
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలువురు జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సీనియర్ సివిల్ జడ్జిలు కొందరికి పదోన్నతులు ఇస్తూ వారినీ బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో ఐదుగురు ప్రిన్సిపల్ జిల్లా జడ్జీలున్నారు.
► చిత్తూరు జిల్లా మదనపల్లి రెండో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా ఉన్న వైవీఎస్‌బీజీ పార్థసారథి చిత్తూరు ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా నియమితులయ్యారు.
► చిత్తూరు ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా ఉన్న ఏవీ రవీంద్రబాబు గుంటూరు ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా బదిలీ అయ్యారు.
► విజయనగరం ప్రిన్సిపల్ జిల్లా జడ్జి జి. గోపి శ్రీకాకుళం బదిలీ అయ్యారు. అక్కడ ఉన్న జి. రామకృష్ణ కృష్ణాజిల్లా ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా బదిలీ అయ్యారు.
► కడప 6వ అదనపు జిల్లా జడ్జి బి. సాయికళ్యాణ్ చక్రవర్తి విజయనగరం ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా నియమితులయ్యారు.
మరికొందరు అదనపు జిల్లా జడ్జిలు, సీనియర్ సివిల్ జడ్జిలు పదోన్నతులు పొందారు. వీరంతా అక్టోబర్ 4లోపు కొత్త పోస్టుల్లో చేరాల్సి ఉంటుందని హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) గంథం సునీత పేరు మీద ఉత్తర్వులు వెలువడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment