గుండాల, న్యూస్‌లైన్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మబలిదానం చేసుకున్న అమరులను మరిచిపోతే మన లక్ష్యాన్ని మరిచిపోయినట్లేనని, తెలంగాణ ఏర్పాటు ఏ ఒక్కరిదీ కాదని.. ఇది ప్రజల విజయమని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. గుండాలలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి, జయశంకర్ విగ్రహాలను ఆదివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో కోదండరాం మాట్లాడుతూ..
వేణుగోపాల్ రెడ్డి, యాదన్న, యాదిరెడ్డి, శ్రీకాంతాచారి తదితరుల ఆత్మహత్యలన్నీ నిరసన రూపాలని అన్నారు. వారి త్యాగాలు ఉద్యమానికి ఊపిరిపోశాయని అన్నారు. 1969 నాటి సంఘటనలకు.. ఇప్పటి ఘటనలకు చాలా తేడా ఉందన్నారు. ఉద్యమంలో భాగంగా జరిగిన సకల జనుల సమ్మె కూడా చారిత్రాత్మకమైనదని, ఇలాంటి ఉద్యమాలు ప్రపంచంలో ఎక్కడా జరగలేదని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణానికి జయశంకర్, ఇతర అమరవీరుల సాక్షిగా కృషి చేస్తామని ప్రకటించారు. చదువుకున్న వారు మౌనంగా ఉంటే టైజం కంటే ప్రమాదమని అన్నారు.
ప్రజలను చైతన్యం చేసేలా, తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకె ళ్లేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమానికి టీఆర్‌ఎస్ ఊపిరి పోస్తే, బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని కదలించిందని అన్నారు. ఖమ్మంలో కేసీఆర్ దీక్ష చేపడితే.. ఆ దీక్షను న్యూడెమోక్రసీ ముందుకు నడిపిందని చెప్పారు. జేఏసీలో లేకపోయినప్పటికీ సీపిఐ నిర్వహించిన పోరాటం కూడా మరువలేనిదని అన్నారు. చివరి సమయంలో ప్రజలు సంఘటితంగా ఉండడ ంల వల్లనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని, పంపకాల్లోనూ అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా చూడాల్సిన భాద్యత ఉందని అన్నారు.
పోలవరం నిర్మాణంతో ఆదివాసీల మనుగడకు ముప్పు ఏర్పడిందని, ఈ విషయాన్ని పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. గోదావరి జలాలలపై ఆంధ్రా ప్రాంతానికి హక్కు ఉన్నప్పటికీ.. తెలంగాణ ప్రాంతాన్ని ముంపు పేరుతో తరలించుక పోవడం సరైంది కాదన్నారు. గ్రామాల తర లిపుంపును నిలిపివేసేందుకు ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. స్థానిక నాయకులు యాసారపు తిరుపతి, సాయన్న, డి.శ్రీను, నాగరాజు అద్యక్షతన జరిగిన ఈ సభలో ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, రేగా కాంతారావు, ఊకె అబ్బయ్య, జిల్లా ఉద్యోగ జేఏసీ చైర్మన్ కూరపాటి రంగరాజు, పంచాయతీరాజ్ మినిస్టీరియల్ సంఘం నాయకులు ఎన్.వెంకటపతిరాజు, న్యూడెమెక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, నాయకులు ముక్తార్‌పాషా, ముక్తి సత్యం పాల్గొన్నారు.
ఇది ప్రజా విజయం
Published Mon, Mar 3 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 AM
Advertisement
Advertisement