జూనియర్‌ కళాశాల లెక్చరర్లకు పదోన్నతులు | promotions to junior college lecturers | Sakshi
Sakshi News home page

జూనియర్‌ కళాశాల లెక్చరర్లకు పదోన్నతులు

Published Thu, Dec 29 2016 10:57 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

promotions to junior college lecturers

అనంతపురం ఎడ్యుకేషన్‌ : జూనియర్‌ కళాశాలల్లో అర్హులైన అధ్యాపకులు, లైబ్రేరియన్లకు శుక్రవారం డిగ్రీ కళాశాల అధ్యాపకులు, లైబ్రేరియన్లుగా పదోన్నతులు కల్పించనున్నారు. వారికి విజయవాడలోని కళాశాల విద్య కమిషనర్‌ కార్యాలయంలో కౌన్సెలింగ్‌ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 119 మంది జూనియర్‌ లెక్చరర్లకు డిగ్రీ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పిస్తుండగా, వారిలో మన జిల్లావారు 19 మంది ఉన్నారని జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్‌ తెలిపారు. అలాగే జూనియర్‌ కళాశాలల్లో పని చేస్తున్న 27 మంది లైబ్రేరియన్లకు పదోన్నతులు కల్పిస్తుండగా వారిలో మన జిల్లా నుంచి నలుగురు ఉన్నారని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement