judges transfers
-
దేశవ్యాప్తంగా 16 మంది హైకోర్టు జడ్జిల బదిలీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 16 మంది హైకోర్టు జడ్జిలు బదిలీ అయ్యారు. గతంలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన పదహారు మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలను కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫై చేసింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి డీవీ చంద్రచూడ్‌తో సంప్రదింపులు జరిపిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ట్రాన్స్ఫర్ అయిన జడ్జిల్లో ఏపీ హైకోర్టుకు చెందిన ఇద్దరు జడ్జిలు, తెలంగాణకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఉన్నారు. బదిలీ అయిన న్యాయమూర్తుల వారి జాబితా 1. జస్టిస్ ఎస్పీ కేసర్వాణి( అలహాబాద్ హైకోర్టు నుంచి కలకత్తా హైకోర్టుకు బదిలీ) 2. జస్టిస్ రాజ్ మోహన్ సింగ్( పంజాబ్-హర్యాణా హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ) 3. జస్టిస్ నరేందర్ జీ( కర్ణాటక హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ) 4. జస్టిస్ సుధీర్ సింగ్(పాట్నా హైకోర్టు నుంచి పంజాబ్, హర్యానా కోర్టుకు బదిలీ 5. జస్టిస్ ఎంవీ మురళిధరన్( మణిపూర్ హైకోర్టు నుంచి కలకత్తా హైకోర్టుకు బదిలీ) 6. జస్టిస్ మధురేష్ ప్రసాద్ (పాట్నా హైకోర్టు నుంచి కలకత్తా హైకోర్టుకు బదిలీ) ఎపి హైకోర్టులో ఇద్దరు జడ్జిలు బదిలీ 7. జస్టిస్ అరవింద్ సింగ్ సాంగ్వాన్ (పంజాబ్, హర్యానా హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ) 8. జస్టిస్ అవనీష్ జింగాన్ (పంజాబ్, హర్యానా హైకోర్టు నుంచి రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ) 9. జస్టిస్ అరుణ్ మోంగా (పంజాబ్, హర్యానా హైకోర్టు నుంచి రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ) 0. జస్టిస్ రాజేంద్ర కుమార్ (అలహాబాద్ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ) 11. జస్టిస్ నాని టాగియా [గువాహతి హైకోర్టు నుంచి పాట్నా హైకోర్టుకు బదిలీ) 12. జస్టిస్ సి మానవేంద్రనాథ్ రాయ్ [ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి హైకోర్టు గుజరాత్ హైకోర్టుకు బదిలీ) 13. జస్టిస్ మున్నూరి లక్ష్మణ్ [తెలంగాణ హైకోర్టు నుంచి రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ 14. జస్టిస్ జి అనుపమ చక్రవర్తి [తెలంగాణ హైకోర్టు నుంచి పాట్నా హైకోర్టుకు బదిలీ) 15. జస్టిస్ లపితా బెనర్జీ (అదనపు న్యాయమూర్తి) (కలకత్తా హైకోర్టు నుంచి పంజాబ్, హర్యానా హైకోర్టుకు బదిలీ) 16. జస్టిస్ దుప్పల వెంకట రమణ (అదనపు న్యాయమూర్తి) (ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ) ‘‘ఇక్కడ క్లిక్ చేసి సాక్షి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ -
హైకోర్టు జడ్జీల బదిలీపై టీడీపీ యాగీ
సాక్షి, అమరావతి: హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ దొనడి రమేశ్‌లను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన తీర్మానాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కొందరు న్యాయవాదులు శుక్రవారం హైకోర్టు విధులను బహిష్కరించారు. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఉదయం కోర్టు విధులు ప్రారంభం కాగానే టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కొందరు న్యాయవాదులు పలు కోర్టు హాళ్లలోకి వెళ్లి విధుల బహిష్కరణకు సహకరించాలని న్యాయమూర్తులను కోరారు. ఇదే సమయంలో నిరసనకారుల్లో కొందరు.. సహచర న్యాయవాదులను తీవ్ర స్వరంతో హెచ్చరిస్తున్న ధోరణిలో బహిష్కరణకు సహకరించాలని కోరారు. దీంతో నిరసనకారుల తీరు పట్ల కొందరు న్యాయమూర్తులు అసహనం వ్యక్తం చేశారు. అసలు హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రతినిధులు రాకుండా మీరెలా విధుల బహిష్కరణ చేపడుతారంటూ నిరసనకారులను ఆ న్యాయమూర్తులు ప్రశ్నించారు. కోర్టు హాళ్లలో అరవడం వంటివి చేయవద్దని, కోర్టు బయటకు వెళ్లి చూసుకోండని తేల్చి చెప్పారు. దీంతో కొంత వెనక్కి తగ్గిన నిరసనకారులు ఆయా కోర్టులకు వెళ్లి న్యాయవాదులను విధుల బహిష్కరణకు సహకరించాలంటూ అభ్యర్థించారు. దీంతో కొందరు న్యాయవాదులు కోర్టు హాళ్ల నుంచి బయటకు రాగా, మరికొందరు కోర్టు హాళ్లలోనే ఉండిపోయారు. న్యాయమూర్తులు సైతం కేసుల విచారణను ప్రారంభించారు. నిరసనకారులు తిరిగి కోర్టు హాళ్లకు వచ్చి పదే పదే విజ్ఞప్తి చేయడంతో న్యాయవాదులు బయటకు వచ్చారు. దీంతో న్యాయమూర్తులు కొద్దిసేపటి తరువాత బెంచ్ దిగి తమ తమ ఛాంబర్లకు వెళ్లిపోయారు. బెంచ్‌లు దిగేసినప్పటికీ న్యాయమూర్తులు సాయంకాలం వరకు హైకోర్టులోనే ఉన్నారు. హైకోర్టు పాలనా కార్యకలాపాలు యథాతథంగా సాగాయి. హైకోర్టు ప్రధాన ద్వారం నుంచి ర్యాలీ టీడీపీ లీగల్ సెల్‌కు చెందిన న్యాయవాదులు ఇతర పార్టీలకు చెందిన కొంత మంది న్యాయవాదులను పోగు చేసి, హైకోర్టు ప్రధాన ద్వారం వద్ద జస్టిస్ దేవానంద్, జస్టిస్ రమేశ్‌ల బదిలీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏకపక్ష బదిలీలను ఆపాలని నినదించారు. హైకోర్టు ప్రధాన ద్వారం నుంచి క్యాంటీన్ వరకు ర్యాలీ చేపట్టారు. తెలుగుదేశం పార్టీ మద్దతుతో రోజూ ఎల్లో మీడియా చర్చల్లో పాల్గొనే ఓ న్యాయవాది టీడీపీ న్యాయవాదుల ప్రోద్బలంతో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాక ఈ న్యాయమూర్తుల బదిలీలను రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రోద్బలంతోనే ప్రజా జడ్జీలుగా ముద్రపడిన ఈ ఇద్దరు న్యాయమూర్తుల బదిలీ జరుగుతోందని ఆ న్యాయవాది ఆరోపించారు. ఈ బదిలీల్లోకి కులాన్ని సైతం లాగారు. ర్యాలీ అనంతరం నిరసనకారుల్లో పలువురు తమ దారిన తాము వెళ్లిపోయారు. కొందరు మాత్రం హైకోర్టు న్యాయవాదుల సంఘంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. న్యాయమూర్తుల బదిలీకి వ్యతిరేకంగా హైకోర్టు న్యాయవాదుల సంఘం పేరు మీద కొన్ని తీర్మానాలు చేశారు. బదిలీ సిఫారసులను ఆపేసి ఇద్దరు న్యాయమూర్తులను యథాతథంగా ఏపీ హైకోర్టులో కొనసాగేలా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరుతూ తీర్మానం చేశారు. బదిలీలకు వ్యతిరేకంగా వివిధ రూపాల్లో నిరసనలు తెలియచేయాలని కూడా తీర్మానించారు. సోమవారం కూడా విధుల బహిష్కరణను కొనసాగించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇది న్యాయవ్యవస్థపై దాడి చేయడమే.. న్యాయమూర్తుల బదిలీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించడం దారుణం. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలీజియం స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. పరిపాలనా సౌలభ్యం కోసం న్యాయమూర్తులను బదిలీ చేస్తుందే తప్ప, అందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు. ఫిర్యాదుల ఆధారంగా బదిలీ చేయడం ఉండదు. అంతర్గతంగా ఇంటెలిజెన్స్ ఇచ్చే సమాచారం ఆధారంగా కొలీజియం నిర్ణయం తీసుకుంటుంది. సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయాన్ని తప్పుపట్టే హక్కు ఎవరికీ లేదు. న్యాయమూర్తుల బదిలీలను ప్రశ్నించడమంటే సుప్రీంకోర్టు కొలీజియాన్ని అవమాన పరచడమే. ప్రభుత్వం చెబితేనే సుప్రీంకోర్టు కొలీజియం న్యాయమూర్తులను బదిలీ చేసిందని చెప్పడం న్యాయవ్యవస్థపై దాడి చేయడమే అవుతుంది. – పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, అదనపు అడ్వొకేట్ జనరల్ ఆ తీర్మానంతో సంబంధం లేదు హైకోర్టు న్యాయవాదుల సంఘం పేరున తీర్మానం చేయడాన్ని హైకోర్టు న్యాయవాదుల సంఘం ఖండిస్తోంది. తీర్మానాలు చేసేందుకు ఆ న్యాయవాదులకు సంఘం ఎలాంటి ఆథరైజేషన్ ఇవ్వలేదు. న్యాయవాదులు ఎలాంటి సమ్మెకు పిలుపునివ్వడం గానీ, సమ్మెలో పాల్గొనరాదన్న సుప్రీం ఆదేశాలకు మా సంఘం కట్టుబడి ఉంది. హైకోర్టు విధుల బహిష్కరణకు మేం పిలుపునివ్వలేదు. న్యాయవాదులు కోర్టు విధులకు ఆటంకం కలిగించవద్దని వి జ్ఞప్తి చేస్తున్నాం. –జానకిరామిరెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ప్యాకేజీ శ్రవణ్.. ఒళ్లు దగ్గరపెట్టుకో.. సీఎం జగన్‌పై న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ చేసిన ఆరోపణలు సబబు కాదు. తక్షణం సీఎంకు క్షమాపణ చెప్పాలి. స్వతంత్ర న్యాయ వ్యవస్థకు కులాలను ఆపాదించడం దారుణం. శ్రవణ్‌కుమార్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. శ్రవణ్ ఓ 420. జడ్జి కాకున్నా ఆ పదవి తగిలించుకున్న ఇతనిపై చీటింగ్ కేసు నమోదు చేయాలి. ప్యాకేజీకి ఆశపడి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే సహించేది లేదు. – పెరికె వరప్రసాద్‌రావు, గవాస్కర్, బెజవాడ న్యాయవాదుల సంఘం చదవండి: AP: పోలీసు ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. పోస్టుల వివరాలు ఇవే.. -
హైకోర్టు జడ్జిల బదిలీలకు సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం
-
తెలుగు రాష్ట్రాల్లో ఐదుగురు హైకోర్టు జడ్డిలు బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లో కలిపి ఐదుగురు న్యాయమూర్తుల బదిలీలకు సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. దీంతో న్యాయమూర్తులు పలు రాష్ట్రాల హైకోర్టులకు బదిలీ అయ్యారు. ఏపీలో ఇద్దరు న్యాయమూర్తులు.. - భట్టు దేవానంద్.. మద్రాస్ హైకోర్టుకు బదిలీ. - డి. రమేష్.. అలహాబాద్ హైకోర్టుకు బదిలీ. తెలంగాణలో ముగ్గురు న్యాయమూర్తులు.. - జస్టిస్ లలిత కన్నెగంటి.. కర్నాటక హైకోర్టకు బదిలీ. - జస్టిస్ అభిషేక్ రెడ్డి.. పాట్నా హైకోర్టుకు బదిలీ. - జస్టిస్ నాగార్జున్.. మద్రాస్ హైకోర్టుకు బదిలీ. -
తెలంగాణలో భారీగా జిల్లా కోర్టు జడ్జిల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ జిల్లా కోర్టులు, సెషన్స్ కోర్టు జడ్జిలు బదిలీ అయ్యారు. మొత్తంగా 55 మందిని బదిలీ చేస్తూ నూతన పోస్టింగులు ఇస్తూ శుక్రవారం రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నూతన పోస్టుల్లో నియమితులైన వారు వెంటనే బాధ్యతలు స్వీకరించాలని హైకోర్టు ఆదేశించింది. పేరు పనిచేస్తున్న స్థానం బ దిలీ అయిన స్థానం 1.ఎస్.శశిధర్‌రెడ్డి - లేబర్ కోర్టు పీఓ జిల్లా సెషన్స్ జడ్జి–సంగారెడ్డి 2.ఇ.తిరుమలాదేవి - మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి - రాష్ట్ర జుడిషియల్ అకాడమీ డైరెక్టర్ 3.బీఆర్ మధుసుధన్‌రావు - ప్రిన్స్‌పల్ స్పెషల్ జడ్జి–సీబీఐ చైర్మన్–వ్యాట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ 4.జీవీ సుబ్రమణ్యం - రిజిస్ట్రార్–జుడిషియల్-1 హైకోర్టు ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్–1 చైర్మన్ 5.బి.పాపిరెడ్డి - జిల్లా సెషన్స్ జడ్జి–సంగారెడ్డి - మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి 6.సీహెచ్‌కే భూపతి - డైరెక్టర్–రాష్ట్ర జుడిషియల్ అకాడమీ - జిల్లా సెషన్స్ జడ్జి–రంగారెడ్డి 7.టి.శ్రీనివాసరావు - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–అదిలాబాద్ - జిల్లా సెషన్స్ జడ్జి–ఖమ్మం 8.జీవీఎన్ భరతలక్ష్మి - చైర్మన్–ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ - లేబర్ కోర్టు పీఓ 9.సీహెచ్ రమేశ్‌బాబు - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–కామారెడ్డి - ప్రిన్స్‌పల్ స్పెషల్ జడ్జి–సీబీఐ కేసులు 10.బి.సురేశ్ - అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–వరంగల్ 11.ఎం.నాగరాజు - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి నల్లగొండ - అధనపు జిల్లా సెషన్స్ జడ్జి–పెద్దపల్లి 12.బి.ప్రతిమ - అదనపు చీఫ్ జడ్జి–సిటీ సివిల్ కోర్టు - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–జగిత్యాల 13.టి.రఘురాం - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–మహబూబ్‌నగర్ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి(ఫాస్ట్‌ట్రాక్)–మేడ్చల్ 14.ఎన్.ప్రేమలత - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–రంగారెడ్డి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–సిరిసిల్ల 15.బి.గౌతం ప్రసాద్ -అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–నిజామాబాద్ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–రంగారెడ్డి 16.కే.శైలజ - చైర్పర్సన్, ఎల్‌ఆర్‌ఏటీ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–రంగారెడ్డి 17.పి.నారాయణబాబు - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఆసీఫాబాద్ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–బోధన్ 18.జి.నీలిమ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–సిద్దిపేట్ జిల్లా జడ్జి హోదాలో వాణిజ్య వివాదాల కోర్టు 19.జి.రాజగోపాల్ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–రంగారెడ్డి ప్రిన్స్‌పల్ స్పెషల్ జడ్జి–ఎస్పీఈ, ఏసీబీ కేసులు 20.కే.సుదర్శన్ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–రంగారెడ్డి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఆసీఫాబాద్ 21.ఎన్ఎన్ శ్రీదేవి - ప్రిన్స్‌పల్ ఫ్యామిలీ కోర్టు - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–కామారెడ్డి 22.హుజాయబ్ అమద్ ఖాన్ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–భువనగిరి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–వనపర్తి 23.ఏ.జయరాజు - అదనపు చీఫ్ జడ్జి–సిటీ సివిల్ కోర్టు -అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–నల్గొండ 24.కే.కుష - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–రంగారెడ్డి -అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–భువనగిరి 25.బోయ శ్రీనువాసులు- అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–వనపర్తి - అదనపు చీఫ్ జడ్జి–సిటీ సివిల్‌కోర్టు 26.ఎస్వీపీ సూర్యచంద్రకళ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి– బోధన్ ఫ్యామిలీ కోర్టు–ఎల్బీనగర్ 27.పి.నీరజ - అదనపు మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–మహబూబ్‌నగర్ 28.ఎం.జాన్సన్ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–సిరిసిల్ల - ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ కోర్టు స్పెషల్ జడ్జి 29.టి.జయలక్ష్మి - ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ కోర్టు స్పెషల్ జడ్జి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఫాస్ట్‌ట్రాక్–జనగామ 30.లాల్‌సింగ్ శ్రీనివాస్ నాయక్ - స్పెషల్ జడ్జి–సిటీ సివిల్ కోర్టు - చైర్మన్–ఇండస్ట్రీయల్ ట్రిబ్యునల్ 31.జి.సుదర్శన్ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–జగిత్యాల - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–సంగారెడ్డి 32.జి.ప్రేమలత - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–పోక్సో కేసులు - అదనపు జిల్లా జడ్జి–నల్లగొండ 33.పి.ముక్తిద - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–వరంగల్ - అదనపు ఫ్యామిలీ కోర్టు జడ్జి 34.బకరాజు శ్రీనివాసరావు - స్పెషల్ సెషన్స్ జడ్జి–అట్రాసిటీ అగైనెస్ట్ వుమెన్ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–నిజామాబాద్ 35.సీవీఎస్ సాయిభూపతి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–సత్తుపల్లి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–మహబుబాబాద్ 36.ఎం.భవాణి - అదనపు జిల్లా జడ్జి–నల్లగొండ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–సిద్దిపేట్ 37.కే.అరుణకుమారి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఖమ్మం అదనపు చీఫ్ జడ్జి–సిటీ సివిల్ కోర్టు 38.డి.మాధవీకృష్ణ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–కరీంనగర్ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–అదిలాబాద్ 39.కే.మారుతీదేవి - ఫ్యామిలీ కోర్టు జడ్జి–రంగారెడ్డి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–మెదక్ 40.ఎస్.సరిత - అదనపు చీఫ్ జడ్జి–సిటీ సివిల్ కోర్టు - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–మహబూబ్‌నగర్ 41.కే.జయంతి - అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి–మేడ్చల్ - ప్రిన్స్‌పల్ ఫ్యామిలీ కోర్టు జడ్జి–సికింద్రాబాద్ 42.వినోద్‌కుమార్ - అదనపు స్పెషల్ జడ్జి–ఎస్పీ అండ్ ఏసీబీ కేసులు - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఖమ్మం 43.కుమార్ వివేక్ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–కూకట్పల్లి - అదనపు జిల్లా జడ్జి –కరీంనగర్ 44.ఎం.పద్మజ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఫాస్ట్‌ట్రాక్ నల్లగొండ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–వరంగల్ 45.పి.లక్ష్మికుమారి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–రంగారెడ్డి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఫాస్ట్ ట్రాక్ కరీంనగర్ 46.ఎం.సతీశ్‌కుమార్ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఫాస్ట్‌ట్రాక్ కరీంనగర్ -అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–అదిలాబాద్ 47.ఎన్.రోజరమణి - అదనపు స్పెషల్ జడ్జి–సిటీ సివిల్ కోర్టు - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–వరంగల్ 48.టి.అనిత - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఫాస్ట్ ట్రాక్ మెదక్ - అదనపు మెట్రోపాలిటన్ స్పెషల్ జడ్జి–హైదరాబాద్ 49.మహ్మద్ అఫ్రోజ్ అక్తర్ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఖమ్మం - అదనపు జిల్లా జడ్జి–ఎల్బీ నగర్ 50.కే.ఉమాదేవి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–మహబూబ్‌నగర్ - అదనపు చీఫ్ జడ్జి–సిటీ సివిల్ కోర్టు 51.బి.అపర్ణాదేవి - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–రంగారెడ్డి - అదనపు చీఫ్ జడ్జి–సిటీ సివిల్ కోర్టు(ఫాస్ట్ ట్రాక్) 52.సీహెచ్ పంచాక్షరీ - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఫాస్ట్‌ట్రాక్, నిజామాబాద్ - జిల్లా సెషన్స్ జడ్జి నిజామాబాద్ 53.జే.కవిత - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–ఫాస్ట్ ట్రాక్ జనగామ - అదనపు మెట్రోపాలిటన్ సెసన్స్ జడ్జి హైదరాబాద్ 54.పి.ఆనీరోజ్ క్రిస్టియన్- అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–మహబూబ్‌నగర్ - జడ్జి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు–పోక్సో 55.ఎన్.సంతోష్‌కుమార్ - పోక్సో ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు–గద్వాల - అదనపు జిల్లా సెషన్స్ జడ్జి–మహబూబ్‌నగర్ -
పలువురు జిల్లా జడ్జిలు బదిలీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలువురు జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సీనియర్ సివిల్ జడ్జిలు కొందరికి పదోన్నతులు ఇస్తూ వారినీ బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో ఐదుగురు ప్రిన్సిపల్ జిల్లా జడ్జీలున్నారు. ► చిత్తూరు జిల్లా మదనపల్లి రెండో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా ఉన్న వైవీఎస్‌బీజీ పార్థసారథి చిత్తూరు ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. ► చిత్తూరు ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా ఉన్న ఏవీ రవీంద్రబాబు గుంటూరు ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా బదిలీ అయ్యారు. ► విజయనగరం ప్రిన్సిపల్ జిల్లా జడ్జి జి. గోపి శ్రీకాకుళం బదిలీ అయ్యారు. అక్కడ ఉన్న జి. రామకృష్ణ కృష్ణాజిల్లా ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా బదిలీ అయ్యారు. ► కడప 6వ అదనపు జిల్లా జడ్జి బి. సాయికళ్యాణ్ చక్రవర్తి విజయనగరం ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. మరికొందరు అదనపు జిల్లా జడ్జిలు, సీనియర్ సివిల్ జడ్జిలు పదోన్నతులు పొందారు. వీరంతా అక్టోబర్ 4లోపు కొత్త పోస్టుల్లో చేరాల్సి ఉంటుందని హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) గంథం సునీత పేరు మీద ఉత్తర్వులు వెలువడ్డాయి. -
న్యాయం బదిలీ
ప్రభుత్వానికి సైనిక బలం, బలగం, డబ్బు, ఆయుధాలు.. అన్నిటికీ మించి లక్షల కోట్ల ప్రజాధనంపై పెత్తనం, ఆ డబ్బు ఏవిధంగా ఖర్చు చేస్తున్నారో చెప్పకుండా దాచుకునేందుకు చెప్పనలవి కాని అధికారం ఉంటుంది. ప్రభువులను నియంతలుగా మార్చకుండా ఉండేం దుకే రాజ్యాంగ నియమాలు, పరిమితులు, బాధ్యతలు నిర్మించారు. వీటన్నింటినీ మించిన శక్తి బదిలీ అస్త్రం. నచ్చని వారిని, వారికి నచ్చని చోటికి పంపించే అధికారం పాలకులకు ఉంది. బదిలీ శిక్ష కాదని న్యాయసూత్రాలున్నాయి. కానీ, నేరగాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకున్నందుకు నీతివంతులైన కింది అధికారులను బదిలీచేయడం శిక్షకాదా? ఇందిరాగాంధీ హయాంలో కోర్టులు కొన్ని నిర్భయంగా తీర్పు చెప్పాయి. ఆమె పాలనలో తీసుకున్న రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలను రద్దు చేశాయి. చట్టవ్యతిరేకమయిన పనులను ఎత్తి చూపాయి. ఆమె ఎమర్జన్సీ విధించిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అందరికన్నా సీనియర్ న్యాయమూర్తిని నియమించడం సాంప్రదాయం. కానీ ఇందిరాగాంధీ సీనియర్ న్యాయమూర్తులు ముగ్గురిని కాదని వారికింద ఉన్న నాలుగో స్థానపు న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఆ ముగ్గురూ తమ న్యాయమూర్తి పదవులకు రాజీనామా చేసి వెళ్లిపోయారు. తమ కన్న జూనియర్ న్యాయమూర్తి ముందు చేతులు కట్టుకుని నిలబడే అవమానం కన్నా రాజీనామా చేయ డం సరైన నిర్ణయమని భావించి వారు సర్వీసు వదులుకున్నారు. ఇదొక రాజ్యాంగ వ్యతిరేక నియంతృత్వ పాలన ప్రభావం. ఇటీవల మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి విజయ తాహిల్రమణిని మేఘాలయ ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. మద్రాస్ హైకోర్టులో 75 మంది న్యాయమూర్తులు ఉంటారు. మేఘాలయలో చీఫ్‌తో సహా ఇద్దరే ఉన్నారు. ఒక స్థానం ఖాళీగా ఉంది. అంతపెద్ద కోర్టునుంచి అంత చిన్న హైకోర్టుకు బదిలీ చేయడం కక్ష సాధింపు చర్య కాకపోతే ఎందుకనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. కానీ దీనికి జవాబు లేదు. బిల్కీస్ బాను కేసులో హత్యలు, అత్యాచారాలు జరిపించిన పదకొండుమందికి శిక్ష పడితే విజయ బాంబే హైకోర్టు న్యాయమూర్తి అప్పీలులో ఖరారు చేసారు. కింది కోర్టు నిర్దోషులని విడుదల చేసిన అయిదుగురు పోలీసు ఉన్నతాధికారులకు, ఇద్దరు డాక్టర్లకు శిక్షలు విధించారు. వారు సాక్ష్యాలను ధ్వంసం చేశారనే నేరాలు రుజువు అయ్యాయని నిర్ధారించారు. ఇది గుజరాత్ మతకల్లోలాలకు సంబంధించిన తీర్పు కావడమే ఆమె బదిలీకి కారణమా అని అనుమానాలు వస్తున్నాయి. ఏడాది కిందట ఆగస్టులో ఆమె మద్రాస్ హైకోర్టుకు వచ్చారు. ఒక్క ఏడాదిపాటు ఉన్నచోట ఉండనీయండి అని ఆమె పెట్టుకున్న అర్జీని కొలీ జియం తిరస్కరించింది. అసలు ఆమె బదిలీకి కారణాలు లేవా? ఉంటే చెప్పడానికి వీల్లేని కారణాలా? కనీసం ఆమెకైనా చెప్పరా? ఇది వరకు జస్టిస్ జయంతి పటేల్‌ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. సీనియారిటీ ప్రకారం ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావలసిన వారు. లేదా కనీసం ఒక హైకోర్టుకు చీఫ్ జస్టిస్ కావలసిన వ్యక్తి. ఆయన కూడా తన పదవికి రాజీనామా చేశారు. గుజురాత్లో ఇష్రత్ జహాన్ మరో ముగ్గురి ఎన్కౌంటర్ కేసులో సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఆదేశించారు జస్టిస్ జయంతి పటేల్. అంతేకాదు ఆ దర్యాప్తును పర్యవేక్షించారు. ఆ దర్యాప్తులో పెద్ద ఐబీ అధికారుల అసలు నేరాలు బయటపడ్డాయి. ప్రభుత్వ ఒత్తిడులకు లొంగకుండా రాజ్యాంగం ప్రకారం న్యాయ నిర్ణయం చేసినందుకు అన్యాయపు బదిలీ చేయడం కక్ష సాధించడమే అని గుజరాత్ బార్ విమర్శించింది. మరో న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ హమీద్ ఖురేషిని కూడా గుజరాత్ హైకోర్టు నుంచి బొంబాయి హైకోర్టుకు బదిలీ చేశారు. సోహ్రాబుద్దీన్ కేసులో అమిత్ షాకు సీబీఐ రిమాండ్ ఆదేశించారీ న్యాయమూర్తి. గుజరాత్ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఏకగ్రీవంగా ఈ బదిలీని ఖండిస్తూ తీర్మానం చేసింది. అహంకారులైన పై అధికారులు గుమాస్తాలను బదిలీ చేసినట్టు కొలీజియం హైకోర్టు జడ్జిలను బదిలీ చేయడం రాజ్యాంగం న్యాయమూర్తులకు ఇచ్చిన ప్రాధాన్యతకు, స్వతంత్రతకు భంగకరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఖాలిద్ అన్నమాటలు గుర్తు చేసుకోవలసిన సందర్భం ఇది. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
తెలంగాణ టు తూర్పు
కాకినాడ లీగల్: రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా న్యాయశాఖలో పని చేస్తున్న పలువురు న్యాయమూర్తులను తెలంగాణ నుంచి ఆంధ్రకు, ఇక్కడి నుంచి అక్కడకు బదిలీ చేస్తూ రిజిస్ట్రార్ జనరల్ (ఎఫ్ఏసీ) ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరు జనవరి ఏడో తేదీలోగా విధుల్లో చేరాలని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి ఇక్కడికి.. సంగారెడ్డి జిల్లా మెదక్ ప్రిన్సిపల్ జిల్లా జడ్జి బి.సాయికల్యాణ్ చక్రవర్తిని రాజమహేంద్రవరం ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా నియమించారు. కర్నూలు జిల్లా ఆదోని రెండో అదనపు జిల్లా జడ్జి ఎన్. శ్రీనివాసరావును పిఠాపురం 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టుకు బదిలీ చేశారు. హైదరాబాద్ ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో పని చేస్తున్న ఎం.మాధురిని కాకినాడ మూడో అదనపు సీని యర్ సివిల్ జడ్జిగా నియమించారు. వరంగల్ మూడో అదనపు జూనియర్ సివిల్ జడ్జి గీతారా ణిని రాజమహేంద్రవరం ఏడో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నియమించారు. మెదక్ జిల్లా సంగారెడ్డి అదనపు జూనియర్ సివిల్ జడ్జి సీహెచ్ సునందమ్మను పెద్దాపురం అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నియమించారు. నల్గొండ జిల్లా నకిరేకల్ జూనియర్ సివిల్ జడ్జి వి.లక్ష్మీసత్యప్రసన్నను అమలాపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బదిలీ చేశారు. ఇక్కడి నుంచి తెలంగాణకు.. రాజమహేంద్రవరం ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఎన్.తుకారామ్జీని హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా బదిలీ చేశారు. కాకినాడ ఆరో జిల్లా జడ్జి ఎం.శ్రీనివాసాచార్యను సికింద్రాబాద్ 27వ అదనపు చీఫ్ జడ్జి సిటీ కోర్టుకు బదిలీ చేశారు. కాకినాడ మూడో అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె.అరుణకుమారిని మహబూబ్‌నగర్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా నియమించారు. అమలాపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వి.భవానీని వరంగల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బదిలీ చేశారు. -
పలువురు జిల్లా సీనియర్ సివిల్ జడ్జీలకు పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాలోని పలు జిల్లాల్లో పనిచేస్తున్న పలువురు సీనియర్ సివిల్ జడ్జీలకు పదోన్నతి కల్పిస్తూ, మరికొందరు జిల్లా జడ్జీలను బదిలీ చేస్తూ ఉమ్మడి హైకోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం.పి. సన్నిధిరావుకు పదోన్నతి కల్పిస్తూ విజయవాడ కోపరేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా నియమించారు. అనంతపురం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి.మాలతికి పదోన్నతి కల్పిస్తూ రాజమహేంద్రవరం ఫ్యామిలీ కోర్టు కమ్ 9వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్.రమేశ్ అదే ప్రాంతంలో ఏడవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. రాజమహేంద్రవరం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి సి.హెచ్. రాజగోపాలరావును ఒంగోలు 8వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమించారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ కోర్టు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వి.బాల భాస్కరరావుకు పదోన్నతి కల్పించి రంగారెడ్డి జిల్లా 8వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమించారు. హైదరాబాద్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి ఎ.కర్ణకుమార్కు పదోన్నతి కల్పించారు. ఆయన్ను చిత్తూరు 8వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమించారు. సికింద్రాబాద్ పదవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వీఏఎల్ సత్యవతిని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు 25వ అదనపు చీఫ్ జడ్జిగా బదిలీ చేశారు. వరంగల్ జిల్లా జనగాం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శాంతిని నెల్లూరు జిల్లా, గూడూరు 7వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమించారు. గుంటూరు జిల్లా తెనాలి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.రాధారత్నంను గుంటూరు ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కమ్ లేబర్ కోర్టు ప్రిసైడింగ్ అధికారిగా నియమించారు. కర్నూలు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఆర్.శివకుమార్ విశాఖపట్నం జిల్లా గాజువాక 13వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. నిజామాబాద్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం.వెంకట హరినాథ్‌ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు రెండవ అదనపు చీఫ్ జడ్జిగా నియమించారు. గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఒ. వెంకట నాగేశ్వరరావు విశాఖపట్నం 11వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. గుంటూరు నాల్గవ అదనపు సీనియర్ సివిల్ జడ్జి పి.కమలాదేవి అనంతపురం జిల్లా గుత్తి 6వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. రంగారెడ్డి జిల్లా, ఎల్బీ నగర్ కోర్టు 7వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి హుజైబ్ అహ్మద్ ఖాన్‌ను నల్లగొండ జిల్లా, 7వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమించారు. గుంటూరు, నర్సరావుపేట ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎ.లక్ష్మి గుంటూరు నాల్గవ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. నల్లగొండ నాల్గవ అదనపు జిల్లా జడ్జి సీపీ వింధేశ్వరిని అదే జిల్లా మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు 7వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి ఆర్.జె. విశ్వనాథంను ఒంగోలు 1వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమించారు. బదిలీ అయిన వారందరూ కూడా ఈ నెల 30వ తేదీకల్లా ప్రస్తుతం ఉన్న పోస్టుల నుంచి రిలీవై అక్టోబర్ 7వ తేదీలోగా కొత్త పోస్టుల్లో చేరాలని హైకోర్టు ఆదేశించింది. -
న్యాయమూర్తుల పదోన్నతులు, బదిలీలు
అనంతపురం లీగల్ : జిల్లాలో పలువురు న్యాయమూర్తులు పదోన్నతులు, బదిలీలు అయ్యారు. అనంతపురం ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి రామచంద్రుడు పదోన్నతి పొంది తిరుపతి అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా నియమితులయ్యారు. తాడిపత్రి జూనియర్ సివిల్ జడ్జి సయ్యద్ కలీముల్లా విశాఖపట్నం 7వ అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి పొందారు. గుంతకల్లు రైల్వే మేజిస్ట్రేట్‌గా ఉన్న సుబ్బారెడ్డి విశాఖపట్నం 4వ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌గా పదోన్నతిపై నియమితులయ్యారు.అలాగే పెనుకొండ సీనియర్ సివిల్ జడ్జి సుమలత కదిరి సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యారు. కదిరి సీనియర్ సివిల్ జడ్జిగా ఉన్న షేక్ మహమ్మద్ ఫజులుల్లా ప్రకాశం జిల్లా పరుచూరు సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యారు.