
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది మంది జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) సాయి రమాదేవి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా వి.బి.నిర్మల గీతాంబ, రాష్ట్ర వ్యాట్ అప్పీలేట్ ట్రైబ్యునల్ ఛైర్ పర్సన్ గా జి.అనుపమ చక్రవర్తి, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా వై.రేణుక, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జిగా ఇ.తిరుమల దేవి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా ఎం.వి.రమేష్, జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ గా సిహెచ్.కె.భూపతి, నల్గొండ జిల్లా ప్రిన్సిపల్ జడ్జిగా బి.ఎస్.జగ్జీవన్ కుమార్, నిజామాబాద్ జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జిగా సునీత కుంచాల, ఆదిలాబాద్ జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జిగా మంత్రి రామకృష్ణ సునీతలను బదిలీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment