కాకినాడ లీగల్: రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా న్యాయశాఖలో పని చేస్తున్న పలువురు న్యాయమూర్తులను తెలంగాణ నుంచి ఆంధ్రకు, ఇక్కడి నుంచి అక్కడకు బదిలీ చేస్తూ రిజిస్ట్రార్ జనరల్ (ఎఫ్‌ఏసీ) ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరు జనవరి ఏడో తేదీలోగా విధుల్లో చేరాలని పేర్కొన్నారు.
తెలంగాణ నుంచి ఇక్కడికి..
సంగారెడ్డి జిల్లా మెదక్ ప్రిన్సిపల్ జిల్లా జడ్జి బి.సాయికల్యాణ్ చక్రవర్తిని రాజమహేంద్రవరం ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా నియమించారు. కర్నూలు జిల్లా ఆదోని రెండో అదనపు జిల్లా జడ్జి ఎన్. శ్రీనివాసరావును పిఠాపురం 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టుకు బదిలీ చేశారు. హైదరాబాద్ ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో పని చేస్తున్న ఎం.మాధురిని కాకినాడ మూడో అదనపు సీని యర్ సివిల్ జడ్జిగా నియమించారు. వరంగల్ మూడో అదనపు జూనియర్ సివిల్ జడ్జి గీతారా ణిని రాజమహేంద్రవరం ఏడో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నియమించారు. మెదక్ జిల్లా సంగారెడ్డి అదనపు జూనియర్ సివిల్ జడ్జి సీహెచ్ సునందమ్మను పెద్దాపురం అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నియమించారు. నల్గొండ జిల్లా నకిరేకల్ జూనియర్ సివిల్ జడ్జి వి.లక్ష్మీసత్యప్రసన్నను అమలాపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బదిలీ చేశారు.
ఇక్కడి నుంచి తెలంగాణకు..
రాజమహేంద్రవరం ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఎన్.తుకారామ్‌జీని హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా బదిలీ చేశారు. కాకినాడ ఆరో జిల్లా జడ్జి ఎం.శ్రీనివాసాచార్యను సికింద్రాబాద్ 27వ అదనపు చీఫ్ జడ్జి సిటీ కోర్టుకు బదిలీ చేశారు. కాకినాడ మూడో అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె.అరుణకుమారిని మహబూబ్‌నగర్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా నియమించారు. అమలాపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వి.భవానీని వరంగల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బదిలీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment