటినీ పూర్తి చే యకుండా ముఖ్యమంత్రి అధికార యంత్రాంగంతో హడావుడిగా ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వస్తే కచ్చితంగా అడ్డుకుంటామన్నారు. కనీసం ప్రాజెక్టును చూసేందుకు వెళ్లే జిల్లా వాసులకు అనుకూలంగా అప్రోచ్ రోడ్డు నిర్మించకపోవడం ఘోరమని సత్తెనపల్లి శాసనసభ్యుడు యర్రం వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్ సురేశ్‌కుమార్ సమాధానమిస్తూ ప్రాజెక్టు పనులైతే ఇంకా పూర్తి కాలేదన్నారు. మేజర్ పనులన్నీ పూర్తయిన నేపథ్యంలో 20 టీఎంసీల నీరు నిల్వచేసే అవకాశాలున్నాయని చెప్పేందుకు ప్రజాప్రతినిధులు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయమంటున్నారన్నారు. ముంపు గ్రామాల ప్రజలందరినీ 20 రోజుల్లోగా పునరావాస కాలనీలకు తరలిస్తామన్నారు. మంత్రి టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ, టీడీపీ ఎమ్మెల్యేలు, సభ్యుల ఆవేదన ను అర్థం చేసుకున్నానన్నారు. ఈ విషయంలో సభ్యులతో తాను ఏకీభవిస్తున్నానన్నారు. వారం రోజుల్లోగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి వివరిస్తానన్నారు. కాగా పులిచింతల విషయంపై టీడీపీ ఎమ్మెల్యేలు దాదాపు 20 నిమిషాల పాటు సమావేశంలో హడావుడి చేశారు. ఒక దశలో ఎంపీ మోదుగల వేణుగోపాలరెడ్డి అధికారపార్టీ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. -
చచ్చుబండ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రచ్చబండ కేవలం ప్రచారం కోసమేనని తేలిపోయింది. ఇదే సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతమైన తరుణంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ప్రజాగ్రహానికి కారణమవుతోంది. కర్నూలు, మహానందిలో సోమవారం ప్రారంభమైన 3వ విడత రచ్చబండ తీరుతెన్నులే ఇందుకు నిదర్శనం. కర్నూలులో మున్సిపల్ పాఠశాలలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి రాష్ట్ర చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనేక మంది సమస్యలపై వినతులు ఇవ్వాలని వచ్చినప్పటికీ ఏ ఒక్కరి నుంచి అర్జీలు తీసుకోలేదు. సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన రచ్చబండలో జనానికి మాట్లాడే అవకాశం ఇవ్వాల్సి ఉంది. అయితే ఏ ఒక్కరినీ మాట్లాడించిన దాఖలాలు లేవు. గతంలో నివర్వహించిన రచ్చబండలో వచ్చిన ఫిర్యాదుదారుల్లో ఓ ముగ్గురిని పిలిచి రేషన్ కార్డు, కూపన్లు, బంగారుతల్లి పథకం, ఇళ్ల స్థలాలకు సంబంధించిన పత్రాలను పంపిణీ చేశారు. అయితే వాటిలో రవి అనే వ్యక్తి ఇచ్చిన రేషన్‌కార్డులో పేరు తప్ప అతని ఫొటో లేదు, వారి కుటుంబసభ్యుల పేర్లు లేనే లేవు. వచ్చిన వారంతా అధికారుల కనుసన్నల్లో మెలిగే వారే కనిపించారు. రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వస్తే పట్టించుకున్న పాపాన పోలేదు. ఇదిలా ఉంటే రచ్చబండలో సమస్యలపై ప్రజలు నిలదీస్తారనే ఉద్దేశంతో ముందస్తు చర్యగా పోలీసులను భారీగా మొహరించారు. అందులో భాగంగానే కొంతమంది సీపీఎం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్‌కు తరలించటం గమనార్హం. మహానందిలో జరిగిన రచ్చబండ కార్యక్రమాని న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి హాజరయ్యారు. రచ్చబండలో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అనేక మంది గిరిజనులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఏ ఒక్కరికీ పరిష్కారం దొరకలేదు. ఇదే విషయాన్ని పార్వతీపురం కాలనీకి చెందిన గిరిజన మహిళలు వెంకటమ్మ, చందు, సుబ్బమ్మ మంత్రి ఏరాను నిలదీశారు. అదేవిధంగా బుక్కాపురం గ్రామానికి చెందిన వికలాంగుడు అందెరాముడు, శ్రీనివాసులు తదితరులు ఫించన్లు ఇస్తారోమోనని వచ్చారు. అయితే వారికీ నిరాశే మిగిలింది. చేస్తాం.. చూస్తాం.. అంటూ అధికారులను కలవమని చెప్పి ఎవరి దారిన వారు వెళ్లిపోవడం గమనార్హం. -
అసెంబ్లీలో తీర్మానం వరకు కొనసాగుతాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపడంపై సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో గురువారం రాత్రి భేటీ అయిన అనంతరం మంత్రులు శైలజానాధ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు, కాసు కృష్ణారెడ్డి, టీజీ వెంకటేశ్ మీడియాతో మాట్లాడారు. భారతప్రజాస్వామ్యంలో ఇదో చీకటి రోజని శైలజానాధ్ వ్యాఖ్యానించారు. కేంద్ర నిర్ణయం ఏకపక్షమని, రాజ్యాగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. దీన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, అసెంబ్లీలో తీర్మానం ఆమోదించకుండా ఓడించి కేంద్రానికి పంపిస్తామని తెలిపారు. మంత్రి పదవులకు రాజీనామాల విషయం ప్రస్తావించగా.. ‘‘సమైక్య రాష్ట్ర ప్రభుత్వమే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి కనుక అంతవరకు మా ప్రభుత్వం ఉంటుంది. అప్పటివరకు మేము కొనసాగి ఆ తీర్మానాన్ని ఓడిస్తాం’’ అని శైలజానాధ్ వివరించారు. ‘‘మంత్రి పదవులతో ఏం ఒరగబెడతాం. శ్మశానాల్లో ఏం ఏరుకుంటాం..’ అని వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన నిలబడతామని, ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీలు పిలుపునిచ్చిన బంద్‌లో కాంగ్రెస్ నేతలు భాగస్వాములవుతారని చెప్పారు. 2004లో, 2009లో అత్యధిక ఎంపీలను ఇచ్చినందుకు మా గొంతు కోశారని, కాంగ్రెస్‌కు పుట్టగతులుండవని మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంత్రి టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ.. విభజనలో తమపార్టీ అధినేతలతో పాటు ప్రతిపక్ష అధినేత కూడా భాగస్వాములుగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌కు ఏరాసు, గంటా, కాసు గుడ్‌బై ఇక రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగదని పలువురు సీమాంధ్ర మంత్రులు భావిస్తున్నారు. ఇంకా ప్రభుత్వంలో, పార్టీలో కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకమవుతుందనే అభిప్రాయానికి వచ్చారు. వీరిలో మంత్రి పదవులకు రాజీనామా చేసి పార్టీలోనే కొనసాగాలని కొందరు మంత్రులు భావిస్తుంటే... పదవులతోపాటు పార్టీ పదవులకు కూడా గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, గంటా శ్రీనివాసరావు, కాసు వెంకట కృష్ణారెడ్డి మంత్రి పదవులకు చేసిన రాజీనామాలను ఆమోదించుకోవాలని, ఆ మేరకు శుక్రవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలవాలని నిర్ణయించారు. గురువారం రాత్రి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసిన ఆయా మంత్రులు ఈ విషయాన్ని చెప్పినట్లు తెలిసింది. అయితే సీఎం మాత్రం తొందరపాటు వద్దని బుజ్జగించారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించిన తరువాత అందరం కలిసి అసెంబ్లీ సాక్షిగానే పదవులకు గుడ్‌బై చెప్పే అంశంపై నిర్ణయం తీసుకుందామని సూచించారు. అప్పటి వరకు ప్రభుత్వంలో కొనసాగితే తమకు రాజకీయ మనుగడ ఉండదని, మంత్రి పదవులతోపాటు పార్టీకి కూడా రాజీనామా చేయకతప్పదని స్పష్టం చేసినట్లు తెలిసింది. మరోవైపు సీఎంను కలిసిన వారిలో ఆయా మంత్రులతోపాటు శైలజానాథ్, టీజీ వెంకటేశ్ కూడా ఉన్నప్పటికీ వారు మాత్రం ఇప్పటికిప్పుడు రాజీనామా చేయకూడదనే భావనలో ఉన్నట్టు తెలిసింది. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, కొండ్రు మురళీమోహన్, పి.బాలరాజు తదితరులు మాత్రం పార్టీని వీడకూడదనే నిర్ణయానికి వచ్చారు. విభజన వల్ల సీమాంధ్ర ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాలు అన్వేషించాలే తప్ప హైకమాండ్ నిర్ణయాన్ని దిక్కరించకూడదని భావిస్తున్నారు. -
టీజీ నివాసంలో సీమాంధ్ర మంత్రులు భేటీ
రాష్ట్ర మంత్రి టీ.జీ.వెంకటేష్ నివాసంలో ఆదివారం ఉదయం సీమాంధ్రకు చెందిన మంత్రులు సమావేశమైయ్యారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోల సంఘం శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు వచ్చిన అపూర్వ స్పందనపై వారు ఈ సందర్భంగా చర్చించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చేపట్టవలసిన విధి విధానలపై వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. అందులోభాగంగా భవిష్యత్తు కార్యచరణపై చేపట్టవలసిన అంశాలపై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు చర్చించారు. సీమాంధ్ర మంత్రులు కాసు వెంకట కృష్ణారెడ్డి, వట్టి వసంత కుమార్, అనం రామనారాయణ రెడ్డి,ఏరాసు ప్రతాప రెడ్డి తదితరులు పాల్లొన్నారు. -
కోట్ల సూర్య, టీజీలు శనిగ్రహాలు
పత్తికొండ/పత్తికొండ అర్బన్, న్యూస్‌లైన్: జిల్లా నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర మంత్రిగా పని చేస్తున్న టీజీ వెంకటేష్‌లు శనిగ్రహాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అదనపు పరిశీలకులు, కడప మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరాహార దీక్షకు మద్దతుగా పార్టీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణిరెడ్డి చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష గురువారం ముగిసింది. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి ఆయనకు టెంకాయ నీళ్లు ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం మాట్లాడుతూ కోట్ల, టీజీలు రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. తన భర్త కోట్లతో రాజీనామా చేయిస్తానని డోన్‌లో శపథం చేసిన సుజాతమ్మ ఇంతవరకు ఆ పని చేయించలేకపోయారన్నారు. ఈ విషయంలో సమైక్య ఉద్యమకారులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇక కర్నూలులో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా టీజీ వెంకటేష్ ముఖం చాటేయడంలో అర్థం లేదన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపిస్తే.. కీలకమైన సమయంలో ఆయన వారికి అండగా నిలవకపోవడం సమంజసం కాదన్నారు. తెలంగాణను విడదీసి టీఆర్ఎస్ను విలీనం చేసుకుంటే పది సీట్లయినా వస్తాయనే కాంగ్రెస్ అధిష్టానం విభజనకు తెరలేపిందన్నారు. కుమారుడు రాహుల్‌ను ప్రధానిని చేయాలనే స్వార్థంతోనే సీమాంధ్ర ప్రజల మనోభావాలను లెక్క చేయక సోనియా గాంధీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారన్నారు. తమ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభంజనాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్, టీడీపీలు రోజుకో కుట్ర పన్నుతున్నాయన్నారు. కాంగ్రెస్ నాయకులకు కల్లబొల్లి మాటలతో కాలయాపన చేయడం అలవాటైపోయిందన్నారు. ప్రజల్లో ఆదరణ కోల్పోయిన చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర పేరిట కొత్త డ్రామా మొదలు పెట్టారని.. యాత్ర ప్రారంభమైతే ప్రజలే ఆయనకు తగిన బుద్ధి చెబుతారన్నారు. నాయకులు ఎలా ఉండాలో జగన్‌ను చూసి నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. కోట్ల హరిచక్రపాణిరెడ్డి మాట్లాడుతూ పదవుల కోసం పాకులాడే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కుటుంబంలో పుట్టినందుకు తాను సిగ్గుపడుతున్నానన్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించని ఆయన చరిత్రహీనుడుగా మిగిలిపోతాడన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ గడిచిన నాలుగేళ్లలో ఎన్నిసార్లు పత్తికొండకు వచ్చారో లెక్కేసుకుంటే ప్రజల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతుందన్నారు. ఎప్పుడూ లేనిది ఇప్పుడు తగుదునమ్మా అని వచ్చి సమైక్యాంద్ర ఉద్యమ కారులను హిజ్రాలతో పోల్చడంపై ఆయన నిప్పులు చెరిగారు. సంస్కారం మరచి మాట్లాడితే ప్రజలు హర్షించరన్నారు. రాష్ట్రం ముక్కలైతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో కనీస జ్ఞానం లేని నాయకులు ప్రజాప్రతినిధులుగా చెలామణి అవుతున్నారని ఘాటుగా విమర్శించారు. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు ప్రతి ఇంటి నుంచి ఒకరు కొదమసింహాలై కదలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, మంత్రాలయం, ఆదోని, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్తలు బాల నాగిరెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, మంత్రాలయం మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మణిగాంధీ, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, నాయకులు ఎస్.రామచంద్రారెడ్డి, పోచిమిరెడ్డి మురళీధర్‌రెడ్డి, డాక్టర్ గిడ్డయ్య, పల్లె ప్రతాప్‌రెడ్డి, ప్రహ్లాదరెడ్డి, శ్రీరంగడు, దామోదర్ఆచారి, పత్తికొండ సర్పంచ్ బనావత్ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. -
క్షమాపణ చెప్పాల్సిందే
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: ఉద్యోగులు చేపట్టిన సమైక్యాంధ్ర ఉద్యమం నెల, రెండు నెలలకంటే ఎక్కువ రోజులు జరగదని.. ఉద్యోగులను, ఉద్యమాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఉపాధ్యాయ జేఏసీ కన్వీనర్ తిమ్మన్న డిమాండ్ చేశారు. శనివారం స్థానిక అంబేద్కర్ భవన్లో సమైక్యాంధ్ర ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ సమావేశం సమైక్యాంధ్ర జేఏసీ చైర్మన్ కాకరవాడ చిన్న వెంకటస్వామి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా తిమ్మన్న మాట్లాడుతు సీమాంధ్ర పౌరుషం మంత్రికి తెలియనిది కాదని, అయినప్పటికీ ఈ విధంగా మాట్లాడడం దారుణమన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలతో పాటు బిచ్చగాళ్లు, హిజ్రాలు కూడా పాల్గొంటుంటే మంత్రి నీరుగార్చడం తగదన్నారు. మంత్రి టీజీ వైఖరికి నిరసనగా ఈ నెల 19న ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. రాష్ట్రం విడిపోతే భావి తరాలకు తీరని నష్టం తప్పదని.. విద్యార్థి సంఘాలు నిద్ర వీడి ఉద్యమాల్లో అగ్రభాగాన నిలవాలని కోరారు. వైఎసార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాల్లో విద్యార్థులే ప్రధాన పాత్ర పోషించారని, ఇక్కడా తమ సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. న్యాయవాది మురళి మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం ఇంతటి తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నా కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ముఖం చాటేయడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. సమావేశంలో జేఏసీ నేతలు యాగంటీశ్వరయ్య, మియ్య, శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం వెల్లడించినవి రోడ్‌మ్యాప్ అంశాలే: టీజీ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర విభజన విషయంలో అధిష్టానానికి అందజేసిన రోడ్‌మ్యాప్‌లోని విషయాలనే సీఎం కిరణ్ రెండు రోజుల క్రితం విలేకరుల సమావేశంలో వెల్లడించారని మంత్రి టి.జి.వెంకటేశ్ పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి రాజనరసింహ, పీసీసీ చీఫ్ బొత్సలతో పాటు సీఎం కూడా అధిష్టానానికి రాష్ట్ర విభజనకు సంబంధించి రోడ్ మ్యాప్ అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం కిరణ్ ఇచ్చిన నివేదికపై లీకుల రూపంలో విభిన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన అధిష్టానానికి ఏం చెప్పారో బహిర్గతం చేశారన్నారు. విభజిస్తే తలెత్తే పరిణామాలను అధిష్టానం ముందు సీఎం చెప్పినా.. ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన లేఖలను పరిగణనలోకి తీసుకొని కాంగ్రెస్ కోర్ కమిటీ, సీడబ్ల్యూసీ, యూపీఏ సమన్వయ కమిటీ విభజనకు మొగ్గు చూపాయన్నారు. సీఎం భావ ప్రకటనాస్వేచ్ఛను ఆయన వినియోగించుకున్నారే తప్ప సోనియాను ధిక్కరించ లేదన్నారు. దొరల రాజ్యానికి బాటలు కేసీఆర్‌పై శైలజానాథ్ ధ్వజం అనంతపురం, న్యూస్‌లైన్: కేసీఆర్ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి దొరల రాజ్యానికి బాటలు వేస్తున్నారని, రాష్ట్ర విభజన జరిగితే దళిత, గిరిజన, బలహీన వర్గాలకు రక్షణ ఉండదని సమైక్యాంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫోరం కన్వీనర్ సాకే శైలజానాథ్ అన్నారు. సీఎంగా అన్ని ప్రాంతాల ప్రయోజనాలను కాపాడేందుకే కిరణ్‌కుమార్‌రెడ్డి సమస్యలను ప్రస్తావించారే తప్ప తెలంగాణ వారిపైద్వేషమేమీలేదన్నారు. శనివారం ఆయన అనంతపురంలో మాట్లాడుతూ.. సీఎం ఏం చెప్పారో తెలుసుకోకుండా తెలంగాణ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని సీఎం అగౌరవపరిచారని, ఒక ప్రాంత సీఎంగానే మాట్లాడుతున్నారని తెలంగాణ నేతలు వ్యాఖ్యానించడం దారుణమన్నారు. సీఎంపై నోరు పారేసుకుంటున్న డీఎస్ గతంలో పీసీసీ చీఫ్‌గా ఉన్న విషయాన్ని మర్చిపోకూడదని హితవు పలికారు. టీడీపీ అధినేత చంద్రబాబు నీచ రాజకీయాలు చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తూ ఉంటుందన్నారు.