సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాలోని పలు జిల్లాల్లో పనిచేస్తున్న పలువురు సీనియర్ సివిల్ జడ్జీలకు పదోన్నతి కల్పిస్తూ, మరికొందరు జిల్లా జడ్జీలను బదిలీ చేస్తూ ఉమ్మడి హైకోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం.పి. సన్నిధిరావుకు పదోన్నతి కల్పిస్తూ విజయవాడ కోపరేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా నియమించారు. అనంతపురం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి.మాలతికి పదోన్నతి కల్పిస్తూ రాజమహేంద్రవరం ఫ్యామిలీ కోర్టు కమ్ 9వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్.రమేశ్ అదే ప్రాంతంలో ఏడవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. రాజమహేంద్రవరం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి సి.హెచ్. రాజగోపాలరావును ఒంగోలు 8వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమించారు. రంగారెడ్డి జిల్లా ఎల్‌బీ నగర్ కోర్టు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వి.బాల భాస్కరరావుకు పదోన్నతి కల్పించి రంగారెడ్డి జిల్లా 8వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమించారు. హైదరాబాద్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి ఎ.కర్ణకుమార్‌కు పదోన్నతి కల్పించారు. ఆయన్ను చిత్తూరు 8వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమించారు. సికింద్రాబాద్ పదవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వీఏఎల్ సత్యవతిని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు 25వ అదనపు చీఫ్ జడ్జిగా బదిలీ చేశారు.
వరంగల్ జిల్లా జనగాం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శాంతిని నెల్లూరు జిల్లా, గూడూరు 7వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమించారు. గుంటూరు జిల్లా తెనాలి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.రాధారత్నంను గుంటూరు ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కమ్ లేబర్ కోర్టు ప్రిసైడింగ్ అధికారిగా నియమించారు. కర్నూలు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఆర్.శివకుమార్ విశాఖపట్నం జిల్లా గాజువాక 13వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. నిజామాబాద్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం.వెంకట హరినాథ్‌ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు రెండవ అదనపు చీఫ్ జడ్జిగా నియమించారు. గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఒ. వెంకట నాగేశ్వరరావు విశాఖపట్నం 11వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. గుంటూరు నాల్గవ అదనపు సీనియర్ సివిల్ జడ్జి పి.కమలాదేవి అనంతపురం జిల్లా గుత్తి 6వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. రంగారెడ్డి జిల్లా, ఎల్‌బీ నగర్ కోర్టు 7వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి హుజైబ్ అహ్మద్ ఖాన్‌ను నల్లగొండ జిల్లా, 7వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమించారు. గుంటూరు, నర్సరావుపేట ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎ.లక్ష్మి గుంటూరు నాల్గవ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. నల్లగొండ నాల్గవ అదనపు జిల్లా జడ్జి సీపీ వింధేశ్వరిని అదే జిల్లా మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు 7వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి ఆర్.జె. విశ్వనాథంను ఒంగోలు 1వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమించారు. బదిలీ అయిన వారందరూ కూడా ఈ నెల 30వ తేదీకల్లా ప్రస్తుతం ఉన్న పోస్టుల నుంచి రిలీవై అక్టోబర్ 7వ తేదీలోగా కొత్త పోస్టుల్లో చేరాలని హైకోర్టు ఆదేశించింది.
Published Sun, Sep 24 2017 2:13 AM | Last Updated on Sun, Sep 24 2017 2:13 AM
Advertisement
Advertisement