తెలంగాణ ప్రక్రియ ఆగిపోలేదు: మధుయాష్కీ | Telangana process should continue: Madhu Yaskhi | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రక్రియ ఆగిపోలేదు: మధుయాష్కీ

Published Thu, Aug 8 2013 2:48 PM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

తెలంగాణ ప్రక్రియ ఆగిపోలేదు: మధుయాష్కీ - Sakshi

తెలంగాణ ప్రక్రియ ఆగిపోలేదు: మధుయాష్కీ

న్యూఢిల్లీ : తెలంగాణ ప్రక్రియ ఆగిపోలేదని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ డిప్యూటీ చీఫ్ విప్‌ మధుయాష్కీ అన్నారు. తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన గురువారమిక్కడ తెలిపారు. హోంమంత్రి అనారోగ్యం కారణంగానే కొంత ఆలస్యం జరిగిందని మధుయాష్కీ అన్నారు. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రులు అనవసర భయాలు, అపోహలు సృష్టించుకోవద్దని ఆయన సూచించారు.

కాగా ఈరోజు సాయంత్రం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం చర్చకు రావటం లేదని సమాచారం. సాయంత్రం 5.30 గంటలకు మంత్రి మండలి సమావేశమవుతున్న విషయం తెలిసిందే. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అనారోగ్యం కారణంగా ఈ అంశం చర్చించటం లేదని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement