district judge transfer
-
తెలంగాణలో 9 మంది జిల్లా జడ్జిల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది మంది జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) సాయి రమాదేవి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా వి.బి.నిర్మల గీతాంబ, రాష్ట్ర వ్యాట్ అప్పీలేట్ ట్రైబ్యునల్ ఛైర్ పర్సన్ గా జి.అనుపమ చక్రవర్తి, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా వై.రేణుక, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జిగా ఇ.తిరుమల దేవి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా ఎం.వి.రమేష్, జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ గా సిహెచ్.కె.భూపతి, నల్గొండ జిల్లా ప్రిన్సిపల్ జడ్జిగా బి.ఎస్.జగ్జీవన్ కుమార్, నిజామాబాద్ జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జిగా సునీత కుంచాల, ఆదిలాబాద్ జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జిగా మంత్రి రామకృష్ణ సునీతలను బదిలీ చేశారు. -
పలువురు జిల్లా జడ్జిలు బదిలీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలువురు జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సీనియర్ సివిల్ జడ్జిలు కొందరికి పదోన్నతులు ఇస్తూ వారినీ బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో ఐదుగురు ప్రిన్సిపల్ జిల్లా జడ్జీలున్నారు. ► చిత్తూరు జిల్లా మదనపల్లి రెండో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా ఉన్న వైవీఎస్బీజీ పార్థసారథి చిత్తూరు ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. ► చిత్తూరు ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా ఉన్న ఏవీ రవీంద్రబాబు గుంటూరు ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా బదిలీ అయ్యారు. ► విజయనగరం ప్రిన్సిపల్ జిల్లా జడ్జి జి. గోపి శ్రీకాకుళం బదిలీ అయ్యారు. అక్కడ ఉన్న జి. రామకృష్ణ కృష్ణాజిల్లా ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా బదిలీ అయ్యారు. ► కడప 6వ అదనపు జిల్లా జడ్జి బి. సాయికళ్యాణ్ చక్రవర్తి విజయనగరం ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. మరికొందరు అదనపు జిల్లా జడ్జిలు, సీనియర్ సివిల్ జడ్జిలు పదోన్నతులు పొందారు. వీరంతా అక్టోబర్ 4లోపు కొత్త పోస్టుల్లో చేరాల్సి ఉంటుందని హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) గంథం సునీత పేరు మీద ఉత్తర్వులు వెలువడ్డాయి. -
జిల్లా జడ్జి హరిహరనాథ శర్మ బదిలీ
అనంతపురం లీగల్ : జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరిహరనాథ శర్మను బదిలీ చేస్తూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన్ను గుంటూరు జిల్లా న్యాయమూర్తిగా నియమించింది. ఈయన స్థానంలో మొదటి అదనపు జిల్లా జడ్జి సుబ్రమణ్యకుమార్కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం సుబ్రమణ్యకుమార్ కుటుంబ న్యాయస్థానం జడ్జిగానూ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వచ్చిన హరిహరనాథ శర్మ పరిపాలనా పరంగా కొన్ని విప్లవాత్మక చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లాకు చెందిన ఈయన న్యాయవాదులకు జూనియర్ సివిల్ జడ్జి రాత పరీక్షలకు సంబంధించి కోచింగ్ ఇవ్వడం, కోర్టు ఆవరణలో స్వచ్ఛభారత్ వంటి కార్యక్రమాలు చేపట్టి తనదైన శైలిని చూపారు.