జిల్లాలో పలువురు న్యాయమూర్తులు పదోన్నతులు, బదిలీలు అయ్యారు.
అనంతపురం లీగల్ : జిల్లాలో పలువురు న్యాయమూర్తులు పదోన్నతులు, బదిలీలు అయ్యారు. అనంతపురం ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి రామచంద్రుడు పదోన్నతి పొంది తిరుపతి అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా నియమితులయ్యారు. తాడిపత్రి జూనియర్ సివిల్ జడ్జి సయ్యద్ కలీముల్లా విశాఖపట్నం 7వ అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి పొందారు.
గుంతకల్లు రైల్వే మేజిస్ట్రేట్‌గా ఉన్న సుబ్బారెడ్డి విశాఖపట్నం 4వ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌గా పదోన్నతిపై నియమితులయ్యారు.అలాగే పెనుకొండ సీనియర్ సివిల్ జడ్జి సుమలత కదిరి సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యారు. కదిరి సీనియర్ సివిల్ జడ్జిగా ఉన్న షేక్ మహమ్మద్ ఫజులుల్లా ప్రకాశం జిల్లా పరుచూరు సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యారు.