తెలంగాణ ఉద్యోగులపై వివక్ష | 'Telangana employees being discriminated' | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఉద్యోగులపై వివక్ష

Published Fri, Nov 8 2013 1:51 AM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM

తెలంగాణ ఉద్యోగులపై వివక్ష - Sakshi

తెలంగాణ ఉద్యోగులపై వివక్ష

 విద్యుత్‌సౌధలో టీ ఉద్యోగుల నిరసన

విద్యుత్‌శాఖలో తెలంగాణ ఉద్యోగులపై వివక్ష చూపుతున్నారని తెలంగాణ విద్యుత్ ఇంజనీర్స్ అధ్యక్షుడు శివాజీ ఆరోపించారు. విద్యుత్‌శాఖలో అక్రమ పదోన్నతులను నిరసిస్తూ గురువారం విద్యుత్‌సౌధలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు. దీనికి తెలంగాణలోని పది జిల్లాల నుంచి భారీ ఎత్తున ఉద్యోగులు తరలివచ్చారు. ఈ సందర్బంగా శివాజీ మాట్లాడుతూ... విద్యుత్‌శాఖలో రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు కావడం లేదని అన్నారు.

గిర్‌గ్లానీ కమిషన్, శ్రీకృష్ణ కమిటీ కూడా పదోన్నతులు, నియామకాల్లో తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని తెలిపిందని ఆయన గుర్తుచేశారు. అక్రమ ధ్రువపత్రాలతో తెలంగాణలో ఉద్యోగాలు పొందిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  జెన్‌కోలో డెరైక్టర్ పోస్టులలో సర్వీసులో ఉన్న తెలంగాణ వారినే నియమించాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ  విద్యుత్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మోహన్‌రెడ్డి, మురళీకృష్ణ, ఎస్.స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement