విభజన బిల్లుపై ఓటింగ్ వద్దు, చర్చ చాలు
హైదరాబాద్ : రాష్ట్ర విభజన బిల్లుపై ఓటింగ్ అవసరం లేదని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి అన్నారు. బిల్లుపై సుదీర్ఘంగా చర్చ మాత్రమే జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో గురువారం విజయమ్మ అడిగిన ప్రశ్నకు మంత్రి ఆనం సమాధానమిచ్చారు. రాష్ట్రపతి కేవలం అభిప్రాయాలు మాత్రమే అడిగారని.... ఇప్పుడు ఓటింగ్ జరపాలని విజయమ్మ అడగటం సరికాదన్నారు. అన్ని ప్రాంతాల అభిప్రాయాలు తెలిపితే చాలని ఆనం అన్నారు. ప్రాంతాలకు అతీతంగా అన్నిపార్టీలు రాష్ట్ర ప్రజల అభిప్రాయాలు తెలిపాలన్నారు. సభను సజావుగా నడిపి చర్చను నిర్వహించాలని ఆనం పేర్కొన్నారు.