హైదరాబాద్ : రాష్ట్రపతి పంపిన విభజన బిల్లుకు ఎటువంటి సవరణలుగానీ ఓటింగ్‌గానీ చేసే అధికారం అసెంబ్లీకి లేదని కేవలం క్లాజులవారీగా అభిప్రాయాలను మాత్రమే రాష్ట్రపతి కోరారని తెలంగాణ శాసనసభ్యులు స్పీకర్‌కు లేఖ రాసేపనిలో పడ్డారు. ఇతర రాష్ట్రాల్లో విభజన జరిగిన విధానాలతో రాష్ట్ర అసెంబ్లీకి సంబంధం లేదని.. బీహార్‌లోనూ, ఉత్తరప్రదేశ్లోనూ విభజన బిల్లుపై ఓటింగ్ జరిగిందని.. ఇక్కడ కూడా ఓటింగ్ నిర్వహిస్తామనడం సరికాదని.. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు.
బిల్లుపై ఓటింగ్, సవరణలు ఆమోదనీయం కావని తాము వ్యతిరేకిస్తామని అన్ని పార్టీల తెలంగాణ ఎమ్మెల్యేలు తెలిపారు. ఈమేరకు తెలంగాణ సభ్యులందరి సంతకాలతో కూడిన లేఖ రాసే బాధ్యతను విప్ అనిల్‌కు అప్పగించారు. మరోవైపు విభజన బిల్లుపై ఓటింగ్ జరిపే అధికారం సభకు లేదంటూ.. బిల్లుపై సవరణలు అడగడం సరికాదని చెబుతూ తెలంగాణ మంత్రులు స్పీకర్‌ను కలిశారు.
స్పీకర్కు తెలంగాణ ఎమ్మెల్యేల లేఖ!
Published Tue, Jan 7 2014 2:37 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement
Advertisement